అఫ్గానిస్తాన్: 'షరియా చట్టం ప్రకారమే మా పాలన ఉంటుంది, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉండదు'
‘అఫ్గానిస్తాన్‌లో ఎలాంటి పాలన అందించాలనే విషయంలో మేం చర్చించుకోం. ఎందుకంటే షరియా చట్టం ప్రకారం పాలన సాగించాలనే విషయంలో మేమంతా స్పష్ఠంగా ఉన్నాం’ అని తాలిబాన్‌ల విధాన నిర్ణయాల గురించి సమాచారం పొందే స్థాయిలో ఉన్న నేత వహీదుల్లా హషీమీ రాయిటర్స్‌తో అన్నారు.
లైవ్ కవరేజీ
తాలిబాన్: ‘ఇరవయ్యేళ్ల కిందటికి ఇప్పటికి మాలో వచ్చిన మార్పును మీరే చూస్తారు’
‘‘మాది ముస్లిం దేశం. ఇరవయ్యేళ్ల కిందట కానీ, ఇప్పుడు కానీ అఫ్గానిస్తాన్ ముస్లిం దేశమే.
కానీ, అనుభవం, విజన్, పరిణతి విషయానికొచ్చేసరికి ఇరవయ్యేళ్ల కిందటికి ఇప్పటికి మాలో చాలా మార్పు వచ్చింది.
మేం చేపట్టబోయే చర్యలలో మార్పు చూస్తారు. ఇది ఒక పరిణామ ప్రక్రియ.’’ అన్నారు జహీబుల్లా.
త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం
ఫొటో సోర్స్, Reuters
ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నాం
‘‘ప్రభుత్వం ఏర్పాటయ్యాక దేశంలో అమలు కాబోయే చట్టాల గురించి చెబుతాం’’ అన్నారు జబీహుల్లా.
ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం మేం కసరత్తు చేస్తున్నాం.
అందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తికాగానే ప్రకటన చేస్తాం.
దేశ సరిహద్దులన్నీ మా నియంత్రణలోనే ఉన్నాయి అన్నారు జబీహుల్లా.
ఎవరినీ విచారించం, ఎవరినీ వెంటాడం: తాలిబాన్లు
విదేశీ ఏజెన్సీలకు పనిచేసిన కాంట్రాక్టర్లు, ట్రాన్స్‌లేటర్ల గురించి ప్రశ్నించగా.. ఎవరినీ ప్రతీకారంతో చూడబోమని జబీహుల్లా చెప్పారు.
‘‘ఇక్కడ పెరిగిన యువతను ఎవరినీ బయటకు వెళ్లనివ్వం. వారు ఈ దేశ సంపద’’ అన్నారాయన.
‘ఎవరూ వారి ఇంటి తలుపులు తట్టి, వారు ఎవరి కోసం పనిచేస్తున్నారో అడగబోం. ఎవరినీ వెంటాడం, ఎవరినీ విచారించం, వారంతా సురక్షితంగానే ఉంటారు’’ అని చెప్పారు.
మహిళలు కీలకం కానున్నారు: జహీబుల్లా
తాలిబాన్ల అధికార ప్రతినిధి ప్రెస్ కాన్ఫరెన్స్ అనంతరం జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
మహిళల హక్కుల గురించి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ మహిళలు చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి అనుమతి ఉంటుందని,
అయితే, అది తమ విధానాల పరిధిలోనే ఉంటుందని చెప్పారు.
తమ సమాజంలో మహిళలు చాలా యాక్టివ్ కానున్నారని జహీబుల్లా చెప్పారు.
మీడియా ఎలా ఉండాలో చెప్పిన జబీహుల్లా
ఫొటో సోర్స్, bbc
‘‘మా సాంస్కృతిక పద్ధతుల పరిధిలో మీడియా స్వేచ్ఛకు కట్టుబడి ఉన్నాం.
ఇస్లాం విలువలకు ఏదీ వ్యతిరేకంగా ఉండరాదు.
మీడియా మా లోటుపాట్లపై దృష్టిపెట్టొచ్చు.. దానివల్ల మేం మరింత బాగా దేశానికి సేవ చేయగలం.
కానీ, మీడియా మాకు వ్యతిరేకంగా పనిచేయరాదు. దేశ ఐక్యత కోసం మీడియా పనిచేయాలి’’ అన్నారు జబీహుల్లా.
తాలిబాన్: షరియా చట్టాల ప్రకారం మహిళలకు హక్కులుంటాయి.. ఎలాంటి వివక్షా ఉండబోదు
‘‘ఎవరికీ హాని జరగబోదని నేను అంతర్జాతీయ సమాజానికి హామీ ఇస్తున్నాను’’ అన్నారు జబీహుల్లా.
‘‘అంతర్జాతీయ సమాజం నుంచి సమస్యలను మేం కోరుకోవడం లేదు’’ అన్నారాయన.
‘‘మా మతపరమైన నియమాలను అనుసరించి చర్యలు తీసుకునే హక్కు మాకుంది. ఇతర దేశాల నియమనిబంధనలు, విధానాలు భిన్నంగా ఉండొచ్చు. అఫ్గాన్‌లు తమ విలువలను అనుసరించి సొంత నియమ నిబంధనలు కలిగి ఉంటారు’’ అని చెప్పారు.
‘‘షరియా విధానం ప్రకారం మహిళల హక్కులకు కట్టుబడి ఉన్నాం. మాతో వారు భుజం భుజం కలిసి పనిచేయబోతున్నారు. ఎలాంటి వివక్షా ఉండబోదని అంతర్జాతీయ సమాజానికి హామీ ఇస్తున్నాం’’ అని చెప్పారు జబీహుల్లా.
అందుకే కాబుల్ వచ్చాం
‘‘మేం కాబుల్‌లో అనిశ్చితిని చూడాలనుకోవడం లేదు.
అధికార మార్పిడి సజావుగా జరగాలన్నదే మా అభిమతం.
కానీ దురదృష్టవశాత్తు, గత ప్రభుత్వం చాలా అసమర్థమైనది.. వారి భద్రతా బలగాలు రక్షణ కల్పించేందుకు ఏమీ చేయలేకపోయాయి.
అందుకే మేం ఏదో ఒకటి చేయాల్సి వచ్చింది.
ప్రజల భద్రత కోసం మేం కాబుల్‌లోకి ప్రవేశించాల్సి వచ్చింద’’ని జబీహుల్లా చెప్పారు.
తాలిబాన్: మేం శత్రువులను కోరుకోవడం లేదు
‘‘అఫ్గానిస్తాన్ ఇకపై యుద్ధ క్షేత్రం కాకూడదని కోరుకుంటున్నాం’’ అని తాలిబాన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ చెప్పారు.
తమకు వ్యతిరేకంగా పోరాడినవారందరికీ క్షమాభిక్ష పెట్టామని, శత్రుత్వాలన్నీ ముగిశాయని అన్నారు.
బయట నుంచి కానీ, అంతర్గతంగా కానీ తాము శత్రువులను కోరుకోవడం లేదని జబీహుల్లా అన్నారు.
తాలిబాన్ల్ ప్రెస్ కాన్ఫరెన్స్: ‘ఇరవయ్యేళ్ల పోరాటం తరువాత దేశానికి విముక్తి కల్పించాం’
కాబుల్‌లో తాలిబాన్ల ప్రెస్ కాన్ఫరెన్స్ మొదలైంది.
దేశాన్ని తమ హస్తగతం చేసుకున్న తరువాత వారు మీడియా ముందుకొచ్చి మాట్లాడడం ఇదే తొలిసారి.
తాలిబాన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతున్నారు.
ఇరవయ్యేళ్ల పోరాటం తరువాత దేశాన్ని విముక్తం చేశామని, విదేశీయులను బయటకు పంపించామని ఆయన చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
ప్రజల ఇళ్లలోకి చొరబడొద్దు: తాలిబాన్ ఫైటర్లకు నాయకత్వం నుంచి ఆదేశాలు
తాలిబాన్ సాయుధులెవరూ ప్రజల ఇళ్లలోకి చొరబడొద్దంటూ ఆ గ్రూప్ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది.
రాయబార కార్యాలయాల వాహనాలను అడ్డగించరాదని, ముఖ్యంగా కాబుల్‌లో రాయబార కార్యాలయాల వాహనాల విషయంలో జోక్యం వద్దని తాలిబాన్లు ఆదేశాలు జారీ చేశారు.
తాలిబాన్ డిప్యూటీ లీడర్ మొలావీ యాకూబ్ ఒక వాయిస్ నోట్ ద్వారా ఈ ఆదేశాలను జారీ చేశారు.
తాలిబాన్లు క్రమంగా అఫ్గానిస్తాన్‌లో తమ అధికారాన్ని చాటుకుంటున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులంతా నిర్భయంగా తమ విధులకు వెళ్లొచ్చని తాలిబాన్లు ఇప్పటికే చెప్పారు. లూటీలు చేస్తూ ఎవరైనా దొరికితే కఠిన శిక్షలు తప్పవని వారు హెచ్చరించారు.
మందుల దుకాణాలు, బేకరీలు మంగళవారం తెరచుకున్నాయి. సోమవారంతో పోల్చితే ట్రాఫిక్ కూడా పెరిగింది.
2001లో అఫ్గానిస్తాన్‌పై యుద్ధం ప్రకటించిన జార్జ్ బుష్ ఇప్పుడేమంటున్నారు, తాలిబాన్‌ల హస్తగతంపై అమెరికా మాజీ అధ్యక్షుడి స్పందన
ఫొటో సోర్స్, AFP
ఇరవయ్యేళ్ల కిందట అఫ్గానిస్తాన్‌పై దాడి చేయాలని నిర్ణయించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ తాజా పరిణామాలపై స్పందించారు.
తాలిబాన్‌లు తిరిగి అఫ్గానిస్తాన్‌పై పట్టు సాధించడంతో ఆయన ఓ ప్రకటన జారీ చేశారు.
2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై అల్ ఖైదా దాడి తరువాత అఫ్గానిస్తాన్‌పై యుద్ధం ప్రకటించారు జార్జ్ బుష్.
అఫ్గానిస్తాన్‌లో తాజా విషాద ఘటనలను చూసి తాను, తన భార్య తీవ్ర ఆవేదనకు గురయ్యామని జార్జ్ బుష్ తన తాజా ప్రకటనలో తెలిపారు.
‘‘అఫ్గాన్ ప్రజల బాధ, కష్టాలను చూసి.. అమెరికా, నాటో దళాల త్యాగాలను గుర్తు చేసుకుని తీవ్ర ఆవేదన చెందుతున్నాం’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
అఫ్గానిస్తాన్ అభివృద్ధికి కృషిచేసిన ఆ దేశ ప్రజలంతా ఇప్పుడు కష్టాలు పడుతున్నారని బుష్ అన్నారు.
అఫ్గానిస్తాన్‌కు ఆర్థిక సాయం ఆపేసిన జర్మనీ
అఫ్గానిస్తాన్‌కు అందించే అభివృద్ధి నిధులను ఆపేస్తున్న జర్మనీ డెవలప్‌మెంట్ గెర్డ్ ముల్లర్ ప్రకటించారు.
జర్మనీకి చెందిన వార్తా సంస్థ జీడీఏతో మాట్లాడుతూ ముల్లర్.. అఫ్గానిస్తాన్‌లో ఉన్న జర్మనీ పౌరులు, జర్మన్ స్టేట్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌లో పనిచేసే అంతర్జాతీయ ఉద్యోగులను ఇప్పటికే సురక్షితంగా తరలించినట్లు చెప్పారు.
జర్మనీ నుంచి అత్యధికంగా ఆర్థిక సహాయం పొందే దేశాలలో అఫ్గానిస్తాన్ ముందు వరుసలో ఉందని జర్మన్ మీడియా చెబుతోంది.
ఇప్పుడా సహాయాన్ని జర్మనీ నిలిపివేసింది.
‘ఆడామగా మాట్లాడుకున్నా తప్పే.. ఇంటి తలుపుకొట్టి ఏమడిగితే అది ఇచ్చేయాల్సిందే’, ‘తాలిబాన్‌ల పాలనంటే మహిళలకు గుండెదడే’
మంత్రసాని పనిచేసే నూరియా హయా నిత్యం పురుష వైద్యులతో మాట్లాడాల్సి ఉంటుంది.
ప్రాధాన్యం ప్రకారం ఆమె ఆ రోజు ఏ క్లినిక్‌లో పనిచేయాలి.. ఏఏ గర్భిణులకు సేవలందించాలనేది వైద్యులే నిర్ణయిస్తారు.
అఫ్గానిస్తాన్‌లోని తఖర్ ప్రావిన్స్‌లో పెద్దగా సౌకర్యాలు ఉండని ఇష్కామిష్ ప్రాంతంలో ఆమె పనిచేస్తారు. తజకిస్తాన్ సరిహద్దుల్లో ఉండే మారుమూల గ్రామీణ ప్రాంతమది.
అయితే, ఆ ప్రాంతాన్ని తాలిబాన్‌లు అధీనంలోకి తీసుకున్న తరువాత క్లినిక్‌లలో ఆడ, మగ సిబ్బంది మాట్లాడుకోవడంపై నిషేధం విధించారని 29 ఏళ్ల నూరియా హయా చెప్పారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అఫ్గానిస్తాన్‌లో పరిస్థితిపై చర్చ జరిపేందుకు సోమవారం ఒక
ప్రత్యేక సమావేశానికి పిలుపునిచ్చింది.
ఈ సమావేశం పాకిస్తాన్ భారత్‌పై తీవ్ర ఆరోపణలు
చేసింది.
నిజానికి, ఈ సమావేశానికి
పాకిస్తాన్ కూడా హాజరు కావాలని కోరుకుంది. అయితే, పాకిస్తాన్‌కు అనుమతి లభించలేదు.
అఫ్గానిస్తాన్ అంశంపై
భద్రతామండలి గత వారం కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. అప్పుడు కూడా పాకిస్తాన్‌కు
అనుమతి లభించలేదు.
ఐక్యరాజ్యసమితి భద్రతా
మండలిలో అధ్యక్ష పదవిలో భారత్ ఉన్నందువల్లే తమకు అవకాశం ఇవ్వడం లేదని పాకిస్తాన్
ఆరోపించింది.
ఆగస్టులో భారత్ అధ్యక్ష
బాధ్యతలు చేపట్టిన తర్వాత 10 రోజుల్లో అఫ్గానిస్తాన్
అంశంపై భద్రతా మండలి రెండోసారి అత్యవసర సమావేశం నిర్వహించింది.
పాకిస్తాన్ ఆరోపణలపై
భారత్ మౌనం వహిస్తోంది. పాకిస్తాన్ మాత్రం భారత్‌పై ఆరోపణలు చేస్తోంది.
సోమవారం కౌన్సిల్
సమావేశం తరువాత, ఐక్యరాజ్యసమితిలో
పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి మునీర్ అక్రమ్ మాట్లాడారు. అఫ్గానిస్తాన్‌పై చర్చల్లో
తమను పాల్గొనడానికి భారత్ అనుమతించడం లేదని ఆరోపించారు.
అఫ్గానిస్తాన్ శాంతి
ప్రక్రియలో పాకిస్తాన్‌ది ముఖ్యమైన పాత్ర అని, అఫ్గానిస్తాన్‌పై మాట్లాడటానికి భారతదేశం
ఉద్దేశపూర్వకంగానే తమని అనుమతించడం లేదని అక్రమ్ అన్నారు.
ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, ఐక్యరాజ్యసమితిలో పాక్ శాశ్వత ప్రతినిధి మునీర్ అక్రమ్
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి కూడా మరోసారి భారత్‌పై విమర్శలు గుప్పించారు.
అఫ్గానిస్తాన్ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో భారత్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ట్వీట్ చేశారు. శాంతి స్థాపన లక్ష్యంగా ఏర్పాటైన ఈ వేదికను భారత్ రాజకీయంగా వాడుకుంటోందని ఆరోపించారు.
అఫ్గాన్‌లో ప్రస్తుత పరిస్థితులకు రాజకీయ పరిష్కారాన్ని కనుగొనాలని, మరోసారి ఈ ప్రాంతం తీవ్రవాదులకు నిలయంగా మారడానికి అనుమతించవొద్దని భద్రతా మండలి సమావేశంలో తాలిబాన్లను విజ్ఞప్తి చేశారు.
మహిళలు, పిల్లలు, మైనారిటీల మానవ హక్కులను పూర్తిగా కాపాడేలా పరిష్కారం ఉండాలని ఐక్యరాజ్యసమితిలో భారత్ శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి చెప్పారు.
ఫొటో సోర్స్, Reuters
ఈ సమావేశంలో అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితి గురించి చైనా ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు.
పాకిస్తాన్‌కు ఈ సమావేశానికి అనుమతి ఇవ్వకపోవడంపై చైనా శాశ్వత ప్రతినిధి జాంగ్ జున్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
అఫ్గానిస్తాన్‌లో యుద్ధం అంతం కావాలని అఫ్గాన్ ప్రజలు మాత్రమే కోరుకోవడం లేదని, అంతర్జాతీయ సమాజం మొత్తం అదే కోరుకుంటోందని ఆయన అన్నారు.
అఫ్గానిస్తాన్ ప్రజల భయాందోళనలకు అద్దం పట్టే చిత్రం
ఫొటో సోర్స్, Defence one
అఫ్గానిస్తాన్‌లో ప్రజల ఆందోళన, భయానికి దర్పణం పట్టే చిత్రమిది.
యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన సీ-17 కాబుల్ నుంచి ఖతర్ బయలుదేరగా అందులో వందలాది మంది అఫ్గాన్‌లు కూర్చున్నారు.
కాబుల్‌ను తాలిబాన్‌లు హస్తగతం చేసుకున్న కొద్ది గంటల తరువాత ఆదివారం ఈ విమానం ఖతర్ బయలుదేరగా వందలాది మంది అఫ్గానిస్తాన్ ప్రజలు ఎలాగోలా అందులోకి ఎక్కగలిగారు.
మొత్తం 640 మంది ఆ విమానంలో ప్రయాణించారని.. సీ-17 విమానంలో అంతమంది వెళ్లడం చరిత్రలో తొలిసారని యూఎస్ డిఫెన్స్ న్యూస్ వెబ్‌సైట్ ‘డిఫెన్స్ వన్’ పేర్కొంది.
విమానం సిబ్బంది వారందరినీ బయటకు పంపించకుండా విమానం ఎక్కనివ్వడంతో అంతమంది ప్రయాణించగలిగారని ‘డిఫెన్స్ వన్’ తెలిపింది.
కాబూల్ నుంచి భారత్ చేరిన 150 మంది
ఫొటో సోర్స్, Indian army
కాబుల్ నుంచి భారత్ వచ్చిన భారత వైమానిక దళం విమానం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో
దిగింది.
ఫొటో సోర్స్, indian army
ఈ విమానంలో మొత్తం 150 మందిని అధికారులు స్వదేశానికి తీసుకువచ్చారు.
ఫొటో సోర్స్, indian army
వీరంతా మధ్యాహ్నం 2.30కు దిల్లీ చేరుకోనున్నారు.
తాలిబాన్ల పాలనలో భయాన్ని చిత్రాల్లో చూపిన గ్రాఫిటీ ఆర్టిస్ట్
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of Instagram ముగిసింది, 1
అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ల ఆక్రమణకు సంబంధించి ఆ దేశానికి
చెందిన మహిళా గ్రాఫిటీ ఆర్టిస్ట్ షంసియా హసానీ చిత్రాలు రూపొందించారు.
ఆమె అఫ్గానిస్తాన్‌లోని తొలి మహిళా గ్రాఫిటీ కళాకారిణిగా పాపులర్
అయ్యారు.
తాలిబాన్ల పాలనలో
మహిళల భవిష్యత్తును ప్రతిబింబించేలా రూపొందించిన ఒక చిత్రాన్ని ఆమె తాలిబాన్లు కాబుల్‌ను ఆక్రమించుకోవడానికి ముందు పోస్ట్ చేశారు.
అందులో చీకటిలో ఉన్న తాలిబాన్ ఫైటర్ ముందు ఒక బాలిక ఒక కుండీలో మొక్కను పట్టుకుని ఉంటుంది.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of Instagram ముగిసింది, 2
ఆమె వేసిన నైట్‌మేర్ అనే మరో చిత్రంలో మొత్తం బురఖా ధరించి రెండు చేతులతో పియానోను పొదివి పట్టుకున్న ఒక మహిళ కనిపిస్తుంటారు. ఆమె వెనుక చీకటి ఆకారాల్లా తాలిబాన్ ఫైటర్లు ఉంటారు.
1990లో తాలిబాన్ల పాలనలో మహిళలు ముఖం మొత్తాన్ని కవర్ చేసుకోవడం కూడా తప్పనిసరి చేశారు. ఎవరైనా పూర్తిగా దుస్తులు ధరించకుండా కనిపిస్తే వారిని కొరడాలతో కొట్టేవారు.
అఫ్గాన్ న్యూస్ చానల్‌లో మళ్లీ కనిపించిన మహిళా యాంకర్లు
ఫొటో సోర్స్, @MiraqaPopal
అఫ్గానిస్తాన్ ప్రధాన మీడియా సంస్థల్లో ఒకటైన టోలో న్యూస్ తెరపై మరోసారి
మహిళా యాంకర్లు కనిపించారు.
"ఈరోజు నుంచి మహిళా యాంకర్లతో మా ప్రసారాలు తిరిగి ప్రారంభించాం" అని టోలో న్యూస్ హెడ్ మిరాకా పోపాల్ ట్వీట్ చేశారు.
ఆదివారం తాలిబాన్లు రాజధాని కాబుల్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అఫ్గానిస్తాన్‌లోని
ప్రధాన న్యూస్ చానళ్లలో తెరపై కనిపించకుండా మహిళలు దూరంగా ఉన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 1
తాలిబాన్ జెండా ముందు ఒక వ్యక్తి ప్రజంట్ చేస్తున్న ఫొటోలను ఒక జాతీయ టీవీ చానల్ ఆన్‌లైన్లో షేర్ చేసింది.
ఒక మహిళా ప్రజంటర్ స్టూడియోలో తాలిబాన్ మీడియా టీమ్ మెంబర్‌ను లైవ్‌లో ఇంటర్వ్యూ చేస్తున్న ఫొటోలను కూడా టోలో న్యూస్ హెడ్ మిరకా పోపాల్ ట్వీట్ చేశారు.
ఉదయం న్యూస్‌రూమ్‌కు హిజాబ్ ధరించిన ఒక మహిళ హాజరైనట్లు కనిపిస్తున్న ఒక ఫొటోను కూడా ఆయన మరో ట్వీట్‌లో షేర్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 2
ప్రభుత్వ అధికారులకు తాలిబాన్ల క్షమాభిక్ష
తాలిబాన్ సంస్థ ప్రభుత్వ అధికారులందరికీ సాధారణ క్షమాభిక్ష ఇస్తున్నట్లు ప్రకటించింది.
వారు "పూర్తి విశ్వాసంతో" మళ్లీ పనుల్లోకి రావాలని కోరింది.
"అందరికీ సాధారణ క్షమాభిక్ష జారీ చేశాం. కాబట్టి మీరు పూర్తి విశ్వాసంతో మీ
సాధారణ జీవితాన్ని ప్రారంభించాలి" అని తాలిబాన్లు ఒక ప్రకటనలో చెప్పారని ఏఎఫ్
పీ వార్తా సంస్థ పేర్కొంది.
అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడినట్టు
తెలుస్తోంది.
ప్రభుత్వం లేదా పాశ్చాత్య మద్దతు ఉన్న సంస్థల్లో పనిచేసేవారిలో భయాందోళనలు
ఎక్కువగా ఉన్నాయి.
ఉదాహరణకు అమెరికా దళాలకు అనువాదకులుగా పనిచేసిన వారు తాలిబాన్ల పాలన
ప్రారంభమవడంతో ఆందోళనలో ఉన్నారు.
తాలిబాన్లు క్రూరమైన శిక్షలను అమలు చేస్తారనే విషయం తెలిసిందే. ఇటీవల యుద్ధ నేరాలకు
పాల్పడినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే వాటిని తాలిబాన్ నేతలు ఖండించారు.