‘అగ్నిపథ్ దేశానికి ప్రమాదకరం... కేంద్రం మరొకసారి ఆలోచించాలి’ - అరవింద్ కేజ్రీవాల్
అగ్నిపథ్ ద్వారా నియామకాలు చేపట్టడాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రారంభించింది. ఈరోజు నుంచి ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి తుది గడువు జులై 5తో ముగిసిపోతుంది. ఆ తరువాత అంటే జులై 24 నుంచి పరీక్షలు మొదలవుతాయి.
లైవ్ కవరేజీ
అఫ్గానిస్తాన్‌కు భారత్ రెండో విడత సాయం

ఫొటో సోర్స్, Twitter/Arindam Bagchi
ఇటీవల భూకంపంతో భారీగా నష్టపోయిన అఫ్గానిస్తాన్‌కు భారత్ సాయం అందిస్తోంది.
ఇప్పటికే మొదటి విడత సాయం అక్కడకు వెళ్లగా తాజాగా రెండో విడత సాయం కూడా కాబుల్ చేరుకుందని కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ తెలిపింది.
అఫ్గానిస్తాన్‌లో వచ్చిన భారీ భూకంపానికి సుమారు 1,000 మంది చనిపోయారు. భారీ ఆస్తి నష్టం కూడా జరిగింది.
తమను ఆదుకోవాలంటూ అంతర్జాతీయ సమాజాన్ని అఫ్గాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బ్రేకింగ్ న్యూస్, గుజరాత్ అల్లర్ల కేసులో మోదీకి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు
గుజరాత్ అల్లర్ల కేసులో నరేంద్ర మోదీతో పాటు ఇతరులకు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది.
ఈ మేరకు జకియా జాఫ్రీ వేసిన పిటీషన్‌ను కోర్టు కొట్టివేసింది. పిటీషన్ మెరిట్స్‌కు దూరంగా ఉందని జస్టిస్ ఏఎం ఖాన్‌విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది.
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు.
నరేంద్ర మోదీతో పాటు సుమారు 64 మందికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) క్లీన్ చిట్ ఇవ్వడం మీద కాంగ్రెస్ మాజీ ఎంపీ ఇషాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ సుప్రీం కోర్టులో సవాలు చేశారు.
గుజరాత్ అల్లర్లలో భాగంగా జరిగిన గుల్బర్గా సొసైటీ హింసలో కాంగ్రెస్ నేత అయిన ఇషాన్ జాఫ్రీని చంపేశారు. నాడు జాఫ్రీతో పాటు 69 మంది గుల్బర్గా సొసైటీ హింసలో చనిపోయారు.
మహారాష్ట్ర: ‘శరద్ పవార్‌కు బీజేపీ బెదిరింపులు’

ఫొటో సోర్స్, ANI
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ శిబిరంలో ఎమ్మెల్యేల సంఖ్య 50 దాటే అవకాశం ఉందని వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.
మరొక వైపు మెజారిటీ ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని శివసేన నేత సంజయ్ రౌత్ తెలిపారు. ఏక్‌నాథ్ శిందేతో ఉన్నది 12 మంది ఎమ్మెల్యేలేనని వారిపై అనర్హత వేటు వేసే ప్రక్రియను ప్రారంభించామని ఆయన అన్నారు.
మహావికాస్ అఘాడి(ఎంవీఏ) కూటమిని రక్షించే ప్రయత్నాలు చేస్తే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను ఇంటికి వెళ్లనివ్వమంటూ ఒక బీజేపీ కేంద్ర మంత్రి హెచ్చరించినట్లు సంజయ్ రౌత్ ఆరోపించారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మహారాష్ట్ర సంక్షోభం: ఒకప్పుడు ఆటో నడిపిన ఏక్‌నాథ్ షిండే... ఇప్పుడు శివసేనలో చక్రం తిప్పే స్థాయికి ఎలా వచ్చారు?
అమెరికా: తుపాకుల నియంత్రణపై బిల్లు పాస్ చేసి సెనేట్

ఫొటో సోర్స్, Reuters
అమెరికాలో తుపాకుల కొనుగోలు, వినియోగాన్ని నియంత్రించే బిల్లును సెనేట్ ఆమోదించింది.
గత 30 ఏళ్లలో ఇలాంటి బిల్లు తీసుకురావడం ఇదే తొలిసారి.
21 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారికి తుపాకులు విక్రయించడంపై మరిన్ని ఆంక్షలను ఈ బిల్లు విధిస్తోంది. వారి నేర చరిత్రను పరిశీలిస్తుంది.
అలాగే ఈ బిల్లు ప్రకారం నేరాలు, హింసకు పాల్పడే వ్యక్తులు ఆయుధాలను వాడటంపై తాత్కాలికంగా నియంత్రణ విధిస్తారు.
అర్హత లేని వాళ్ల కోసం అర్హత కలిగిన వారు తుపాకులు కొనడాన్ని కూడా ఈ బిల్లు నిషేధిస్తోంది.
పాఠశాలల్లో భద్రత పెంచేందుకు, మానసిక సమస్యలను పరిష్కరించడానికి 15 బిలియన్ డాలర్ల ఫండ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.
హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఈ బిల్లును పాస్ చేసిన తరువాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తరువాతే అది చట్టంగా మారుతుంది.
ఇటీవల అమెరికాలో వరుసగా పాఠశాలల్లో కాల్పులు జరిగి పిల్లలు చనిపోయిన నేపథ్యంలో ఈ బిల్లును తీసుకొచ్చారు.
కానీ ఈ బిల్లును ది నేషనల్ రైఫిల్ అసోసియేన్ వ్యతిరేకించింది. తుపాకుల వినియోగం మీద నియంత్రణ విధించినంత మాత్రాన హింస తగ్గదని తెలిపింది.
‘గుజరాత్ అల్లర్ల’ మీద నేడు సుప్రీం కోర్టు తీర్పు

ఫొటో సోర్స్, Reuters
గుజరాత్ అల్లర్లకు సంబంధించి దాఖలైన పిటీషన్ మీద నేడు సుప్రీం కోర్టు తీర్పును ఇవ్వనుంది.
అల్లర్లకు సంబంధించి నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీతోపాటు 64 మందికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) క్లీన్ చిట్ ఇవ్వడం మీద కాంగ్రెస్ మాజీ ఎంపీ ఇషాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ సుప్రీం కోర్టులో సవాలు చేశారు.
ఆ అల్లర్ల వెనుక కుట్ర ఉందని, దాన్ని సిట్ సరిగ్గా విచారించలేదని జకియా కోర్టుకు విన్నవించారు.
కాంగ్రెస్ నేత అయిన ఇషాన్ జాఫ్రీని 2002 గుజరాత్ అల్లర్ల సందర్భంగా చంపేశారు.
ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపిన వైఎస్ జగన్

ఫొటో సోర్స్, Facebook/NarendraModi
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాష్ట్రపతిగా పోటీ చేస్తున్న ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు.
ఒక గిరిజిన మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంపై ఆ పార్టీ హర్షం వ్యక్తం చేసింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని అందులో భాగంగానే ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటిస్తున్నట్లు అధికారిక ప్రకటన పేర్కొంది.
నేడు ద్రౌపది ముర్ము నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ వ్యవహారాల నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలు పాల్గొననున్నారు.

ఫొటో సోర్స్, Facebook/APCM
హలో ఆల్! గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.
