‘అగ్నిపథ్ దేశానికి ప్రమాదకరం... కేంద్రం మరొకసారి ఆలోచించాలి’ - అరవింద్ కేజ్రీవాల్

అగ్నిపథ్ ద్వారా నియామకాలు చేపట్టడాన్ని ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ ప్రారంభించింది. ఈరోజు నుంచి ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి తుది గడువు జులై 5తో ముగిసిపోతుంది. ఆ తరువాత అంటే జులై 24 నుంచి పరీక్షలు మొదలవుతాయి.

లైవ్ కవరేజీ

  1. అమెరికా: అబార్షన్‌‌లపై నిషేధం - ఏయే రాష్ట్రాలలో ఎలా ఉంది

  2. నేటి ముఖ్యాంశాలు

    • కేరళ రాష్ట్రం వయనాడ్‌లోని రాహుల్ గాంధీ కార్యాలయంపై శుక్రవారం దాడి జరిగింది.
    • సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మీద ఆబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో తెలంగాణ బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.
    • కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ అనే పేరును ఖాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించింది.
    • గుజరాత్ అల్లర్ల కేసులో నరేంద్ర మోదీతో పాటు ఇతరులకు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది.
    • అగ్నిపథ్ పథకం దేశానికి, యువతకు ప్రమాదకరమని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
    • ఎమ్మెల్యే అజయ్ చౌదరిని శివసేన లెజిస్లేటివ్ పార్టీ లీడర్‌గా నియమించాలన్న ఆ పార్టీ ప్రతిపాదనకు మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆమోదం తెలిపారు.
    • భారత్‌లో తయారు చేసిన సైనిక వాహనాలను ఇండియన్ ఆర్మీలో ప్రవేశ పెట్టారు.

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్‌పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

  3. ఇవి రాత్రి పూట తమ నివాస రంధ్రాలు వీడి, కొత్త రంధ్రాలు వెతుక్కుని, అక్కడ జీవులతో జతకడతాయి

  4. ప్రేమకు, ఇష్టానికి మధ్య 'సమ్మతమే' సతమతమయ్యిందా?

  5. బీజేపీ హిందుత్వ విధానంతో ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వ పోటీపడలేకపోయిందా?

  6. ప్రేమకూ ఇష్టానికీ మధ్య సతమతమైన 'సమ్మతమే'

  7. పెంపుడు జంతువుల వల్ల మీ పిల్లల మానసిక శక్తి పెరుగుతుందా?

  8. కేరళ: రాహుల్ గాంధీ కార్యాలయంపై దాడి

    కేరళలో రాహుల్ గాంధీ కార్యాలయంపై దాడి

    ఫొటో సోర్స్, @AP_pyc

    కేరళ రాష్ట్రం వయనాడ్‌లోని రాహుల్ గాంధీ కార్యాలయంపై శుక్రవారం దాడి జరిగింది.

    ఈ దాడికి కేరళలోని వామపక్ష ప్రభుత్వం, ఎస్‌ఎఫ్ఐ కార్యకర్తలు కారణమని ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఆరోపించింది. కేరళ ప్రభుత్వం గుండాయిజాన్ని ప్రోత్సహిస్తోందంటూ ట్వీట్ చేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు.

    కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ట్వీట్‌లో ఈ దాడిని ఖండించారు. దేశ ప్రజలందరికీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు వ్యక్తం చేసే హక్కు ఉందని అన్నారు. ఇలాంటి దాడులు సరికాదని, దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ విడుదల చేసిన వీడియోల్లో కొంత మంది వ్యక్తులు చేతుల్లో జెండాలు పట్టుకొని, గోడలు ఎక్కి కార్యాలయంలోకి వెళ్తున్నట్లుగా కనబడుతోంది.

    కార్యాలయంలో ఒక వ్యక్తిని కొంతమంది వ్యక్తులు కొడుతున్న వీడియోలు కూడా బయటకొచ్చాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 3

  9. యుక్రెయిన్ ఈయూలో చేరేందుకు సిద్ధమవుతోందా... రష్యా ఊరుకుంటుందా?

  10. ఆంధ్రప్రదేశ్: మల్లెసాగులో డ్రోన్ల వినియోగం

    గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని కాజ గ్రామంలో మల్లె సాగుకు ఆధునిక సాంకేతిక పద్ధతులు ఉపయోగిస్తున్నారు.

    ఏడాది పొడవునా పూలు సాగు చేస్తున్న వీరు మల్లె తోటలకు డ్రోన్లు, సోలార్ విద్యుత్ లాంటివి ఉపయోగిస్తున్నారు.

    ఖర్చు తగ్గడంతోపాటూ, తమ పనులు వేగంగా పని పూర్తవుతోందని చెబుతున్నారు.

    పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
    Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

    పోస్ట్ of YouTube ముగిసింది

  11. ఆర్జీవీపై తెలంగాణ బీజేపీ నేతల ఫిర్యాదు

    దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ

    ఫొటో సోర్స్, Twitter/RGV

    సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మీద ఆబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో తెలంగాణ బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.

    ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును అవమాన పరిచేలా రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ చేశారంటూ వారు ఆరోపించారు.

    వర్మ మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

    అయితే ద్రౌపది ముర్ము లేదా ఇంకవరినైనా అవమానించే ఉద్దేశం తనకు లేదని ఆర్జీవీ వివరణ ఇచ్చారు.

    మహాభారతంలోని ద్రౌపది పాత్ర అంటే తనకు చాలా ఇష్టమని, అందుకే ఆమెతో సంబంధం ఉన్న పాత్రలను గుర్తు చేసుకున్నానని ఆయన తెలిపారు.

  12. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము.. బీజేపీ వ్యూహమేమిటి

  13. బ్రేకింగ్ న్యూస్, ఆంధ్రప్రదేశ్: బీఆర్ అంబేడ్కర్ కోనసీమకు కేబినెట్ ఆమోదం, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం

    కోనసీమ జిల్లాలో పోలీసుల పహారా

    కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ అనే పేరును ఖాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించింది.

    మే 18న ఈ జిల్లా పేరు మార్పుపై ప్రాథమిక నోటిఫికేషన్ విడుదలైంది. 30 రోజుల గడువుతో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది.

    అయితే జిల్లా పేరు మార్పుని నిరసిస్తూ ఆందోళనలు జరిగాయి. మే 24న అమలాపురంలో ఆ నిరసనలు హింసాత్మకంగా మారాయి.

    మంత్రి, ఎమ్మెల్యే ఇంటికి కొందరు నిప్పు పెట్టే వరకూ వెళ్లింది. ఈ ఘటనపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. వివిధ పార్టీలకు చెందిన 163మంది అరెస్ట్ అయ్యారు.

    ఈనెల 18తో ప్రాథమిక నోటిఫికేషన్ గడువు ముగిసింది. పేరు మార్పు ప్రతిపాదనపై శుక్రవారం కేబినెట్ లో చర్చ జరగ్గా దానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

    దాంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ తుది నోటిఫికేషన్ విడుదల కానుంది.

  14. అగ్నిపథ్ దేశానికి ప్రమాదకరం - అరవింద్ కేజ్రీవాల్

    దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్

    ఫొటో సోర్స్, Facebook/Arvind Kejriwal

    అగ్నిపథ్ పథకం దేశానికి, యువతకు ప్రమాదకరమని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

    ‘సైన్యంలో చేరిన నాలుగేళ్ల తరువాత వారిని మాజీ సైనికులు అంటారు. వారికి పింఛను రాదు. ఈ పథకం మీద కేంద్రం మరొకసారి ఆలోచించాలి.’ అని ఆయన అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  15. మహారాష్ట్ర: శివసేన శాసనసభా పక్షనేతగా అజయ్ చౌదరి

    ఎమ్మెల్యే అజయ్ చౌదరిని శివసేన లెజిస్లేటివ్ పార్టీ లీడర్‌గా నియమించాలన్న ఆ పార్టీ ప్రతిపాదనకు మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆమోదం తెలిపారు.

    శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ శిందే ఇప్పటి వరకు ఆ పార్టీ శాసనసభా పక్షనేతగా ఉన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  16. రావాల్సిన ఉద్యోగం 24 ఏళ్లు ఆలస్యం.. ఒకరు పాత బట్టలు అమ్ముకుంటున్నారు, ఇంకొకరు ఎమ్మెల్యే అయ్యారు

  17. సైన్యంలో మేడ్ ఇన్ ఇండియా యుద్ధ వాహనాలు

    భారత్‌లో తయారు చేసిన సైనిక వాహనాలను ఇండియన్ ఆర్మీలో ప్రవేశ పెట్టారు.

    ఈ ఇన్‌ఫాంట్రీ కాంబాట్ వెహికల్స్‌ను చాలా సులభంగా డ్రైవ్ చేయొచ్చని సైన్యం తెలిపింది. డ్రైవర్‌ 1,800 మీటర్ల దూరం వరకు చూడగలుగుతారని వెల్లడించింది.

    వాహనంలో కూర్చొనే బయట ఉండే ఆయుధాలను ఆపరేట్ చేయొచ్చని నార్తరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు.

    ఈ వాహనాలను డీఆర్‌డీఓ, టాటా గ్రూప్ ఉమ్మడిగా డిజైన్ చేశాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  18. యూట్యూబర్లు ఇచ్చే ఆర్థిక సలహాలు ఎంతవరకు పాటించొచ్చు

  19. బ్రేకింగ్ న్యూస్, Draupadi Murmu: ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము నామినేషన్

    నామినేషన్ దాఖలు చేసిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము

    ఫొటో సోర్స్, DDNews/Sansad

    ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము నామిషన్ దాఖలు చేశారు.

    నామినేషన్ వేయడానికి వెళ్లేముందు ద్రౌపది ముర్ము పార్లమెంటు ప్రాంగణంలోని మహాత్మా గాంధీ, బీఆర్ అంబేడ్కర్, బిర్సా ముండా విగ్రహాల వద్ద నివాళులర్పించారు.

    ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు ఆమెతోపాటు ఉన్నారు.

    బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పీఎస్ ధామీ వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు.

    ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము చాలా కాలంగా బీజేపీలో ఉన్నారు. గతంలో ఆమె జార్ఖండ్ గవర్నర్‌గా కూడా పని చేశారు.

    ఒక ఆదివాసీని రాష్ట్రపతి అభ్యర్థిని చేయడం ఇదే తొలిసారి.

  20. అగ్నిపథ్: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దరఖాస్తులు ప్రారంభం

    భారత వాయు సేన

    ఫొటో సోర్స్, Getty Images

    అగ్నిపథ్ ద్వారా నియామకాలు చేపట్టడాన్ని ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ ప్రారంభించింది.

    ఈరోజు నుంచి ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

    అప్లికేషన్ సమర్పించడానికి తుది గడువు జులై 5తో ముగిసిపోతుంది. ఆ తరువాత అంటే జులై 24 నుంచి పరీక్షలు మొదలవుతాయి.

    దరఖాస్తు చేసుకునేందుకు రూ.250 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 10వ తరగతి, ఇంటర్మీడియట్ మార్కుల లిస్టులు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

    అగ్నిపథ్‌లో భాగంగా అగ్నివీరులుగా మారాలి అనుకునేవారు అప్లై చేయాల్సిన వెబ్‌సైట్ https://agnipathvayu.cdac.in/AV/.