చరిత్రలో మొట్టమొదటి రివెంజ్ పోర్న్ కేసు.. భార్య నగ్న చిత్రాలు బయటపెట్టిన భర్త.. స్కాట్లాండ్ రాజ కుటుంబంలో ఏం జరిగింది?

ఎ వెరీ బ్రిటిష్ స్కాండల్స్ దృశ్యం

ఫొటో సోర్స్, BBC / BLUEPRINT PRODUCTIONS

ఫొటో క్యాప్షన్, ఎ వెరీ బ్రిటిష్ స్కాండల్‌లో క్లైర్ ఫోయ్
    • రచయిత, సారా గ్రిస్ట్‌వుడ్, చరిత్రకారిణి
    • హోదా, బీబీసీ హిస్టరీ ఎక్స్‌ట్రా కోసం..

బీబీసీ డ్రామా 'ఎ వెరీ బ్రిటిష్ స్కాండల్ వీక్షకులను 1960లలో పత్రికల్లో ఒక మహిళ ప్రతిష్ఠను దిగజార్చడాన్ని చూపించాలనుకున్న ఒక జిత్తులమారి సమాజంలోకి, విడాకుల పోరాటంలోకి తీసుకెళ్తుంది.

క్లైర్ ఫోయ్ ఈ తాజా డ్రామాలో చెడు నడవడిక ముద్ర పడిన మహిళగా, ఇప్పుడు రివెంజ్ పోర్న్‌గా చెప్పుకుంటున్న దానికి బాధితురాలుగా నటించారు.

తల లేని మనిషిగా చెబుతున్న ఒక వ్యక్తితోపాటూ ఈ డ్రామాకు కేంద్ర బిందువైన అసలు పాత్రలను, దేశం మారుతున్న తీరును ఎలా ప్రతిబింబిస్తుందో ఈ సిరీస్ చూపిస్తుంది.

డచెస్ ఆఫ్ అర్గైల్, అందమైన యువతి మార్గరెట్ కాంప్‌బెల్, యవ్వనంలోకి అడుగుపెట్టిన తన తొలి నాళ్ల నుంచే ఒక సెలబ్రిటీగా, కుంభకోణానికి ఒక ఆధారంగా మారిపోయారు.

కానీ, ఆమెకు మాత్రం ఈ శతాబ్దపు విడాకులుగా పిలుచుకున్న ఒకే ఒక్క ఘటన మాత్రమే గుర్తుంది. 1963లో డ్యూక్ ఆఫ్ అర్గైల్‌తో జరిగిన వివాహ బంధానికి ఆమె తెరదించారు.

ఆమె భర్త బలవంతంగా చేజిక్కించుకున్న పోలరాయిడ్ కెమెరాలోని ఫొటోలు ఆ విడాకుల కేసుకు ఆధారాలుగా మారాయి. ఆ ఫొటోల్లో తనకు గుర్తింపుగా నిలిచిన ముత్యాల నెక్లెస్ తప్ప వేరే ఏమీ లేకుండా పూర్తి నగ్నంగా కనిపించిన ఆమెను చూసి, ఈ కేసులో తీర్పు ఇచ్చిన జడ్జి గుర్తు తెలియని వ్యక్తులతో ఆమె లైంగిక సంబంధాలు నెరపారని తీర్పు ఇచ్చేలా చేశాయి.

ఈ విడాకుల కేసు 1960లలో బ్రిటన్‌ను కుదిపేసింది. ఆ దేశంలో మారుతున్న ట్రెండ్‌కు నిదర్శనంగా నిలిచింది.

క్లైర్ ఫాయ్, పాల్ బెటనీ

ఫొటో సోర్స్, BBC / BLUEPRINT PRODUCTIONS

ఫొటో క్యాప్షన్, క్లైర్ ఫోయ్, పాల్ బెటనీ

క్లైర్ ఫోయ్, మార్వెల్ సినిమాల్లో విజన్ పాల్ బెట్టనీ.. డచెస్, డ్యూక్ ఆఫ్ అర్గైల్స్‌ పాత్రల్లో నటించిన మినీ సిరీస్ 'ఎ వెరీ బ్రిటిష్ స్కాండల్' ఆ వైఖరిని ఇక మారుస్తుందని ఆశిస్తున్నారు.

ఒక స్కాటిష్ కోటీశ్వరుడి కూతురైన మార్గరెట్ విఘామ్ ఎక్కువగా న్యూయార్కులోనే పెరుగుతారు. ఆమె ప్రివిలేజ్ ఉండే ఒక వాతావరణంలో పెరిగినప్పటికీ, అభద్రతా భావం ఆమెను వెంటాడుతూనే ఉంటుంది.

అందుకే 19 ఏళ్లు వచ్చేసరికే ఆమె నలుగురు పురుషులకు తన జీవితంలో చోటిస్తుంది.

ప్రిన్స్ అలీఖాన్‌. ఎర్ల్ ఆఫ్ వార్విక్‌, ఒక పత్రికాధిపతి కొడుకుతో తిరిగిన తర్వాత ఆమె చివరికి కోటీశ్వరుడు, క్రీడాకారుడు గ్లెన్ కిడ్‌స్టన్‌ను పెళ్లాడారు.

తన జీవిత చరిత్ర రాసిన రచయితలకు ఆమె చెప్పిన వివరాల ప్రకారం డేవిడ్ నివెన్ అనే యువకుడి వల్ల గర్భవతి కూడా అవడంతో ఆమె చట్టప్రకారం గర్భస్రావం కూడా చేయించుకుంటారు.

తర్వాత 1933లో తనకు 20 ఏళ్ల వయసులో అమెరికాకు చెందిన వ్యాపారవేత్త చార్ల్స్ స్వీనీని పెళ్లాడతారు.

ఆ సమయంలో ఆమె వెడ్డింగ్ డ్రెస్ చూడ్డానికి జనం ఎంత ఎగబడ్డారంటే, జనం వల్ల నైట్స్‌బ్రిడ్జ్‌లో మూడు గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయిందని చెబుతారు.

క్లైర్ ఫోయ్

ఫొటో సోర్స్, BBC / BLUEPRINT PRODUCTIONS

ఒకప్పుడు అంత వెలుగు వెలిగిన ఆమెకు 13 ఏళ్లకే ఇద్దరు పిల్లలు పుట్టారు. అప్పటికి ఆమె 8 సార్లు గర్భస్రావాలు చేయించుకున్నారు. ఈ జంట 1947లో విడాకులు తీసుకుంది.

వారిద్దరూ విడాకులు తీసుకుని విడిపోవడం అనేది తర్వాత విడాకులతో పోలిస్తే చాలా ప్రశాంతంగా, స్నేహపూర్వకంగా జరిగింది..

నాలుగేళ్ల తర్వాత 11వ డ్యూక్ ఆఫ్ అర్గైల్‌తో జరిగిన మార్గరెట్ వివాహం మొదటి నుంచీ ఆమెకు కష్టాలు తెచ్చిపెట్టింది.

డ్యూక్ ఆఫ్ అర్గైల్ ఇయాన్ క్యాంప్‌బెల్ తన వంశానికి పెద్దగా, స్కాట్‌లాండ్ రాయల్ కుటుంబానికి వారసుడుగా ఉండేవారు.

కానీ, యుద్ధ సమయంలో జరిగిన ఘటనలను ఇంకా మర్చిపోలేకుండా ఉన్నారు. జర్మనీలో యుద్ధఖైదీగా గడిపిన అనుభవాలు పదే పదే గుర్తొస్తుండండతో మద్యానికి, జూదానికి బానిసయ్యారు.

మార్గరెట్‌కు ముందు ఇయాన్‌ను పెళ్లాడిన ఇద్దరు భార్యలు ఆయన పెట్టే శారీరక హింస, ఆయన క్రూరత్వం, ఇన్వెరరీ కాజిల్‌లో వారసత్వంగా వస్తున్న సింహాసనాన్ని కాపాడుకోవడానికి తమ డబ్బును ఉపయోగించుకోవాలనే ఆయన ప్రవర్తన గురించి చెప్పారు.

డ్యూక్ ఆఫ్ అర్గైల్‌కు అంతకు ముందు వివాహం ద్వారా పుట్టిన కూతురిని పెళ్లాడిన రచయిత నార్మన్ మెయిలర్ ఇయాన్ క్యాంపెబెల్‌ గురించి "ఆయన లాంటి క్రూరమైన, అంత రోత పుట్టించే మనుషులను నేను ఎప్పుడూ చూళ్లేదు" అని రాశారు.

డ్యూక్, డచెస్ ఆఫ్ అర్గైల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డ్యూక్, డచెస్ ఆఫ్ అర్గైల్

అర్గైల్ డ్యూక్, డచెస్ ఎందుకు విడాకులు తీసుకున్నారు

దాదాపు ఐదేళ్ల పాటు దూరంగా ఉండి ఒకరిమీద ఒకరు కేసులు పెట్టుకున్న డచెస్, డ్యూక్ ఆఫ్ అర్గైల్స్ న్యాయ పోరాటానికి 1963 విడాకుల కేసు పరాకాష్టగా నిలిచింది.

సుదీర్ఘంగా సాగిన ఈ విడాకుల ప్రక్రియలో డ్యూక్‌కు ముందు వివాహం ద్వారా పుట్టిన పిల్లలు అర్గైల్‌కు చట్టప్రకారం వారసులు కారు అనడానికి మార్గరెట్ నకిలీ పత్రాలను సాక్ష్యాలుగా చూపించారు. డ్యూక్ తన సొంత సవతితల్లికే ద్రోహం చేశారని ఆరోపించారు.

దీనికి బదులుగా డ్యూక్ ఆమెను ఇన్వెరారే కాజిల్‌కు దూరం పెట్టడానికి కోర్టు ఉత్తర్వులు తీసుకొచ్చారు. ఆమె దగ్గరున్న ప్రైవేటు పేపర్ల కోసం ఆమె ఇంట్లో దోపిడీ చేయించారు. అదే సమయంలో ఆయన చేతికి ఆమెకు సంబంధించిన పోలరాయిడ్ ఫొటోలు కూడా చిక్కాయి.

స్పష్టంగా ఉన్న ఆ ఫొటోల్లో ఒక మహిళ కనిపిస్తోంది. ఆమె ప్రత్యేకమైన మూడు వరుసల ముత్యాల నెక్లెస్‌ కూడా కనిపిస్తోంది. ఆ ఫొటోల్లో ఉన్నది మార్గరెట్ అనే విషయం కూడా ఆ నెక్లెస్ ద్వారానే తెలుస్తోంది.

ఆమె ఆ ఫొటోల్లో ఒక పురుషుడితో కలిసి ఉన్నారు. డ్యూక్ ఆ ఫొటోలను విడాకుల కేసులో ఆధారాలుగా కోర్టులో ప్రవేశపెట్టినపుడు, ప్రజలందరి ఆసక్తి ఆ ఫొటోలో ఉన్న పురుషుడు ఎవరా అనేదానిపైకి వెళ్లింది. ఎందుకంటే, ఆ ఫొటోల్లో ఆ పురుషుడి తల కనిపించడం లేదు. తర్వాత మార్గరెట్ కూడా అతడు ఎవరనే విషయం ఎప్పుడూ బయటపెట్టలేదు.

వీడియో క్యాప్షన్, ఆఫ్రికా చరిత్ర: పుస్తకాల్లో కనిపించని శక్తిమంతమైన మహారాణి

తల లేని ఆ పురుషుడు ఎవరు

మార్గరెట్ ప్రియుల జాబితాలో విన్‌స్టన్ చర్చిల్ అల్లుడు, రక్షణ మంత్రి అయిన డంకన్ శాండిస్, జర్మనీ దౌత్యవేత్త సిగిస్మండ్ వాన్ బ్రావన్, మరో ఇద్దరు సంపన్న అమెరికా వ్యాపారవేత్తలు, హాలీవుడ్ స్టార్ డగ్లస్ ఫెయిర్‌బాంక్స్ జూనియర్ లాంటి వారు ఉండేవారు.

ఈ విడాకుల కేసు నడుస్తున్న సమయంలో ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి మార్గరెట్‌కు తెలిసిన 88 మందిలో ఎవరో ఒకరిది కావచ్చని అనుమానించారు.

ఆ ఫొటోలను బట్టి జడ్జి ఆమెను "సాధారణ సంబంధాలతో సంతృప్తి పొందలేకపోయిన విపరీతమైన లైంగిక వాంఛలున్న ఒక మహిళ"గా వర్ణించారు.

విచారణ సమయంలో మార్గరెట్ 20 ఏళ్ల క్రితం ఒక లిఫ్ట్ గుంటలో పడిపోవడం వల్ల అప్పట్లో నింఫోమానియాగా వర్ణిస్తున్న సమస్యకు ఆమె గురయ్యారని కూడా చెప్పారు.

మరో వైపు, బ్రిటన్‌లో స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధంగా ఉన్న ఆ సమయంలో ఆమెతో గడిపిన పురుషుల్లో స్వలింగ సంపర్కులు చాలా మంది ఉండేవారని, అది చెబితే వారు ప్రమాదంలో పడతారనే ఆమె వారి పేర్లు బయటపెట్టలేదని కూడా చెబుతారు.

ఒక చిత్రం ప్రీమియర్ షోలో డచెస్ ఆఫ్ అర్గైల్ మార్గరెట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒక చిత్రం ప్రీమియర్ షోలో డచెస్ ఆఫ్ అర్గైల్ మార్గరెట్

ఏడాది పాటు కుంభకోణం

1963 మొదట్లో ఒకటి కాదు, రెండు కాదు మూడు అసాధారణ కుంభకోణాల బ్రేకింగ్స్ కనిపిస్తూ వచ్చాయి. మాస్కోలోని బ్రిటిష్ ఏంబసీలో పనిచేస్తున్న ప్రభుత్వ క్లర్క్ జాన్ వసాల్ అదే సమయంలో 'హనీ ట్రాప్‌' ఆపరేషన్లో చిక్కుకున్నారు.

నగ్నంగా ఉన్న మరో ముగ్గురు పురుషులతో కలిసి ఆయన బెడ్ మీద ఉన్నప్పుడు ఫొటో తీశారు. తర్వాత వసాల్‌ను కేజీబీ (రష్యా గూఢచార సంస్థ) బ్లాక్‌మెయిల్‌ చేసింది.

ఇంగ్లండ్ వచ్చాక వివిధ నిఘా కార్యాలయాల్లో పనిచేసిన ఆయన అరెస్ట్ అయ్యేవరకూ కేజీబీకి కీలక పత్రాలు లీక్ చేయడం కొనసాగించారు. 1962లో ట్రయల్ కోర్టు ఆయన కేసులో తీర్పు ఇచ్చింది.

అర్గైల్ విడాకుల యుద్ధం క్లైమాక్స్‌కు చేరుకున్న సమయంలో ప్రొఫుమో అఫైర్ ఘటన కూడా బయటపడింది.

1961 వేసవిలో బ్రిటన్ మంత్రి జాన్ ప్రొఫుమో క్లివేడన్‌లోని ఒక స్విమ్మింగ్ పూల్లో క్రిస్టీన్ కీలెర్‌ అనే మహిళను కలిశారు.

కీలర్ ప్రేమికుల్లో అప్పటికే యూజీన్ ఇవనోవ్ అనే రష్యా నేవీ అధికారి, గూఢచారి కూడా ఉన్నారు. తర్వాత ప్రొఫుమో, కీలర్ సన్నిహితంగా ఉన్న దృశ్యాలు బయటకు వచ్చాయి.

బ్రిటిష్ మంత్రి ముందు తలుపు నుంచి లోపలికి వస్తుంటే, రష్యా ఏజెంట్ వెనక తలుపు నుంచి వెళ్లిపోయే దృశ్యాలు కూడా కనిపించాయి.

వీడియో క్యాప్షన్, బ్రిటన్: పద్నాలుగేళ్ల పాటు ఆహారంపై రేషన్

ఏడాది తర్వాత 1962లో కీలర్ ఇద్దరు ప్రియుల మధ్య జరిగిన గొడవ చివరకు ఆమెను పోలీసులు, ప్రజల దృష్టిలో పడేలా చేసింది.

ఆ సమయంలో హెరాల్డ్ మెక్‌మిలన్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే ఏ వార్తకైనా ప్రెస్ ఆసక్తి చూపించేది.

అదే ఫిబ్రవరిలో వాసల్ వ్యవహారంలో సోర్సులు ఎవరో చెప్పడానికి నిరాకరించిన ఇద్దరు జర్నలిస్టులను జైల్లో కూడా పెట్టారు.

అర్గైల్ విడాకుల కేసు దాదాపు చివరి దశకు వచ్చిన సమయంలో ప్రొఫుమో తన సభ్యత్వానికి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయనపై విచారణకు కూడా ఆదేశించారు.

తర్వాత ప్రెస్ డచెస్‌ను, తలలేని ఆమె ప్రియుడుగా భావించే పురుషులను రహస్యంగా ఇంటర్వ్యూలు కూడా చేశారు.

మార్గరెట్‌కు పరిచయం ఉన్న పురుషుల్లో డంకన్ శాండిస్ ప్రముఖుడు కావడంతో అతడి వల్ల ఆమెకు భద్రతాపరంగా ఏదైనా ప్రమాదం వస్తుందని అందరూ భావించారు.

వీడియో క్యాప్షన్, పోర్నోగ్రఫీ సమస్యకు పోలీసుల షాక్ థెరపీ

మార్గరెట్ కాంప్‌బెల్ విడాకుల తర్వాత ఏం జరిగింది

విడాకుల కేసుతో మొదలైన కుంభకోణం తర్వాత తన జీవితంపై పడిన మచ్చ నుంచి మార్గరెట్ ఎప్పటికీ తేరుకోలేకపోయారు.

డ్యూక్ ఆఫ్ అర్గైల్‌కు దూరంగా రెండు దశాబ్దాలు జీవించిన మార్గరెట్ 1993లో చనిపోయినప్పటికీ ఆమె తన చివరిసమయంలో సంతోషంగా లేరు.

విడాకుల కేసులో 50 వేల పదాలతో జడ్జి లార్డ్ వీల్టీ ఇచ్చిన తీర్పు ఆమెను పూర్తిగా ఒక వ్యభిచారిణిగా వర్ణించింది.

కానీ, ఈ కేసును పబ్లిక్ గ్యాలరీ నుంచి చూసిన మహిళలు ఆమెకు తమ మద్దతు తెలుపుతూ లేఖలు కూడా రాశారు.

"మార్గరెట్ ఒక మహిళ కాబట్టే, వెనకడుగు వేయడానికి నిరాకరించారు కాబట్టే, ఒక మంచి అమ్మాయిలా నిశ్శబ్దంగా ఉన్నారు కాబట్టే ఆ శిక్షను ఎదుర్కున్నారు" అని తాజా టీవీ సిరీస్ రచయిత సారా ఫెల్ప్స్ వర్ణించారు.

ఇప్పటి దృష్టితో చూస్తే, ఆ సమయంలో డచెస్‌ ఆఫ్ అర్గైల్‌ను ఒక వేశ్య అంటూ అవమానించారు. ఆమెను గృహ హింసకు గురిచేశారు. ఆమె వ్యక్తిగత సంభాషణలను హ్యాక్ చేశారు.

గత అర్థ శతాబ్దంగా ఆమెను ఎవరు ఎలా చూసినప్పటికీ, 'ఎ వెరీ బ్రిటిష్ స్కాండిల్‌' బహుశా ఇప్పుడు డచెస్ ఆఫ్ అర్గైల్‌ మార్గరెట్ కాంప్‌బెల్‌ను ఈనాటి కథానాయికగా చూపించవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)