అఫ్గానిస్తాన్: 'షరియా చట్టం ప్రకారమే మా పాలన ఉంటుంది, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉండదు'

‘అఫ్గానిస్తాన్‌లో ఎలాంటి పాలన అందించాలనే విషయంలో మేం చర్చించుకోం. ఎందుకంటే షరియా చట్టం ప్రకారం పాలన సాగించాలనే విషయంలో మేమంతా స్పష్ఠంగా ఉన్నాం’ అని తాలిబాన్‌ల విధాన నిర్ణయాల గురించి సమాచారం పొందే స్థాయిలో ఉన్న నేత వహీదుల్లా హషీమీ రాయిటర్స్‌తో అన్నారు.

లైవ్ కవరేజీ

  1. తాలిబాన్: అఫ్గానిస్తాన్ ప్రజాస్వామ్య దేశంగా ఉండబోదు

    తాలిబాన్‌ల పాలనలో అఫ్గానిస్తాన్ ప్రజాస్వామ్య దేశంగా ఉండబోదని ఆ గ్రూప్ సీనియర్ సభ్యుడు ఒకరు రాయిటర్స్ వార్తాసంస్థతో చెప్పారు.

    తాలిబాన్‌ల విధాన నిర్ణయాల గురించి సమాచారం పొందే స్థాయిలో ఉన్న నేత వహీదుల్లా హషీమీ రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. ‘‘మా పాలనలో అఫ్గానిస్తాన్ ప్రజాస్వామ్య దేశంగా ఉండదు. అఫ్గానిస్తాన్‌లో ప్రజాస్వామ్య పునాదులే లేవు’’ అన్నారు.

    ‘‘అఫ్గానిస్తాన్‌లో ఎలాంటి పాలన అందించాలనే విషయంలో మేం చర్చించుకోం. ఎందుకంటే షరియా చట్టం ప్రకారం పాలన సాగించాలనే విషయంలో మేమంతా స్పష్ఠంగా ఉన్నాం’’ అన్నారాయన.

    తమ సుప్రీమ్ లీడర్ హైబతుల్లా అఖుంద్‌జాదా దేశానికి సర్వాధినేతగా ఉంటారని హషీమీ చెప్పారు.

  2. షరియా అంటే ఏంటి, ఈ చట్టం మహిళల గురించి ఏం చెబుతోంది?

    షరియా

    ఫొటో సోర్స్, AFP

    ఇస్లాం న్యాయ వ్యవస్థ అయిన షరియా చట్టాన్ని నిక్కచ్చిగా అమలు చేయడం ద్వారా అఫ్గానిస్తాన్‌ను పరిపాలిస్తామని కాబుల్‌ను వశపర్చుకున్నాక ఏర్పాటు చేసిన మొదటి విలేఖరుల సమావేశంలో తాలిబాన్‌లు ప్రకటించారు.

    పత్రికా స్వేచ్ఛ, మహిళల హక్కులకు షరియా చట్ట పరిధిలోనే గౌరవిస్తామని తాలిబాన్ అధికార ప్రతినిధి అన్నారు.

    అయితే, షరియా చట్టం అమలు ఎలా ఉంటుందనే విషయంలో వారు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

    ఇంతకీ షరియా అంటే ఏమిటి?

  3. అష్రాఫ్ ఘనీ ఎంత డబ్బుతో పారిపోయారంటే..

    అష్రాఫ్ ఘనీ

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, అష్రాఫ్ ఘనీ

    అఫ్గనిస్తాన్‌లో పదవీచ్యుతుడైన అధ్యక్షుడు అష్రాఫీ ఘనీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్నారు.

    ఘనీ 16.9 కోట్ల డాలర్ల డబ్బుతో పారిపోయారని తజికిస్తాన్‌లోని అఫ్గాన్ రాయబారి మొహమ్మద్ జహీర్ అగ్బర్ ఆరోపించారు. ఘనీ స్వదేశానికి, అఫ్గాన్ జాతికి మోసం చేశారని ఆయన ఆరోపించారు.

    తమ రాయబార కార్యాలయం అఫ్గాన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలేహ్‌ను అధ్యక్షుడిగా గుర్తిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

    కాగా మంగళవారం రాత్రి ‘బీబీసీ’కి పంపిన ఒక వాయిస్ మెసేజ్‌లో అమ్రుల్లా సాలేహ్.. అధ్యక్షుడు పారిపోవడంతో తానే అఫ్గానిస్తాన్‌కు చట్టబద్ధమైన కేర్‌టేకర్ ప్రెసిడెంట్‌ని అని, తాలిబాన్లతో యుద్ధం ముగియలేదని చెప్పారు.

    అమ్రుల్లా సాలేహ్

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, అమ్రుల్లా సాలేహ్
  4. జలాలాబాద్‌ నిరసనల్లో తాలిబాన్ల కాల్పులు, ఒకరి మృతి

    జలాలాబాద్‌లో జరిగిన నిరసనల్లో ఒకరు మృతి చెందారు.

    స్థానికులు అఫ్గానిస్తాన్ జాతీయ జెండాను ఎగరవేసే ప్రయత్నం చేయగా వారిపై తాలిబాన్లు కాల్పులు జరపడంతో ఒకరు మరణించినట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.

  5. బ్రేకింగ్ న్యూస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్న అష్రాఫ్ ఘనీ

    ఘనీ

    ఫొటో సోర్స్, Getty Images

    తాలిబాన్ల పునరాగమనంతో పలాయనం సాగించిన అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్నట్లు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

    ‘‘ప్రెసిడెంట్ అష్రాఫ్ ఘనీ, ఆయన కుటుంబానికి మానవతా దృక్పథంతో స్వాగతం పలికినట్లు యూఏఈ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది’’ అని ఆ శాఖ అధికార ప్రతినిధి ఒకరు ప్రకటన విడుదల చేశారు.

  6. ‘తాలిబాన్లు నాకోసం వెతుకుతున్నారు’

    అజ్మల్ అహ్మదీ
    ఫొటో క్యాప్షన్, అజ్మల్ అహ్మదీ

    అఫ్గానిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ మాజీ గవర్నర్ అజ్మల్ అహ్మదీ తాను స్వదేశానికి వెళ్లబోవడం లేదని చెప్పారు.

    తాలిబాన్లు తనకోసం వెతుకుతున్నారని... మాజీ అధికారులకు క్షమాభిక్ష పెడుతున్నామని తాలిబాన్లు ప్రకటిస్తే తప్ప అఫ్గానిస్తాన్ వెళ్లలేనని ‘బీబీసీ’తో అన్నారు.

    తాను ఇంతకుముందు నివసించినచోట్ల తన కోసం వెతుకుతున్నారని ఆయన చెప్పారు.

    అఫ్గానిస్తాన్ ఇంటర్నేషనల్ రిజర్వ్స్‌ను అమెరికా ఫ్రీజ్ చేస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. అదే జరిగితే తాలిబాన్లకు కరెన్సీ సమస్యలొస్తాయన్నారు.

  7. పెరుగుతున్న తాలిబాన్ వ్యతిరేక నిరసనలు

    అఫ్గానిస్తాన్‌లోని జలాలాబాద్, కునార్, ఖోస్త్ తదితర ప్రాంతాలలో తాలిబాన్ వ్యతిరేక నిరసనలు జరుగుతున్నాయి.

    నిరసనకారులు అఫ్గాన్ జాతీయ పతాకాలు చేతబూని నిరసనల్లో పాల్గొంటున్నారు. ఈ నిరసనలు దేశమంతటికీ వ్యాపిస్తాయో లేదో అప్పుడే చెప్పలేమని ‘బీబీసీ పాష్టో’ అంటోంది.

    అయితే, పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయని.. తాలిబాన్లు కూడా ఒత్తిడిలో ఉన్నారని చెబుతున్నారు.

    పంజ్‌షీర్ లోయలో నార్తర్న్ అలయన్స్ జెండాలలో భారీ ర్యాలీలు తీసినట్లు కొన్ని వీడియోలు షేర్ అవుతున్నాయి. వీటిని బీబీసీ ధ్రువీకరించలేదు.

    తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్న మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలేహ్ నేతృత్వంలో ‘రెసిస్టెన్స్ ఆర్మీ’ ఈ ర్యాలీలు నిర్వహిస్తోందని చెబుతున్నారు. తాజా పరిణామాలపై తాలిబాన్లు ఇంకా స్పందించలేదు.

  8. తాలిబాన్ జెండాలు తీసేసి అఫ్గాన్ జెండా ఎగురవేసిన ప్రజలు

    తాలిబాన్ల జెండా

    ఫొటో సోర్స్, EPA

    అఫ్గానిస్తాన్ తూర్పు ప్రాంతంలోని జలాలాబాద్‌లో తాలిబాన్లకు వ్యతిరేకంగా ప్రజలు బుధవారం ప్రదర్శనలు చేపట్టారు.

    అఫ్గానిస్తాన్ నుంచి పాకిస్తాన్‌ను కలిపే రహదారులను స్వాధీనం చేసుకున్నాక ఆదివారమే ఈ నగరాన్ని తాలిబాన్లు తమ అధీనంలోకి తీసుకున్నారు.

    అయితే, బుధవారం జలాలాబాద్ ప్రజలు అఫ్గానిస్తాన్ జాతీయ జెండాలతో వీధుల్లోకి వచ్చారు.

    అఫ్గానిస్తాన్ జాతీయ జెండాయే ఎగరాలంటూ వారు ప్రదర్శనలు చేశారు.

    ప్రజలను చెదరగొట్టడానికి అక్కడ తాలిబాన్‌లు కాల్పులు జరిపారని వార్తలొస్తున్నాయి.

    తాలిబాన్ల జెండా తొలగించి అఫ్గానిస్తాన్ జాతీయ జెండా ఎగరేసిన వీడియోలు ఆన్‌లైన్లో కనిపించాయి.

    తాలిబాన్లు ప్రకటించుకున్న ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్గానిస్తాన్ రాజ్యానికి సంబంధించిన జెండాలు తెల్లగా ఉండి వాటిపై నల్లని అక్షరాలతో రాతలుంటాయి.

    ఎరుపు, ఆకుపచ్చ, నల్ల రంగుల్లోని త్రివర్ణ పతాకాలతో జలాలాబాద్‌లో ప్రదర్శనకారులు కనిపించారు.

    తాలిబాన్ల వశం కాకమునుపటి అఫ్గానిస్తాన్ జాతీయ జెండా అది.

    కాగా అఫ్గానిస్తాన్ జాతీయ జెండాగా ఏది ఉపయోగించాలనే విషయంలో చర్చ జరుగుతోందని, కొత్తగా ఏర్పడే ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటుందని తాలిబాన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ చెప్పారు.

  9. ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు

    అఫ్గాన్ ప్రజల కోసం ప్రదర్శనలు

    ఫొటో సోర్స్, AFP

    జెనీవా నుంచి వాషింగ్టన్ డీసీ వరకు ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల అఫ్గానిస్తాన్ ప్రజలకు మద్దతుగా ప్రదర్శనలు చేపట్టారు.

    తాలిబాన్ పాలన నుంచి బయటపడాలనుకుంటున్న అఫ్గాన్ ప్రజలు సురక్షితంగా అక్కడి నుంచి వెళ్లేందుకు సహకరించాలని ప్రజలు కోరుతున్నారు.

    మంగళవారం జరిగిన కొన్ని ప్రదర్శనల చిత్రాలు ఇవి.

    అఫ్గాన్ ప్రజల కోసం ప్రదర్శనలు

    ఫొటో సోర్స్, ge

    అఫ్గాన్ ప్రజల కోసం ప్రదర్శనలు

    ఫొటో సోర్స్, Reuters

  10. అఫ్గానిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌ను కలిసిన మిలిటెంట్ లీడర్

    హక్కానీ నెట్‌వర్క్ సీనియర్ నేత అనాస్ హక్కానీ అఫ్గానిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌ను కలిశారు.

    ఈ భేటీలో గత ప్రభుత్వంలో శాంతి రాయబారిగా పనిచేసిన అబ్దుల్లా అబ్దుల్లా కూడా ఉన్నారు.

    కర్జాయ్, హక్కానీల భేటీకి సంబంధించిన చిత్రాలు ఆన్‌లైన్‌లో షేర్ అవుతున్నాయి. అయితే, ఇద్దరు నేతలూ ఏం మాట్లాడుకున్నారో వివరాలు తెలియలేదు.

    టెర్రరిస్ట్ సంస్థగా అమెరికా గుర్తించిన హక్కానీ నెట్‌వర్క్ పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో తాలిబాన్ల ఆర్థిక, సైనిక సంపత్తి బాధ్యతలు చూసుకుంటుంది.

    అఫ్గానిస్తాన్‌లో శక్తిమంతమైన, భయంకరమైన మిలిటెంట్ గ్రూపుల్లో హక్కానీ నెట్‌వర్క్ కూడా ఒకటి.

    ఇటీవల కాలంలో అఫ్గానిస్తాన్ బలగాలు, సంకీర్ణ సేనలకు వ్యతిరేకంగా హింసాత్మక దాడులు చేసింది హక్కానీ నెట్‌వర్క్. కర్జాయ్ 2001 నుంచి 2014 వరకు పదవిలో ఉన్నారు.

    అయితే, హక్కానీతో కర్జాయ్ భేటీ కావడంపై అఫ్గానిస్తాన్‌లో విమర్శలొస్తున్నాయి.

    హక్కానీకి 2016లో మరణశిక్ష వేశారు.

    అయితే, మూడేళ్ల తరువాత ఆయన్ను జైలు నుంచి విడుదల చేయాల్సి వచ్చింది.

    కాబుల్‌లో పనిచేసే ఇద్దరు పాశ్చాత్య ప్రొఫెసర్లను హక్కానీ గ్రూప్ కిడ్నాప్ చేయడంతో వారిని విడిపించుకోవడం కోసం హక్కానీని వదిలిపెట్టారు.

  11. బ్రేకింగ్ న్యూస్, జలాలాబాద్‌లో నిరసనలు

    అఫ్గానిస్తాన్ తూర్పు ప్రాంత నగరం జలాలాబాద్‌లో ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

    అఫ్గానిస్తాన్ జాతీయ జెండాను మార్చొద్దంటూ వారు తాలిబాన్‌లను కోరుతున్నారు.

    మంగళవారం అఫ్గానిస్తాన్‌లోని మరికొన్ని ప్రాంతాలలో కూడా ఇలాంటి నిరసనలు జరిగినట్లు వార్తలొస్తున్నాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  12. ప్రజలను కొడుతున్న తాలిబాన్‌లు, హెచ్చరిక: ఇందులోని చిత్రాలు కొన్ని మీ మనసును కలచివేయవచ్చు.

    గాయాలతో పడిఉన్న మహిళ

    ఫొటో సోర్స్, LA times via getty

    లాస్ ఏంజెలస్ టైమ్స్ పత్రిక ఫొటోగ్రాఫర్ మార్కస్ యామ్ మంగళవారం కాబుల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో తాను చూసిన ఒక ఘటనను వివరించారు.

    పదుల సంఖ్యలో తాలిబాన్‌లు గాల్లోకి కాల్పులు జరపడం, ఎయిర్‌పోర్ట్ వద్ద చేరిన ప్రజలకు తుపాకులు గురిపెట్టడం తాను చూశానని చెప్పారు మార్కస్.

    కర్రలు, తాళ్లు, ఇతర వస్తువులతో పౌరులను చితకబాదడం చూశానన్నారు మార్కస్.

    అవన్నీ ఫొటోలు తీస్తున్నందుకు తననూ కొరడాతో కాలిపై కొట్టారన్నారు మార్కస్.

    ఆఫ్గాన్ ప్రజలు

    ఫొటో సోర్స్, LA times via getty

  13. అష్రాఫ్ ఘనీ ఇప్పుడెక్కడ ఉన్నారు?

    అష్రాఫ్ ఘనీ

    ఫొటో సోర్స్, Reuters

    అఫ్గానిస్తాన్ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ఆదివారం ఆ దేశం విడిచి వెళ్లారు.

    అయితే, ఆయన ఎక్కడున్నారనేది ఇంతవరకు ఎవరూ చెప్పలేకపోతున్నారు.

    కాబుల్‌ను తాలిబాన్లు హస్తగతం చేసుకున్న తరువాత ఘనీ అఫ్గానిస్తాన్ పొరుగుదేశాలైన ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్‌లకు పారిపోయి ఉండొచ్చని చెబుతున్నారు. ఒమన్‌కు వెళ్లిపోయారనీ వార్తలొస్తున్నాయి.

    ఘనీ బుధవారం అబుదాబీలో కనిపించారని వార్తలొచ్చాయి. అయితే, ఈ వార్తలను బీబీసీ ధ్రువీకరించలేదు. అష్రాఫ్ ఘనీ 2014 నుంచి అఫ్గానిస్తాన్ అధ్యక్షుడిగా పనిచేశారు.

    పదవీకాలమంతా ఆయన వివాదాస్పదుడిగానే నిలిచారు.

    ఘనీ పారిపోవడంపై ఆయన కేబినెట్లో మంత్రులుగా పనిచేసినవారే విమర్శలు కురిపిస్తున్నారు.

    అయితే, ఘనీ మాత్రం తన పలాయనాన్ని ఫేస్‌బుక్ వేదికగా సమర్థించుకున్నారు.

    అఫ్గానిస్తాన్‌లో రక్తపాతాన్ని నివారించడానికే తాను దేశం విడిచి వెళ్లిపోయానని ఘనీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు.

  14. తాలిబాన్లను భారత స్వాతంత్ర్య ఉద్యమకారులతో పోల్చిన యూపీ ఎంపీ.. దేశ ద్రోహం కేసు నమోదు

    షఫీకుర్ రెహ్మన్

    ఫొటో సోర్స్, @SRahmanBarq

    ఉత్తర్ ప్రదేశ్‌లో సంభల్ నియోజకవర్గ ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు షఫీకుర్ రెహ్మన్ బుర్క్‌పై దేశ ద్రోహం కేసు నమోదైంది.

    ఓ బీజేపీ కార్యకర్త ఫిర్యాదుపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.

    అఫ్గాన్‌లో అధికారాన్ని కైవసం చేస్తున్న తాలిబాన్లను భారత స్వాతంత్ర్య ఉద్యమకారులతో రెహ్మాన్ పోల్చారు.

    ఈ విషయంపై సంభల్ ఎస్పీ చక్రేశ్ మిశ్రా మీడియాతో మాట్లాడారు. ‘‘కోత్వాలిలో ఎంపీ రెహ్మాన్‌పై ఫిర్యాదు నమోదైంది. ఆయన తాలిబాన్లను.. భారత స్వాతంత్ర్య ఉద్యమకారులతో పోల్చారు. ఇలాంటి వ్యాఖ్యలు దేశ ద్రోహం కిందకు వస్తాయి. అందుకే ఐపీసీలోని సెక్షన్ 124-ఏ, 153-ఏ, 295ల కింద ఆయనపై కేసు నమోదు చేశాం. మరోవైపు సోషల్ మీడియలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మరో ఇద్దరి వీడియోలు కూడా కనిపిస్తున్నాయి. వాటిపై కూడా కేసు నమోదుచేశాం’’అని మిశ్రా వివరించారు.

    రెహ్మాన్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

    ‘‘భారత్‌ను బ్రిటిష్ వారు ఆక్రమించినప్పుడు మనం స్వాతంత్ర్యం కోసం పోరాడాం. అలానే ఇప్పుడు తాలిబాన్లు కూడా తమ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. మొదట రష్యాపై, నేడు అమెరికాపై వారు పోరాటం చేశారు. ఇది వారి స్వాతంత్ర్య ఉద్యమం. దీనిలో ఎవరూ జోక్యం చేసుకోకూడదు’’అని రెహ్మాన్ వ్యాఖ్యానించారు.

    రెహ్మాన్ వ్యాఖ్యలను బీజేపీ నాయకులు ఖండించారు. ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పాలని ఉత్తర్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యతోపాటు మరికొందరు బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రెహ్మాన్‌ను రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా విమర్శించారు.

    కేసు నమోదైన అనంతరం స్పందన కోరేందుకు రెహ్మాన్‌ను బీబీసీ సంప్రదించింది. అయితే, ఆయన స్పందించలేదు.

    రెండేళ్లక్రితం వందేమాతరంపై కూడా ఆయన ఇలానే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో ఉర్దూలో ఆయన ప్రమాణం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వందేమాతరం ఇస్లాంకు వ్యతిరేకమైనది. మేం దాన్ని పాడలేం’’అని అన్నారు.

  15. తాలిబాన్ నాయకత్వం

    తాలిబాన్ నాయకత్వం
  16. అఫ్గానిస్తాన్‌లోకి వెళ్లడం 'చెత్త నిర్ణయం': ట్రంప్

    అఫ్గానిస్తాన్‌లోకి అమెరికా వెళ్లడం "మన దేశ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయం" అని మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అభివర్ణించారు.

    ఫాక్స్ న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. "మేము మధ్యప్రాచ్యాన్ని నాశనం చేశాము. మాకు ట్రిలియన్‌ల డాలర్లు ఖర్చు అయ్యింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం జరుగుతున్నది దానికంటే భిన్నమైనది కాదు. ఇది చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే మీరు దానిని పునర్నిర్మించాల్సి ఉంది. అది ముక్కలైంది" అని ఆయన చెప్పారు.

    ‘‘అక్కడ ఇరుక్కుపోవడం అంటే ఇసుక ఊబిలో చిక్కుకుపోవడంలాంటిది’’ అని కూడా అభివర్ణించారు ట్రంప్.

    కాగా, అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా వైదొలిగేందుకు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ అనుసరిస్తున్న విధానాలను కూడా ట్రంప్ తప్పుపట్టారు. తాను కనుక అధికారంలో ఉండి ఉంటే భిన్నమైన నిర్ణయాలు తీసుకునేవాడినని చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  17. తిరిగొచ్చిన తాలిబాన్ సహ వ్యవస్థాపకుడు.. ఘన స్వాగతం పలికిన ప్రజలు

    తాలిబాన్ సహవ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బారాదర్ అఫ్గానిస్తాన్ కి తిరిగి వచ్చారు.

    ఆయనకు అఫ్గాన్లో ఘన స్వాగతం లభించింది. ప్రజల హర్షాతిరేకాల మధ్య ఆయన కాందహార్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరారు.

    అమెరికాతో చర్చల్లో భాగంగా కొన్ని నెలలుగా ఆయన దోహాలోనే ఉంటున్నారు.

    అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్ ఆధీనంలోకి తెచ్చుకున్న క్రమంలో ఆయన నాటకీయ పరిణామాల మధ్య పునరాగమనం చేసినట్లు అయింది.

    తాలిబాన్లకు ఆధ్యాత్మిక జన్మస్థలం కాందహార్. అంతేకాకుండా వారికి ఇది ఒక ముఖ్యమైన బేస్ కూడా.

    20 ఏళ్ల క్రితం అమెరికా మిలటరీ చేసిన దాడిలో కాందహార్ తాలిబాన్ల నుంచి చేజారింది.

    కాందహార్ ఎయిర్‌పోర్టు నుంచి కారులో వస్తున్న బారాదర్‌ను కలుసుకునేందుకు పెద్ద ఎత్తున జనాలు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  18. బీబీసీ లైవ్ అప్‌డేట్స్‌కు స్వాగతం..

    అఫ్గానిస్తాన్‌లో నిన్న కూడా అతి వేగంగా మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా జరిగిన సంఘటనలివే:

    ఖతార్ రాజధాని దోహా నుంచి తాలిబాన్ నాయకులు తిరిగి అఫ్గానిస్తాన్ చేరుకుంటున్నారు.

    అంతర్జాతీయ బలగాల తొలగింపు గురించి అమెరికాతో చర్చలు జరిపేందుకు వీరు ఇప్పటివరకూ దోహాలోనే ఉన్నారు.

    ఆదివారం దేశాన్ని ఆధీనంలోకి తీసుకున్న తర్వాత తొలిసారిగా తాలిబాన్లు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

    తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహీద్ ఈ సమావేశంలో మాట్లాడుతూ ఇస్లామిక్ చట్టంలోని నిబంధనల ప్రకారం మహిళలు సమాజంలో చురుకుగా పాల్గొంటారని వెల్లడించారు.

    తాలిబాన్‌కు వ్యతిరేకంగా పోరాడిన ప్రతి ఒక్కరికీ క్షమాభిక్ష పెడుతున్నట్లు ఆయన తెలిపారు.

    తాలిబాన్లు రాజధాని కాబుల్లో చాలా చోట్ల చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. కాబుల్ ఎయిర్‌పోర్టు ద్వారా అఫ్గానిస్తాన్‌ను వదిలేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

    తాలిబాన్‌తో తాము సంప్రదింపులు జరుపుతున్నట్లు అమెరికా తెలిపింది.

    ప్రయాణీకులు సురక్షితంగా ఎయిర్‌పోర్టుకు చేరేలా చూడాలని కోరినట్లు వైట్ హౌస్ వెల్లడించింది.

    వేలాది మంది దేశం విడిచేందుకు ప్రయత్నిస్తుండటంతో సోమవారం ఎయిర్‌పోర్టు వద్ద ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

  19. అఫ్గానిస్తాన్‌ను అల్‌ఖైదాకు అడ్డా కానివ్వబోం: జబీహుల్లా

    జబీహుల్లా

    ఫొటో సోర్స్, Reuters

    అఫ్గానిస్తాన్ భూభాగాన్ని ఎవరికి వ్యతిరేకంగా పోరాటాలకు ఉపయోగించుకోనివ్వబోమని జబీహుల్లా చెప్పారు.

    అల్ ఖైదా ఫైటర్లకు అఫ్గానిస్తాన్ స్థావరంగా మారే ప్రమాదం ఉందా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఈ విషయం స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజానికి ఈ మేరకు హామీ ఇస్తున్నామని జబీహుల్లా చెప్పారు.