గంటకు 417 కిలోమీటర్ల వేగంతో కారు జర్నీ.. చెక్ రిపబ్లిక్ మిలియనీర్‌పై జర్మనీ దర్యాప్తు

Bugatti

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, బుగాటి కారు (పాత ఫొటో)

జర్మనీ రోడ్లపై స్పీడ్ లిమిట్ లేదు.

కానీ కారులో గంటకు 417 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు భావిస్తున్న ఒక మిలియనీర్‌పై జర్మనీ విచారణ జరుపుతోంది.

సక్సోని-అన్‌హాల్ట్ రాష్ట్రాల మధ్య ఉన్న రోడ్డుపై గంటకు 417 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించారని చెక్ రిపబ్లిక్‌కు చెందిన మిలియనీర్ రాడిమ్ పాసర్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

చట్టవిరుద్ధమైనదిగా భావిస్తున్న ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టినట్లు స్టెండల్‌లోని ప్రాసిక్యూటర్‌ కార్యాలయం ప్రకటించింది.

ఈ కేసులో నేరం నిరూపణ అయితే రాడిమ్‌కు రెండు సంవత్సరాల జైలు లేదా జరిమానా విధించొచ్చని నివేదికలు చెబుతున్నాయి.

వీడియో క్యాప్షన్, ట్రాఫిక్ సమస్యని తప్పించుకోవడానికి ఆఫీసుకి ఈదుకుంటూ వెళ్తున్నారు.

చెక్ రిపబ్లిక్‌కు చెందిన ఖరీదైన స్పోర్ట్ కారు యజమాని గత వేసవిలో చేసినట్టు భావిస్తున్న ఈ డ్రైవ్‌కు సంబంధించిన వీడియోలను యూట్యూబ్‌లో పెట్టారు.

ఆయన బెర్లిన్, హనోవర్ మధ్య బుగటి చిరోన్‌లో ప్రయాణించారని భావిస్తున్నారు. దాంతో అందరి దృష్టి ఈ ఘటనపై పడింది.

ఈ వీడియోలో కారు స్పీడోమీటర్ గంటకు 417 కిలోమీటర్ల వరకు చూపించింది.

'రోడ్డంతా బాగా కనిపిస్తోంది. భద్రత కూడా ముఖ్యమే. డ్రైవ్‌కు వెళ్లడానికి పరిస్థితులు అనుకూలంగా ఉండాలి' అంటూ వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో రాడిమ్‌ రాసుకొచ్చారు.

ఆదివారం ఉదయం 4.50 నిమిషాలకు ఈ డ్రైవ్ చేశానని ఆయన తెలిపారు.

వీడియో క్యాప్షన్, టాయ్‌లెట్‌కి వెళ్లి మూత్రం పోస్తున్న ఆవులు..

జర్మనీ మీడియాలో ఈ వార్త ప్రముఖంగా రావడంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

డ్రైవర్ కారులో ఒంటరిగా ఉన్నప్పుడు అనుచితమైన వేగంతో, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే అది నేరమేనని జర్మనీ క్రిమినల్ కోడ్ చెబుతోందని స్థానిక మీడియా పేర్కొంది.

డ్రైవర్ వైఖరిని రవాణా శాఖా మంత్రి వోకర్ విస్సింగ్ ఖండించారు.

'జర్మనీలో స్పీడ్ లిమిట్ లేకున్నప్పటికీ.. కారు డ్రైవర్ నియంత్రణలో ఉండాలి' అని ఆయన చెప్పినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ పేర్కొంది.

ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)