ఎగ్జిట్ పోల్స్ మీద ఎవరెవరు ఎలా రియాక్టయ్యారు...

ఫొటో సోర్స్, Getty Images
సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ ముగిసిన తర్వాత ఆదివారం సాయంత్రం వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి.
అందులో అన్నీ సంస్థలూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికే అధిక సీట్లు వస్తాయని తెలిపాయి.
రిపబ్లిక్ సీఓటర్ సర్వేలో ఎన్డీయేకు 287 స్థానాలు వస్తాయని చెప్పగా, టుడేస్ చాణక్య, ఆజ్‌తక్ యాక్సిస్ మై ఇండియా, సీఎన్ఎన్ ఐబీఎన్ ఇఫ్సాస్ సంస్థలు తమ సర్వేలో బీజేపీకి 336 నుంచి 340 స్థానాలు వస్తాయని చెప్పాయి.
ఏపీలో టీడీపీ 100 నుంచి 110 స్థానాలు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని లగడపాటి (ఆర్జీ ఫ్లాష్ టీమ్) సర్వే అంచనా వేసింది. వైసీపీకి 72 నుంచి 79 స్థానాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.
సీపీఎస్ ఎగ్జిట్ పోల్స్ మాత్రం వైసీపీకి 130-133, టీడీపీకి 43-44 స్థానాలు వస్తాయని చెప్పింది.
సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాలను విపక్షాలు తోసిపుచ్చాయి. ఈ అంచనాలు తారుమారవుతాయని పలువురు నేతలు అన్నారు.
ఎగ్జిట్ పోల్స్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, fb/VijayaSaiReddyOfficial
విజయసాయి రెడ్డి
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. లగడపాటి రాజగోపాల్ సర్వేలో ఆయన మెదడును ఆయన డీఎన్ఏ డామినేట్ చేసిందని వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

ఫొటో సోర్స్, CHANDRABABU/FB
చంద్రబాబు నాయుడు
ప్రజల నాడిని పట్టుకోవడంలో ఎగ్జిట్‌పోల్స్ మరోసారి విఫలమయ్యాయని ఆంధ్రప్రదేశ్ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.
"క్షేత్రస్థాయిలో వాస్తవాలను అంచనా వేయడంలో ఎగ్జిట్ పోల్స్ చాలాసార్లు విఫలమయ్యాయయి. ఏపీలో తెదేపా ప్రభుత్వం వస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. కేంద్రంలో బీజేపీయేతర పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే నమ్మకంతో ఉన్నాం" అని ట్వీట్ చేశారు.
"50 శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి మారోసారి డిమాండ్ చేస్తున్నాం" అన్నారు.
సోమవారం అమరావతిలో మాట్లాడుతూ... 2014లో కూడా ఎగ్జిట్ పోల్స్ వైస్సార్సీపీ గెలుస్తుందని చెప్పగా, వాస్తవ ఫలితాలు మరోలా వచ్చాయని గుర్తుచేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, Getty Images
మమతా బెనర్జీ
ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తాను విశ్వసించనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు.
"ఈ ఎగ్జిట్ పోల్ గాసిప్స్‌ను నమ్మను. ఈవీఎంలను మార్చడం లేదా తారుమారు చేసేందుకు ఈ నాటకాలు ఆడుతున్నారు. విపక్ష పార్టీలన్నీ ఐక్యంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ యుద్ధాన్ని అంతా కలిసికట్టుగా ఎదుర్కొందాం" అని మమత ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, fb/VPOI13
ఎగ్జిట్ పోల్స్‌లో ఖచ్చితత్వం ఉండదు
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కచ్చితమైన ఫలితాలు కావని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వాటి గురించి ప్రజలు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పారు. 23వ తేదీ వరకు వేచి చూస్తే వాస్తవ ఫలితాలు వస్తాయన్నారు.
1999 నుంచి అనేకసార్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయని గుర్తు చేశారు.

ఫొటో సోర్స్, fb/ShashiTharoor
శశిథరూర్
ఆస్ట్రేలియాలో జరిగినట్లే, భారత్‌లోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ తారుమారయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ అన్నారు.
"ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పు అని అనుకుంటున్నాను. తాజాగా ఆస్ట్రేలియా ఎన్నికలకు సంబంధించి 56 సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. సర్వే చేసేవారు ప్రభుత్వానికి చెందిన వారేమోనన్న భయంతో భారత్‌లో చాలామంది ప్రజలు వారికి నిజాలు చెప్పరు. వాస్తవ ఫలితాల కోసం 23 వరకూ వేచిచూస్తాం" అంటూ శశిథరూర్ ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Ani
చంద్రబాబు, కేజ్రీవాల్ భేటీపై సెటైర్
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను చంద్రబాబు నాయుడు కలవడంపై ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ సెటైర్ వేశారు.
"ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత అనవసరంగా దిల్లీదాకా వచ్చి "చందా బాబు"ను కలిశానని చంద్రబాబు నాయుడు అనుకొని ఉంటారు" అని కుమార్ విశ్వాస్ ట్వీట్ చేశారు.
ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయని తాను అనుకోవట్లేదని పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
బీజేపీ కార్టూన్
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడిన తర్వాత బీజేపీ ట్విటర్ హ్యాండిల్ ఒక కార్టూన్‌ను పోస్ట్ చేసింది. ప్రధాని మోదీ తన ప్రత్యర్థులను పడగొడుతూ ముందుకు వెళ్తున్నట్లుగా ఆ కార్టూన్ ఉంది. ఏడవ దశ పోలింగ్ ముగియడంతో ప్రత్యర్థి కూటమి కథ సమాప్తం అన్నట్లుగా దానిపై రాశారు.
రాహుల్ గాంధీ
ఎగ్జిట్ పోల్స్ వెలువడటానికి కొద్ది సేపటి ముందు ట్విటర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాందీ స్పందించారు.
ప్రధాని మోదీ, ఆయన బృందానికి ఎన్నికల సంఘం పూర్తిగా లొంగిపోయిందని రాహుల్ ఆరోపించారు. ఈవీఎంల నుంచి మొదలుకుని ఎన్నికల షెడ్యూల్ వరకు అన్నిటినీ మేనేజ్ చేశారని విమర్శించారు.
ఇవి కూడా చదవండి:
- ఈవీఎంలో ఓట్లు ఎలా లెక్కిస్తారు?
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2019: కీలకమైన ఈ 10 నియోజకవర్గాల్లో గెలిచేదెవరో...
- ఎన్టీఆర్ ఫొటో ఎంత పని చేసిందంటే...
- ఇందిరాగాంధీని కాంగ్రెస్ నుంచి బహిష్కరించిన ఆంధ్రా లీడర్
- పార్టీలు పెట్టారు.. కాపాడుకోలేకపోయారు
- 'ఈవీఎం ధ్వంసం'పై జనసేన అభ్యర్థి బీబీసీతో ఏమన్నారంటే..
- తెలంగాణలో ఒక్క లోక్‌సభ స్థానానికి 480 మంది అభ్యర్థులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








