కేసీఆర్: 'పనికిమాలిన, పసలేని బడ్జెట్' అంటూ మండిపడిన తెలంగాణ సీఎం - ఇంకా ఎవరేం అన్నారు

ఫొటో సోర్స్, facebook/kcr
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 2022-23 ఆర్థిక సంవత్సరానికిగానూ మంగళవారం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలపై మాత్రమే దృష్టి సారించారని... నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై ఎలాంటి ప్రకటన చేయలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్ అంచనాలు 39.45 లక్షల కోట్లు అని ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. 2021-22లో సవరించిన రెవిన్యూ లోటు జీడీపీలో 6.9 శాతం నమోదైనట్లు తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది 6.4 శాతంగా ఉండనుందని, 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి దీన్ని జీడీపీలో 4.5 శాతానికి తగ్గించడమే తమ లక్ష్యమని చెప్పారు.
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను, దేశ రైతాంగాన్ని, సామాన్యులను, పేదలను, వృత్తి కులాలవారిని, ఉద్యోగులను తీవ్ర నిరాశ నిస్పృహలకు గురి చేసిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు.
''దశ దిశా నిర్దేశం లేని, పనికిమాలిన, పసలేని నిష్ప్రయోజనకర బడ్జెట్‌ను నేడు బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి చదివి వినిపించిన బడ్జెట్ ప్రసంగం ఆసాంతం డొల్లతనంతో నిండి, మాటల గారడీతో కూడి ఉంది.''
కేంద్ర ప్రభుత్వం తమ జబ్బలు తామే చరుచుకుంటూ, సామాన్యులను నిరాశా, నిస్పృహలకు గురిచేస్తూ, మసిపూసి మారేడు కాయ చేసిన గోల్ మాల్ బడ్జెట్‌గా కేంద్ర బడ్జెట్‌ను సీఎం అభివర్ణించారు.
వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యమని ఆయన అన్నారు. దేశ రైతాంగానికి వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్ 'బిగ్ జీరో' అని సీఎం స్పష్టం చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
''దేశ చేనేత రంగానికి ఈ బడ్జెట్ సున్నా చుట్టింది. నేతన్నలను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఉద్యోగులను, చిరు వ్యాపారులను బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇన్‌కమ్ ట్యాక్స్ శ్లాబుల్లో మార్పులు చేయకపోవడం విచారకరం. ఆదాయపన్ను చెల్లింపులో శ్లాబుల విధానం కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగ వర్గాలు, తదితర పన్ను చెల్లింపుదారుల ఆశల మీద కేంద్ర బడ్జెట్ నీళ్లు చల్లింది.''
''ప్రజా ఆరోగ్యం, మౌలిక రంగాలను అభివృద్ధి పరచడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విషయం ఈ బడ్జెట్ ద్వారా తేటతెల్లమైందది. కరోనా కష్టకాలంలో ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి పరుస్తుంటే ఆ దిశగా కేంద్రానికి సోయి లేకపోవడం విచారకరం. దేశ ప్రజల ఆరోగ్యం గురించి కేంద్రానికి పట్టింపు లేకపోవడం విచిత్రమని'' కేసీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ ఎంపీ శశి థరూర్ విమర్శలు చేశారు. పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడిన ఆయన ''ఈ బడ్జెట్ పూర్తిగా నిరాశకు గురిచేసిందని, అందులో చెప్పుకోదగినది ఏమీ లేదని'' అన్నారు.
''నేను విన్న ప్రసంగంలో మహత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ యాక్ట్ (MNREGA), రక్షణ శాఖ గురించి ఎలాంటి చర్చ లేదు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా మాట్లాడలేదు. ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. కానీ ఆదాయపన్నులో మధ్యతరగతి వారికి ఎలాంటి మినహాయింపులు దక్కలేదు. ఇప్పుడు మనం మంచి రోజులు రావడం కోసం మరో 25 ఏళ్లు వేచి చూడాలి. స్పీడ్ పవర్, డిజిటల్ కరెన్సీ గురించి మాట్లాడిందంతా కేవలం నినాదాలకే పరిమితం'' అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా బడ్జెట్‌పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. ''సామాన్యుడి కోసం కేటాయించిన బడ్జెట్ సున్నా. ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో సతమతమవుతోన్న వారికి బడ్జెట్‌లో ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు'' అని ట్వీట్ చేశారు.
బడ్జెట్‌ను విమర్శించిన వారి జాబితాలో సీపీఎం నేత సీతారాం ఏచూరీ కూడా ఉన్నారు. ''ఈ బడ్జెట్ ఎవరి కోసం? భారతదేశ మొత్తం సంపదలో 75 శాతం, కేవలం అత్యంత సంపన్నులైన 10 శాతం మంది దగ్గరే ఉంది. దిగువన ఉన్న 60 శాతం ప్రజల వద్ద కేవలం 5 శాతం మాత్రమే ఉంది. కరోనా మహమ్మారి, నిరుద్యోగం, పేదరికం, ఆకలి పెరిగిపోయిన సమయంలో కూడా లాభాలను ఆర్జించిన వారికి ఎందుకు ఎక్కువ పన్ను విధించరు?'' అని సీతారాం ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
పేదవారికి, మధ్యతరగతికి, వేతన జీవులకు, రైతులకు, యువతకు, చిన్న తరహా పరిశ్రమలకు వారికి ఈ బడ్జెట్‌తో ఒరిగేదేమీ లేదని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు.
''ఓవైపు బడ్జెట్‌లో పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడారు. మరోవైపు నదులను అనుసంధానం చేస్తామని చెప్పారు. భాషతో ఆడుకోవడం మంచిదే. కానీ చెప్పిన పనులు చేయడం మరింత ముఖ్యం. మోదీ ప్రభుత్వం విపత్కర మార్గంలో పయనిస్తోంది'' అని కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి బడ్జెట్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ''ఈరోజు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్, కొత్త వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టే రీతిలో ఉంది. గత సంవత్సరాల్లో చేసిన వాగ్దానాలను, ప్రకటనలను మరిచిపోయేలా ఈ బడ్జెట్‌ను రూపొందించారు. ఇది ఎంతవరకు న్యాయం? పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణాల్లో పెరుగుదల, రైతుల ఆత్మహత్యలు వంటి తీవ్ర ఆందోళనకర అంశాలను ప్రభుత్వం ఎలా మరిచిపోయింది? తమ భుజం తాము తట్టుకోవడం తప్ప కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా ఏమీ చేయలేకపోయింది. పన్నుల కారణంగా ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు'' అని ఆమె ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
వేతన జీవులకు, మధ్యతరగతి ప్రజలకు, పేద వారికి, యువత, రైతులకు ఉపయోగపడేలా బడ్జెట్‌లో ఏమీ లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- కేంద్ర బడ్జెట్ 2022 ముఖ్యాంశాలు: నదుల అనుసంధానం, కిసాన్ డ్రోన్లు, డిజిటల్ రూపీ
- క్రిప్టో కరెన్సీ ఆదాయంపై 30 శాతం పన్ను: బిట్ కాయిన్ అంటే ఏమిటి? ఇండియాలో ఇక ఈ లావాదేవీలు లాభదాయకం కాదా
- కల్పనా చావ్లా: కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ కుప్పకూలటానికి కారణాలేమిటి
- కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో అర్చకుల మధ్య వివాదానికి మూలాలేంటి
- బడ్జెట్ అర్థం కావాలంటే ఈ 10 విషయాలు తెలియాల్సిందే
- సముద్రంలో కూలిన అమెరికా యుద్ధ విమానం, చైనాకు ఆ రహస్యాలు దొరకకుండా ఆపసోపాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)