ప్రపంచకప్ 2019: ఆస్ట్రేలియాపై 36 పరుగులతో భారత్ విజయం

ఫొటో సోర్స్, Getty Images
క్రికెట్ ప్రపంచకప్ 2019లో ఈరోజు భారత జట్టు.. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో పోటీ పడుతోంది. ఇప్పటివరకూ జరిగిన ప్రపంచకప్ సమరాల్లో 11 సార్లు భారత్, ఆస్ట్రేలియా జట్లు పోటీపడ్డాయి. వీటిలో 8 సార్లు ఆస్ట్రేలియా గెలవగా, భారత జట్టు మూడుసార్లు మాత్రమే గెలిచింది. అయితే, ఈ మ్యాచ్‌లో మాత్రం భారత జట్టు గెలుపొందింది.
భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా 323 పరుగులు సాధిస్తే ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరును చేధించిన జట్టుగా రికార్డు సృష్టించినట్లు అయ్యేది.
కానీ, ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 316 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అలెక్స్ క్యారీ (35 బంతుల్లో ఒక సిక్స్, ఐదు ఫోర్లతో 55 పరుగులు) నాటౌట్‌గా నిలిచాడు.
భారత బౌలర్లలో.. బువనేశ్వర్ కుమార్ 50 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు, బుమ్రా 61 పరుగులిచ్చి మూడు వికెట్లు తీయగా, చాహల్ 62 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.
సెంచరీ(109 బంతుల్లో 16 ఫోర్లతో 117 పరుగులు)తో భారత భారీ స్కోరుకు కారణమైన ఓపెనర్ శిఖర్ ధావన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

ఫొటో సోర్స్, Getty Images
పదో వికెట్
ఇన్నింగ్స్ చివరి బంతికి ఆడమ్ జంపా (మూడు బంతుల్లో ఒక పరుగు) ఔటయ్యాడు.
తొమ్మిదో వికెట్
49.1వ ఓవర్‌కు మిచెల్ స్టార్క్ (మూడు బంతుల్లో 3 పరుగులు) రనౌట్ అయ్యాడు.
ఎనిమిదో వికెట్
46.6 ఓవర్లకు పాట్ కమ్మిన్స్ (7 బంతుల్లో ఒక ఫోర్‌తో 8 పరుగులు) ఔటయ్యాడు.
ఏడో వికెట్
44.5 ఓవర్లకు నాథన్ కౌల్టెర్ నైల్ (9 బంతుల్లో 4 పరుగులు) ఔటయ్యాడు.
ఆరో వికెట్
40.4 ఓవర్లకు మ్యాక్స్‌వెల్ (14 బంతుల్లో ఐదు ఫోర్లతో 28 పరుగులు) ఔటయ్యాడు.
ఐదో వికెట్
39.6 ఓవర్లకు మార్కస్ స్టోనిస్ (2 బంతుల్లో సున్నా) డకౌట్ అయ్యాడు.
నాలుగో వికెట్
39.4 ఓవర్లకు స్టీవ్ స్మిత్ (70 బంతుల్లో ఒక సిక్స్, ఐదు ఫోర్లతో 69 పరుగులు) ఔటయ్యాడు.
మూడో వికెట్
36.4 ఓవర్లకు ఉస్మాన్ ఖవాజా (39 బంతుల్లో ఒక సిక్స్, నాలుగు ఫోర్లతో 42 పరుగులు) ఔటయ్యాడు.
రెండో వికెట్
24.4 ఓవర్లకు డేవిడ్ వార్నర్ (84 బంతుల్లో ఐదు ఫోర్లతో 56 పరుగులు) ఔటయ్యాడు.
మొదటి వికెట్
13.1 ఓవర్లకు ఆరోన్ ఫించ్ (35 బంతుల్లో ఒక సిక్స్, మూడు ఫోర్లతో 36 పరుగులు) రనౌట్ అయ్యాడు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ 352/5
ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై ఒక జట్టు చేసిన భారీ స్కోరు ఇదేనని, ప్రపంచకప్‌లో 300లకు పైగా పరుగులు ఇవ్వటం ఆస్ట్రేలియాకు ఇది రెండోసారి మాత్రమేనని బీబీసీ కోసం కామెంట్రీ చేసే ఆండీ జల్ట్‌మాన్ తెలిపారు.
కేఎల్ రాహుల్ (3 బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్‌తో 11 పరుగులు), కేదార్ జాదవ్ నాటౌట్‌గా నిలిచారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో కమ్మిన్స్ 55 పరుగులు ఇచ్చి ఒక వికెట్, స్టార్క్ 74 పరుగులు ఇచ్చి ఒక వికెట్, కౌల్టెర్ నైల్ 63 పరుగులు ఇచ్చి ఒక వికెట్ సాధించగా.. స్టోనిస్ 62 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు సాధించాడు.
ఐదో వికెట్
49.5 ఓవర్లకు విరాట్ కోహ్లీ (77 బంతుల్లో రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో 82 పరుగులు) ఔటయ్యాడు.
నాలుగో వికెట్
49.1 ఓవర్లకు ఎంఎస్ ధోనీ (14 బంతుల్లో ఒక సిక్స్, మూడు ఫోర్లతో 27 పరుగులు) ఔటయ్యాడు.
మూడో వికెట్
45.5 ఓవర్లకు హార్థిక్ పాండ్యా అర్థ సెంచరీకి రెండు పరుగుల దూరంలో (27 బంతుల్లో మూడు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో 48 పరుగులు) ఔటయ్యాడు.
ఓవల్ స్టేడియంలో మహేశ్ బాబు
టాలీవుడ్ హీర్ మహేశ్ బాబు.. తన కుటుంబం, డైరెక్టన్ వంశీ పైడిపల్లితో పాటు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ చూస్తున్నారు. కొడుకుతో దిగిన సెల్ఫీని ఆయన ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
రెండో వికెట్
36.6 ఓవర్లకు శిఖర్ ధావన్ (109 బంతుల్లో 16 ఫోర్లతో 117 పరుగులు) ఔటయ్యాడు.
ఓవల్ స్టేడియంలో విజయ్ మాల్యా
బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టారంటూ కేసులు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా.. తన కొడుకు సిద్ధార్థ్ మాల్యాతో కలసి ఓవల్ మైదానంలో భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ వీక్షిస్తున్నారు. ఈ ఫొటోను సిద్ధార్థ్ మాల్యా తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, facebook/sidmallya
శిఖర్ ధావన్ సెంచరీ
ఓపెనర్ శిఖర్ ధావన్ 95 బంతుల్లో 13 ఫోర్ల సహాయంతో 100 పరుగులు పూర్తి చేశాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఓవల్ స్టేడియంలో ఏపీ ఎంపీ
శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా రెండోసారి గెలుపొందిన కింజరపు రామ్మోహన్ నాయుడు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఓవల్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌కు హాజరయ్యారు. భార్య శ్రీ శ్రావ్య తీసిన సెల్ఫీని ఆయన ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3

ఫొటో సోర్స్, Getty Images
తొలి వికెట్
22.3 ఓవర్ల వద్ద రోహిత్ శర్మ (70 బంతుల్లో ఒక సిక్స్, మూడు ఫోర్లతో 57 పరుగులు) ఔటయ్యాడు.
రోహిత్ శర్మ అర్థ సెంచరీ
దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో సెంచరీతో ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో 61 బంతుల్లో ఒక సిక్స్, మూడు ఫోర్లతో అర్థ సెంచరీ చేశాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ధావన్ అర్థ సెంచరీ
శిఖర్ ధావన్ 53 బంతుల్లో తన అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో ఏడు ఫోర్లు ఉన్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
ఆస్ట్రేలియాపై రోహిత్ 2 వేల పరుగులు..
రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై వన్డేల్లో 2 వేల పరుగులు పూర్తి చేశాడు. 37 ఇన్నింగ్స్‌ల్లోనే అతను రెండు వేల పరుగులు చేయడం విశేషం. ప్రపంచంలో ఏ బ్యాట్స్‌మెన్, ఏ జట్టుపైనా ఇంత తక్కువ ఇన్నింగ్స్‌ల్లో రెండు వేల పరుగులు చేయలేదు. కాగా, ఆస్ట్రేలియాపై రెండు వేల పరుగులు చేసిన నాలుగో బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా
ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌లు ఆడి, రెండింటిలోనూ గెలిచింది. ప్రపంచకప్‌లో గత పది మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాకు ఓటమి అనేదే లేదు. భారత్‌తో ఆడిన గత మూడు వన్డేల్లోనూ ఆస్ట్రేలియానే గెలిచింది.
భారత జట్టు దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచ్‌లో గెలుపొందింది.
ఓవల్‌లో సచిన్
లిటిల్ మాస్టర్‌గా పేరున్న మాజీ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం క్రికెట్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అందుకోసం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న ఓవల్ మైదానం భవనం వద్దకు ఆయన రాగానే అక్కడ ఉన్న అభిమానులు సచిన్, సచిన్ అంటూ నినాదాలు చేశారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
భారత జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోనీ, హార్థిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా
ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోనిస్, అలెక్స్ క్యారీ, నాథన్ కౌల్టెర్ నైల్, పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా

ఇవి కూడా చదవండి:
- వీకెండ్లో విశ్రాంతి కోసం ఓ పది విషయాలు
- క్రికెట్ ప్రపంచకప్ 2019: మీరు తెలుసుకోవాల్సిన 12 విషయాలు
- మోదీ తొలి విదేశీ పర్యటనకు మాల్దీవులనే ఎందుకు ఎంచుకున్నారు
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- క్రికెట్ వరల్డ్ కప్ 2019: పోటీ ఈ మూడు జట్ల మధ్యే ఉంటుందా?
- జగన్ క్యాబినెట్: ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు.. దేశ చరిత్రలో ఇదే తొలిసారి
- రాజ్‌నాథ్ సింగ్ బీజేపీకి కొత్త చిక్కుముడిలా మారారా: అభిప్రాయం
- ఆపరేషన్ బ్లూ స్టార్: స్వర్ణ మందిరంలోకి భారత యుద్ధ ట్యాంకులు ప్రవేశించగానే ఏం జరిగింది
- కోహ్లీ - స్మిత్: ఇద్దరిలో ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ ఎవరు
- మహేంద్ర సింగ్ ధోని ఆ కీపింగ్ గ్లవ్స్ వాడకూడదన్న ఐసీసీ.. అవే కొనసాగిస్తాడన్న బీసీసీఐ
- ఇండియాVsదక్షిణాఫ్రికా: రోహిత్ శర్మ సెంచరీ, 6 వికెట్ల తేడాతో భారత్ విజయం
- వాస్కో డి గామా: భారతదేశాన్ని వెతకాలనే కోరిక వెనుక అసలు కారణం ఇదీ..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)