Telangana: ప్రధాని మోదీ పర్యటనలో కనిపించని కేసీఆర్, బీజేపీ నేతల విమర్శలు

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, ANI

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెలంగాణలో వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. తొలుత ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలలో పాల్గొన్న ఆయన అనంతరం ముచ్చింతల్‌లోని రామానుజాచార్య విగ్రహం ‘Statue Of Equality'ని ఆవిష్కరించారు.

అయితే, ప్రధానికి స్వాగతం పలికేందుకు కానీ, ఆయనతో పాటు ఈ కార్యక్రమాలకు కానీ తెలంగాణ సీఎం వెళ్లకపోవడంతో రాజకీయంగా చర్చనీయమవుతోంది.

దీనికి కొద్దిరోజుల కిందట జనవరి 26న గణతంత్ర వేడుకల సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో జాతీయ పతాక ఆవిష్కరణకు కూడా కేసీఆర్ వెళ్లకపోవడాన్ని బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు.

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ సమర్ఫణ తరువాత కేసీఆర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కేంద్రంపై తీవ్ర స్వరంతో విమర్శలు చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

సాగు విస్తీర్ణం పెంచేందుకు ఇక్రిశాట్ పరిశోధనలు తోడ్పడాలి: ప్రధాని మోదీ

హైదరాబాద్ సమీపంలో ఉన్న 'ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్'(ఇక్రిశాట్) స్వర్ణోత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన ఇక్రిశాట్ స్వర్ణోత్సవ లోగో, స్మారక స్టాంప్ ఆవిష్కరించారు.

ఇక్రిశాట్ క్లైమేట్ చేంజ్ రీసెర్చ్ ఫెసిలిటీ ఆన్ ప్లాంట్ ప్రొటెక్షన్, ర్యాపిడ్ జనరేషన్ అడ్వాన్స్‌మెంట్ ఫెసిలిటీలనూ ప్రారంభించారు.

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీ, వాననీటి సంరక్షణకు సంబంధించిన విధానల వీడియోలను, నూతన వంగడాలను ప్రధాని చూశారు.

ఈ సంద‌ర్భంగా వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త‌ల‌ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ స్వ‌ర్ణోత్స‌వాల సందర్భంగా అందరికీ అభినందనలు తెలిపారు.

వాతావరణ మార్పులపై పోరాటానికి భారత్ కంకణబద్ధంగా ఉందని, 2070 నాటికి 'నెట్ జీరో ఎమిషన్స్' లక్ష్యాన్ని చేరుకోవడం భారత్ లక్ష్యమని అన్నారు.

ఇక్రిశాట్ 50 ఏళ్లుగా ప్రపంచ దేశాలకు సుస్థిర, సులభతర వ్యవసాయంలో ఎంతో సాయమందిస్తోందని మోదీ అన్నారు.

భారత వ్యవసాయ రంగ అభివృద్ధికి ఇక్రిశాట్ తోడ్పాటు ఇలాగే కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.

తెలుగు రాష్ట్రాలలో సాగు విస్తీర్ణం పెంచేందుకు ఇక్రిశాట్ పరిశోధనలు ఉపయోగపడాలని మోదీ సూచించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

భారత్‌లో సన్నకారు రైతులే అధికమని, 80 శాతానికి పైగా ఉన్న సన్నకారు రైతులకయ్యే సాగు వ్యయం తగ్గాల్సి ఉందని, వాతావరణ మార్పుల నుంచి వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు వారికి సహకారం అందించాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు.

దేశంలో సుమారు 15 రకాల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని, వివిధ రాష్ట్రాలలోని 170 జిల్లాలలో కరవు పరిస్థితులు ఉన్నాయని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

వ్యవసాయ రంగంలో సాంకేతికకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పిన ప్రధాని సేంద్రియ వ్యవసాయం దిశగా రైతులు మరింత దృష్టిపెట్టాలని కోరారు.

తాజా బడ్జెట్లో వ్యవసాయ సాంకేతికతకు ప్రాధాన్యమిచ్చామని, కిసాన్ డ్రోన్ల వినియోగం పెంచేందుకు నిధులు కేటాయిస్తున్నామని మోదీ తెలిపారు.

సహజ వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయంలో డిజిటల్ సాంకేతికతకు కేంద్ర బడ్జెట్ ప్రాధాన్యమిచ్చిందని చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

రానున్న కాలంలో పామాయిల్ సాగు విస్తీర్ణం 6.5 లక్షల హెక్టార్లకు పెంచాలన్నది లక్ష్యమని... ఆహార భద్రత, పోషకాహార భద్రతపై తాము దృష్టి పెడుతున్నామని మోదీ చెప్పారు.

గత ఏడేళ్లలో ఈ దిశగా అనేక బయో ఫోర్టిఫైడ్ రకాలను అభివృద్ధి చేసినట్లు ప్రధాని తెలిపారు.

‘మాటలు కాదు చేతల్లో చూపించాలి’

కాగా ఇక్రిశాట్‌లో మోదీ ప్రసంగంపై వ్యవసాయ రంగ అభివృద్ధికి పనిచేస్తున్నవారు, విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. మాటల్లో చెబుతున్న విషయాలు చేతల్లో కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు.

ఈ అంశంపై రైతు స్వరాజ్య వేదికకు చెందిన కిరణ్ విస్సా ‘బీబీసీ’తో మాట్లాడారు.

మోదీ చెబుతున్నట్లు అమృతకాలం మొదలవలేదని, రైతులు ఇంకా ఆపత్కాలంలోనే ఉన్నారని కిరణ్ అన్నారు.

‘‘మోదీ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి మాట్లాడారు.. ఒకవైపు ప్రకృతి వ్యవసాయం అంటూనే మరోవైపు డ్రోన్లతో పురుగుల మందులు చల్లాలంటున్నారు రెండూ పక్కపక్కనే ఎలా సాధ్యమో స్పష్టత లేదు. నిజానికి ప్రకృతి వ్యవసాయం అంటే పాతకాలపు పద్ధతేమీ కాదు, అది అత్యంత సుస్థిర విధానం. ప్రకృతికి విఘాతం లేకుండా చేసే వ్యవసాయమే ఆధునిక, సుస్థిర వ్యవసాయం. మన పరిశోధనలు కూడా ఆ దిశలోనే ఉండాలి. కానీ, కేంద్రానికి దీనిపై స్పష్టత లేదు.. మొన్నటి బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వలేదు.

ఇంతకుముందు కూడా పరంపరాగత్ కృషి వికాస్ యోజనకు రూ. 450 కోట్లు కేటాయించి కేవలం రూ. 100 కోట్లే ఖర్చు చేశారు.. అలాగే, వన్ డ్రాప్ మోర్ క్రాప్ పథకానికి రూ. 4 వేల కోట్లు కేటాయించి రూ. 2 వేల కోట్లే ఇచ్చారు’’ అన్నారాయన.

కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉండాలని... అది చేతల్లో కనిపించాలని ఆయన అన్నారు.

రామానుజాచార్యుల విగ్రహం వద్ద ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, ANI

రామానుజాచార్య విగ్రహావిష్కరణ

ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలలో పాల్గొన్న అనంతరం ప్రధాని మోదీ... శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో నెలకొల్పిన భారీ రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా అక్కడ ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ విగ్రహం ఎత్తు 108 అడుగులు. పీఠంతో కలిపి మొత్తం 216 అడుగులు ఉంటుందీ విగ్రహం. ఆ విగ్రహం ఉండే పీఠంపై 54 కలువ రేకులు, వాటి కింద 36 ఏనుగు శిల్పాలు, కలువ రేకులపై 18 శంఖాలు, 18 చక్రాలు, విగ్రహం దగ్గరకు ఎక్కడానికి 108 మెట్లు ఉన్నాయి.

వివిధ ద్రవిడ రాజ్యాల శిల్ప రీతుల మేళవింపు ఈ విగ్రహంలో కనిపిస్తుంది. విగ్రహంలో రామానుజాచార్యులు ధ్యాన ముద్రలో కనిపిస్తారు.

కేసీఆర్, చినజీయర్ స్వామి

ఫొటో సోర్స్, facebook/TRS Party

ఫొటో క్యాప్షన్, ప్రధాని రాకకు రెండు రోజుల ముందు ఫిబ్రవరి 3న కేసీఆర్ ముచ్చింతల్ వెళ్లారు.

ప్రధాని పర్యటనకు దూరంగా కేసీఆర్

మరోవైపు ప్రధాని మోదీ పర్యటనకు తెలంగాణ సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. ప్రధానిని రిసీవ్ చేసుకోవడానికి కానీ, ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలలో కానీ.. రామానుజాచార్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కానీ కేసీఆర్ వెళ్లలేదు.

ప్రధాని పర్యటనలో కేసీఆర్ ఉంటారని తొలుత ప్రచారం జరిగినా ఈ రోజు కార్యక్రమాలలో మాత్రం ఆయన లేరు.

కేసీఆర్ స్వల్ప అనారోగ్యంతో ఉండడం వల్లే వెళ్లలేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

ఆయనకు బదులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి స్వాగతం పలికేందుకు వెళ్లారు. తలసానితో పాటు టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ రావు కూడా వెళ్లారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

కాగా ప్రధాని పర్యటనకు కేసీఆర్ రాకపోవడంతో బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ట్విటర్ వేదికగానూ బీజేపీ అనుకూలురు విమర్శలు చేస్తున్నారు.

దీంతో #ShameOnYouKCR అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండయింది.

కేసీఆర్ తరచూ ప్రధానిని అవమానిస్తున్నారని... ఇప్పుడు ప్రోటోకాల్ కూడా ఉల్లంఘించారని ఆరోపిస్తూ బీజేపీ తెలంగాణ శాఖ ట్వీట్ చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)