'బలిదాన్' కీపింగ్ గ్లవ్స్ మార్చిన మహేంద్ర సింగ్ ధోనీ

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ భారత పారా స్పెషల్ ఫోర్సెస్ 'బలిదాన్' గుర్తున్న గ్లవ్స్ ధరించాడు. వాటిని వాడొద్దని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చెప్పింది.
దీంతో ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ తన గ్లవ్స్ మార్చాడు.
'బలిదాన్' గుర్తు లేని గ్లవ్స్ ధరించి కీపింగ్ చేశాడు.

ఫొటో సోర్స్, AFP
వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా తొలిమ్యాచ్‌లో స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ధరించిన గ్లవ్స్ పెద్ద చర్చకే కారణమైంది.
సౌతాంప్టన్‌లో దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచ్‌లో కీపింగ్ చేసేప్పుడు అతడు భారత పారా స్పెషల్ ఫోర్సెస్ 'రెజిమెంటల్ డాగర్' లోగో ఉన్న గ్లవ్స్‌ను ధరించాడు.

ఫొటో సోర్స్, PARA SPECIAL FORCES
దేశ సైన్యం పట్ల ఉన్న అభిమానాన్ని ధోని ఈ విధంగా చాటుకున్నాడంటూ అతడిని సమర్థిస్తూ చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశారు.
అయితే, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మాత్రం ఇలాంటి గ్లవ్స్ ధరించకూడదని పేర్కొంది. తదుపరి మ్యాచ్ నుంచి ధోని వాటిని వాడకుండా చూడాలని బీసీసీఐని కోరింది.
రాజకీయ, జాతి, మత, సైనిక పరమైన సందేశాలను ఆటగాళ్లు ప్రదర్శించడం ఐసీసీ నిబంధనలకు విరుద్ధం. ధోని గ్లవ్స్ వద్దనడానికి కూడా ఐసీసీ ఇదే కారణం చూపుతోంది.

ఫొటో సోర్స్, YOUTUBE GRAB
మొదటి ఉల్లంఘనకు శిక్ష ఉండదు
ధోనిపై ఏవైనా చర్యలుంటాయా అని ప్రశ్నించినప్పుడు.. ''మొదటి ఉల్లంఘనే కాబట్టి అలాంటిదేమీ లేదు. ఆ చిహ్నాని వాడొద్దని మాత్రమే కోరాం'' ఐసీసీ స్ట్రాటజిక్ కమ్యునికేషన్స్ జనరల్ మేనేజర్ క్లెయిర్ ఫర్లాంగ్ పీటీఐ వార్తాసంస్థతో చెప్పారు.
ధోనీకి భారత సైన్యం 2011లో పారాషూట్ రెజిమెంట్‌లో లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ఇచ్చింది. 2015లో అతడు పారా బ్రిగేడ్ శిక్షణ కూడా పొందాడు.
చాలా కాలంగా మ్యాచ్‌ల్లో కీపింగ్ చేసే సమయంలోనూ ధోని కామోఫ్లాజ్ (సైనిక దుస్తుల రంగుల్లోని) గ్లవ్స్‌నే ధరిస్తుంటాడు.
వరల్డ్ కప్ దక్షిణాఫ్రికాతో భారత్ ఆడిన తొలి మ్యాచ్‌లో ధోని రెజిమెంటల్ డాగర్ చిహ్నం ఉన్న గ్లవ్స్ ధరించినందుకు చాలా మంది సోషల్ మీడియాలో అతడిని అభినందిస్తూ పోస్ట్‌లు పెట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఐసీసీ తీరును ఇప్పుడు వీరంతా విమర్శిస్తున్నారు.
ట్విటర్‌లో #DhoniKeepTheGlove (ధోని గ్లవ్స్ తీయకు) అనే హ్యాష్‌టాగ్ ట్రెండ్ అయ్యింది.
చాలా మంది ప్రముఖులు కూడా అతడికి మద్దతుగా ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ధోని ఆ గ్లవ్స్ ధరించడం కొనసాగిస్తాడని, ఈ విషయంలో అతడిగా అండగా ఉంటామని భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇందుకు అనుమతించాలంటూ ఐసీసీకి అభ్యర్థనను పంపామని బీసీసీఐ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ పీటీఐకి తెలిపారు.
''పారా స్పెషల్ ఫోర్సెస్ 'రెజిమెంటల్ డాగర్' లోగోలో బలిదాన్ అని రాసి ఉంటుంది. ధోని గ్లవ్స్‌పై అది లేదు. ఈ గ్లవ్స్ నిబంధనలకు విరుద్ధం కాదు'' అని ఆయన అన్నారు.
ఐసీసీ కేవలం అభ్యర్థనే చేసిందని, ఆదేశం ఏమీ ఇవ్వలేదని రాయ్ వివరించారు.
ఆస్ట్రేలియాతో భారత్ ఆడనున్న తదుపరి మ్యాచ్ కన్నా ముందే, బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ ఈ అంశంపై ఐసీసీ సీనియర్ అధికారులను కలుస్తారని పేర్కొన్నారు.
కానీ, ఐసీసీ మాత్రం బలిదాన్ గుర్తున్న గ్లవ్స్ ధరించడం నిబంధనలకు విరుద్ధమని, ధోనీ వాటిని వాడరాదని స్పష్టం చేయటంతో, ధోనీ తన గ్లవ్స్ మార్చాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి:
- LIVE: #INDvAUS ఆస్ట్రేలియా 316 ఆలౌట్.. 36 పరుగులతో భారత్ విజయం
- #INDvAUS జింగ్ బెయిల్స్: ‘బాల్ వికెట్లకు తగిలినా బెయిల్స్ పడకపోవడం ఈ ప్రపంచకప్‌లో ఇది ఐదోసారి’
- IND vs AUS: భారత్ ఆర్మీ క్యాప్‌లపై ఐసీసీకి పాకిస్తాన్ ఫిర్యాదు
- టీమిండియాను ఉత్సాహపరిచే అభిమాన 'సైన్యం' భారత్ ఆర్మీ
- డేటింగ్ యాప్స్ వాడే వాళ్లు అందం కోసం ఏం చేస్తున్నారో ఊహించగలరా
- ఆపరేషన్ బ్లూ స్టార్: ‘కాల్పుల శబ్దం ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతోంది’
- పాకిస్తాన్ బడ్జెట్: ఈ అప్పుల 'విషవలయం' నుంచి ఇమ్రాన్ ఖాన్ బయటపడేది ఎలా?
- కోహ్లీ - స్మిత్: ఇద్దరిలో ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ ఎవరు
- ఈవిడ షాపింగ్ బిల్లు రూ.140 కోట్లు..
- యూట్యూబ్ ప్రాంక్: బిస్కెట్లలో టూత్‌పేస్టు.. 15 నెలలు జైలు, 15 లక్షలు జరిమానా
- నా కార్టూన్లే నా ప్రాణాలు కాపాడాయి.. కొత్త జీవితాన్ని ఇచ్చాయి.. ఇదీ నా కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








