కరోనావైరస్:నిరుపేద ముస్లింల పాలిట ఫేక్ న్యూస్ ఎలా శాపమవుతోంది

కరోనావైరస్:నకిలీ వీడియోల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరు పేద ముస్లింలు

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

ఫొటో క్యాప్షన్, కరోనావైరస్:నకిలీ వీడియోల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరు పేద ముస్లింలు
    • రచయిత, కీర్తి దూబే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సన్నివేశం -1

ముగ్గురు ముస్లిం మత్స్యకారులను ఓ 10-15 మంది చుట్టు ముట్టారు. వాళ్ల ముగ్గురు చేతులు జోడించి వారిని బతిమాలుతున్నారు. “వారిని ముట్టుకోకండి. వారు కరోనాను ఒకరి నుంచి మరొకరికి అంటిస్తున్నారు.” అంటూ చుట్టూ ఉన్న వాళ్లు స్థానిక భాషలో వారిపై అరుస్తున్నారు. ఇది కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో జరిగిన ఘటన.

సన్నివేశం -2

“జావేద్ భాయ్.. ఇక్కడ నుంచీ మీ దుకాణాన్ని తీసేయండి. అసలు ఇక్కడ పెట్టొద్దు. మీ వల్ల మేం చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాం. మీ వల్లే ఆ వైరస్ వ్యాపిస్తోంది. ఇక్కడ నుంచి మీ షాపును తీసేయండి. తీసేయండి.” ఇది ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానిలో జరిగిన ఘటన.

దేశంలో జరుగుతున్న ఇలాంటి ఘటనలకు ఇప్పుడు చెప్పిన రెండు సన్నివేశాలు ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి చాలా ఘటనలు, వీడియోలు ఇప్పుడు బయటకి వస్తున్నాయి.

కరోనావైరస్ రోజురోజుకీ విస్తృతంగా వ్యాపిస్తుండటం, మరోవైపు లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

ముఖ్యంగా పేదవాళ్లు, చిన్న చిన్న దుకాణాలు నడుపుకునే వాళ్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల్ని కొందరు వేధించిన ఘటనలు కూడా మీడియాలో కనిపించాయి.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

తబ్లిగి జమాత్ కారణంగా దేశ వ్యాప్తంగా వైరస్ ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరిగిందన్న వార్తలు వచ్చినప్పటి నుంచి దేశంలోని అనేక ప్రాంతాల్లోని పేద ముస్లింలపై వేధింపులు ఎక్కువయ్యాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.

తబ్లిగి జమాత్ మత సమావేశాలకు హాజరైన వారిలో ఆరుగురు కోవిడ్-19 కారణంగా మరణించారన్న వార్త మార్చి 30 వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఫేక్ న్యూస్‌లు, వదంతుల తాకిడి ఎక్కువయ్యింది.

మర్కజ్‌లో పాల్గొన్న సుమారు 8వేల మంది వైరస్ వ్యాప్తిలో పాత్ర పోషించారని... దేశంలో వైరస్ బారిన పడ్డవారిలో చాలా మందికి జమాత్‌తో సంబంధాలున్నాయని అంటున్నారు.

అయితే దేశంలోని లక్షలాది ముస్లింలకు, జమాతీలకు మధ్య తేడాను జనం గమనించకపోవడమే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.

మార్చి 31 నుంచి ముస్లింలే లక్ష్యంగా, అలాగే ఈ సంక్షోభానికి వారే కారణమంటూ అనేక నకిలీ వీడియోలు ప్రచారంలోకి వచ్చాయి.

.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, .

హల్ద్వానీ నుంచి జావెద్

ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఓ వ్యక్తితో కొందరు మాట్లాడుతున్నట్టు కనిపించే వీడియో ఒకటి ఇటీవల బాగా ప్రచారంలోకి వచ్చింది.

అందులో ఆ వ్యక్తి తన పేరు జావెద్ అని చెప్పగా... వాళ్లు ఆయన దుకాణాన్ని అక్కడ నుంచి తొలగించాలని చెప్పుకొచ్చారు. అంతే కాదు మరోసారి ఆయన తన దుకాణాన్ని అక్కడ పెట్టవద్దని కూడా చెప్పారు.

అదే సమయంలో పక్కనే ఉన్న మరో వ్యక్తి తాను కూడా తన దుకాణాన్ని అక్కడ నుంచి తీసేయాలా అని అడిగినప్పుడు వాళ్లు అవసరం లేదని చెప్పారు. కేవలం జావెద్ మాత్రమే తీసేయాలని కూడా అన్నారు. అంతేకాదు వారి కారణంగానే కరోనా వ్యాప్తి చెందుతోందన్నారు.

అక్కడితో ఊరుకోలేదు తమ ఫోన్ నెంబర్‌ను ఆయనకు ఇచ్చి ఆ ప్రాంతంలో ఇంకెవరైనా ముస్లింలు షాపులు పెట్టినా, వారి వద్ద ఎవరైనా వస్తువులను కొనినా తమకు ఫోన్ చెయ్యమని చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఆ వీడియోలో కనిపించిన జావెద్‌తో హల్ద్వానీలోని బంభుల్‌పురాకి చెందిన వారు. ఆయనతో బీబీసీ మాట్లాడినప్పుడు.

“ఆదివారం రాత్రి 7గంటలయ్యింది. అప్పుడే నేను ఐటీఐ రోడ్‌లో నా దుకాణాన్ని పెట్టుకుంటున్నాను. ఒక్కసారిగా కొంత మంది వచ్చి నా ఆధార్ కార్డు అడిగారు. అయితే నా ఆధార్ కార్డు ఇంట్లో ఉందని చెప్పాను.

అప్పుడు వారు నా పేరును అడిగారు. నా పేరును నేను చెప్పగానే వెంటనే నా షాపును అక్కడ నుంచి తొలగించమన్నారు. ఇంకెప్పుడు పెట్టవద్దని కూడా చెప్పారు.” అని అన్నారు.

ఆ సమయంలో అక్కడో ఓ మహిళా పోలీసు ఉన్నప్పటికీ ఆమె చూస్తూ ఊరుకున్నారే తప్ప మాట్లాడలేదని జావెద్ అన్నారు. తనను వద్దన్న వాళ్లు మిగిలిన వాళ్లకు మాత్రం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని అన్నారు.

తమ ప్రాంతం నుంచి చాలా మంది కూలీలు తిరిగి తమ ప్రాంతాలకు నడచుకొని వెళ్లిపోయినప్పటికీ జావెద్ మాత్రం స్వగ్రామనికి వెళ్లిపోలేదు. తాను ఇప్పుడు ఉంటున్న ప్రాంతంలో పళ్లు అమ్ముకొని బతకవచ్చని అనుకున్నారు.

నిజానికి జావెద్ ఉత్తర ప్రదేశ్‌కి చెందిన వ్యక్తి.” వాళ్లు పది పదిహేను మంది ఉండటంతో నేను ఏం మాట్లాడ లేకపోయాను. ఇప్పుడు ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాను. తిరిగి అక్కడ షాపు పెట్టే పరిస్థి లేదు.” అని ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ పళ్లు అమ్ముకునే వ్యక్తి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని నైనితాల్ ఎస్ఎస్పీ సునీల్ మీనా బీబీసీ చెప్పారు. కానీ కొంత మంది లాక్ డౌన్‌ను ఉల్లంఘిస్తున్నారంటూ ఫిర్యాదులు వచ్చాయని వారిపై సెక్షన్ 188 ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు.

.

ఫొటో సోర్స్, BANGALORE POLICE

ఫొటో క్యాప్షన్, .

దిల్లీలోను ఆధార్ కార్డు చూపించాలంటూ డిమాండ్లు

ఫిబ్రవరిలో జరిగిన అల్లర్ల తర్వాత దిల్లీలో కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయి. వాయువ్య దిల్లీలోని శాస్త్రి నగర్లోని బీ బ్లాక్ జరిగిన కాలనీ సమావేశంలో తమ బ్లాకులోకి ముస్లిం వర్తకుల్ని రానివ్వకూడదని నిర్ణయం తీసుకున్నారంటూ ఓ వీడియో ప్రచారంలోకి వచ్చింది.

ఆ వీడియోలో తమ కాలనీలోకి వచ్చిన కూరగాయలు, పళ్ల వ్యాపారస్థుల్ని ఆధార్ కార్డులు చూపించాలంటూ డిమాండ్ చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి.

ఆ సమావేశానికి హాజరైన ఓ వ్యక్తితో బీబీసీ మాట్లాడింది. అయితే ఆయన ఆన్ రికార్డు మాట్లాడేందుకు అంగీకరించకపోయినప్పటికీ అలాంటి సమావేశం జరిగిందని మాత్రం స్పష్టం చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఇటీవల కర్నాటకలో కూడా ఇటువంటి బెదిరించడం, హింసకు పాల్పడటం వంటి రెండు ఘటనలు బయటకొచ్చాయి.

భాగల్‌కోట్ జిల్లాలోని బిదరి గ్రామంలో ముగ్గురు ముస్లిం జాలర్లను కొందరు చుట్టు ముట్టిన ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.

అక్కడ నదిలో చేపలు పట్టుకునేందుకు వారొచ్చారు. కానీ వారిని ఓ గుంపు చుట్టుముట్టింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ఆపై “ మీరు ఇక్కడకి ఎందుకొచ్చారు? మీ వల్లే కరోనా వ్యాపిస్తోంది.” అంటూ వారిపై అరవడం మొదలు పెట్టారు. ఆ గుంపు చేతులో కర్రలు కూడా ఉండటం ఆ వీడియోలో మనకు కనిపిస్తుంది. తమనేం చెయ్యద్దంటూ ఆ జాలార్లు ఏడుస్తూ వేడుకోవడం కూడా అందులో ఉంది.

ఇదే విషయంపై భాగల్‌కోట్ ఎస్పీ లోకేష్‌తో బీబీసీ మాట్లాడినప్పుడు..” మొత్తం నలుగురు మత్స్యకారులు చేపలు పట్టుకునేందుకు వచ్చారు. వారిలో ఇద్దరు హిందువులు కాగా మిగిలిన ఇద్దరు ముస్లిం వర్గానికి చెందినవారు. అయితే అలా ఆ గ్రామస్థులు వారిని చుట్టు ముట్టడం తప్పే. వారిపై మేం ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ఐదుగుర్ని అరెస్ట్ చేశాం.” అని చెప్పారు.

సోమవారం బెంగళూరులోని అమృతాలిలో మరో ఘటన జరిగింది. స్వరాజ్ అభియాన్‌తో సంబంధం ఉన్న జరీన్ తాజ్ అనే మహిళ తన కొడుకు తబ్రీజ్‌తో కలిసి తమ ప్రాంతంలో ఉన్న వారికి రేషన్ పంచుతుండగా కొందరు వారిని అడ్డుకున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

ఇదే విషయంలో తబ్రిజ్‌తో బీబీసీ మాట్లాడినప్పుడు

“హిందువులకు ఆహారం ఇవ్వద్దని కావాలంటే మీ వాళ్లకు(ముస్లింలకు) ఇచ్చుకోమని కనీసం ఓ 20మంది మాతో చెప్పారు.

మేం వాళ్లతో వాదనకు దిగలేదు. పక్కనే ఉన్న మరో ఇంటికి వెళ్లిపోయాం. ఆ తర్వాత ఓ గుంపు కర్రలతో వచ్చి మమ్మల్ని కొట్టడం మొదలు పెట్టారు.”

తబ్రిజ్‌కు తన కుడి చేతిపై రెండు కుట్లు పడ్డాయి. తలకు కూడా గాయాలయ్యాయి.

23 ఏళ్ల తబ్రీజ్ ఓ బట్టల దుకాణంలో పని చేస్తున్నారు. యోగేంద్ర యాదవ్‌కి చెందిన స్వరాజ్ ఇండియా సంస్థ తరపున గత 14 రోజులుగా పని చేస్తున్నారు. ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

సోషల్ మీడియా ద్వారా మా దృష్టికి వచ్చిన కేసుల్ని మాత్రమే ఈ కథనంలో మేం ప్రస్తావించాం.

కోవిడ్-19 మహమ్మారికి కుల, మత, ప్రాంత, పేద, ధనిక తేడాలు లేవు. ఎవ్వరికి సోకినా తగిన జాగ్రత్తలు తీసుకోకుండా వైద్యుల పర్యవేక్షణలో లేకుండా ఉంటే వారి ద్వారా ఇంకొకరికి వ్యాపిస్తుంది.

తబ్లిగి జమాత్ మత ప్రార్ధనల సమావేశం తర్వాత మరింత వేగంగా వ్యాపించిందన్న విషయం ముమ్మాటికి నిజం.

దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో సుమారు 30 శాతం తబ్లిగి జమాత్‌ మత సమావేశాలకు సంబంధం ఉందని సాక్షాత్తు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు.

అయితే ప్రస్తుతం తబ్లిగి జమాత్‌తో ఏ మాత్రం సంబంధలేని ముస్లింలు కూడా సామాన్య ప్రజలనుంచి ఛీత్కారాలను ఎదుర్కొంటున్నారు.

ఇలా ఓ మతపరమైన సంస్థ చేసిన తప్పిదాల కారణంగా కోవిడ్-19 వ్యాప్తి ఎక్కువైన దేశాల్లో మన దేశమే మొదటిది కాదు.

లి మన్.. దక్షిణ కొరియాలోని షించోంజీ అనే చర్చి పెద్ద. ఆయన కారణంగా సుమారు 4వేల మందికి కరోనావైరస్ సోకింది. ఇవి ఆ దేశంలోని మొత్తం కేసుల్లో 60 శాతంతో సమానం.

ఆ దేశంలో కరోనావైరస్ కేంద్రంగా ఆయన్ను అభివర్ణించారు. ఆ తరువాత ఆయన కూడా తాను చేసిన తప్పుకు క్షమాపణ చెప్పారు.

అబద్దాల ద్వారా విద్వేషాలు

అయితే భారత దేశంలోకరోనాకు ఓ మతానికి ముడి పెట్టడం అనుకోకుండా జరిగేందేం కాదు.

ముస్లింలను కరోనా బాధితులుగా కాకుండా కరోనా వ్యాప్తికి వారే కారణం అన్నట్టు నకిలీ వీడియోలు, నకలీ సమాచారాన్ని సృష్టించి దాన్ని జనాల్లోకి వ్యాప్తి చేయడం అంతా ఓ పద్ధతి ప్రకారమే జరుగుతూ వచ్చింది.

అలా ప్రచారంలోకి వచ్చిన వీడియోలన్నీ అయితే నకిలీవి లేదంటే అస్సలు ప్రస్తుత పరిస్థితులకు ఏ మాత్రం సంబంధం లేనివి.

నకిలీ వీడియో - పోలీసులపై తబ్లిగి జమాత్‌ ఉమ్మి వేయడం

కొందరు తబ్లిగీ జమాత్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు పోలీసులకు కరోనా అంటించేందుకు వారిపై ఉమ్మి వేశారంటూ కొద్ది రోజుల క్రితం ఓ వీడియో ప్రచారంలోకి వచ్చింది. బీబీసీ ఫ్యాక్ట్ చెక్ పరీశీలనలో అది నకిలీ వీడియో అని తేలింది.

ముంబైలోని ఓ విచారణలో ఉన్న ఖైదీని కోర్టుకు తీసుకు వెళ్తుండగా ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో అది. ఆ విచారణలో ఉన్న ఖైదీకి జమాత్‌తో ఎటువంటి సంబంధం లేదు.

ఫేక్ వీడియో - ఫుడ్ ప్యాక్‌లో ఉమ్మి వేస్తున్న ముస్లిం

ఏప్రిల్ 2న సోనమ్ మహాజన్ ఓ వీడియోను ట్వీట్ చేశారు. ఓ ముస్లిం వ్యక్తి తాను ప్యాక్ చేస్తున్న ఫుడ్ ప్యాకేట్‌పై ఊదుతూ కనిపిస్తారు. సుమారు 45 సెకెన్ల నిడివి ఉన్న వీడియో అది.

జమోటో డెలివరీ బాయ్ ముస్లిం కావడంతో ఆయన డెలివరీ చేసిన ఫుడ్ పార్సిల్‌ను తీసుకునేందుకు ఓ వ్యక్తి నిరాకరించడానికి ఈ వీడియోనే కారణమని ఆమె తన పోస్టులో కామెంట్ చేశారు.

ఆల్ట్ న్యూస్ రిపోర్ట్ ప్రకారం ఆ వీడియో 2019 ఏప్రిల్ నెలలో ఇండోనేషియా, సింగపూర్, యూఏఈ దేశాల్లో ప్రచారంలోకి వచ్చింది.

అది ఈ ప్రాంతానికి కానీ, కరోనావైరస్‌కి కానీ సంబంధం లేని ఓ పాత వీడియో. కానీ ఇప్పుడు ఇండియాలో ఓ కొత్త లక్ష్యంతో ప్రచారంలోకి వచ్చింది.

వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?

మార్చి 30 తరువాత...

మార్చి 30 తర్వాత మతపరమైన నకిలీ వీడియోలు, తప్పుడు ప్రచారాల వ్యాప్తి బాగా ఎక్కువయ్యిందని ఫ్యాక్ట్ చెకర్ వెబ్ సైట్ ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకులు ప్రతీక్ సిన్హా అభిప్రాయపడ్డారు

“చాలా పాత సమాచారం బాగా వైరల్ అవుతోంది. ఇదేదో అనుకోకుండా జరుగుతోంది కాదు. ఎవరో కొంత మంది అదే పనిలో ఉన్నారు.

దీని వెనుక ఓ నెట్ వర్కే పని చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఓ సామాన్య వ్యక్తికి ఆ తరహా మేసెజ్ చేరినప్పుడు వారు దాన్ని చాలా సులభంగా నమ్మేస్తారు. మన ఆలోచనాతీరుకు తగ్గట్టు ఉండే వీడియోలను చూసినప్పుడు వెంటనే మన వాటిని నమ్మేస్తాం.” అని ఆయన అన్నారు.

క్వారంటైన్‌లో ఉన్న తబ్లిగ్ జమాత్‌కు చెందిన కొందరు వ్యక్తులు అక్కడ ఆరోగ్య కార్యకర్తలపై ఉమ్మేశారంటూ ఉత్తర రైల్వే అధికార ప్రతినిధి ప్రకటన చేసిన తర్వాత నుంచి ఇటువంటి వీడియోలు బాగా ప్రచారంలోకి వచ్చాయి.

అయితే ఆ ఘటనకు సంబంధించిన ఎటువంటి వీడియోను రైల్వే వర్గాలు విడుదల చెయ్యలేదు. కానీ ఆ ఘటనకు జోడిస్తూ చాలా పాత వీడియోలు సర్క్యులేట్ అయ్యాయి.

అయితే ఇలాంటి వీడియోల వల్ల కేవలం పేద ముస్లింలపై మాత్రమే తీవ్ర ప్రభావం పడుతోంది. తబ్లిగ్ జమాత్‌ చేసిన బాధ్యతారహితమైన చర్యలు, ఇటువంటి నకిలీ వీడియోల కారణంగా నిరు పేద ముస్లింలు అనుక్షణం భయం భయంగా బతుకుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికి పూట గడవటం కూడా కష్టమవుతోంది.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)