టీ-20 వరల్డ్ కప్ #INDvsPAK: ‘భారత్‌తో మ్యాచ్‌ పాకిస్తాన్ గెలిస్తే, ఇన్షా అల్లా..’ - పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ రమీజ్ రాజా

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

దుబాయ్‌లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య అక్టోబర్ 24 (ఆదివారం)న జరగబోయే టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్‌కు సంబంధించి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ "మా దృష్టిలో ఇతర మ్యాచ్‌ల మాదిరిగానే, ఇది కూడా ఒకటి" అని వ్యాఖ్యానించారు.

భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కి సంబంధించి కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలను మిగతా వారితో పోల్చితే కాస్త అసాధారణంగా పరిగణించవచ్చు.

సుమారు 28 నెలల తర్వాత, రెండు దేశాల జట్లు తలపడనున్నాయి. ఈ రెండు దాయాది జట్ల మధ్య జరగబోయే ఈ మ్యాచ్‌పై ఇరుదేశాల్లో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది.

ఇది "సాధారణ మ్యాచ్" కాదని పాకిస్తానీ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ రమీజ్ రాజా అన్నారు. భారత్‌పై గెలిస్తే "పాక్‌ మనోధైర్యం పెరుగుతుంది" అని ఆయన అన్నారు.

భారత్‌లో కూడా ఈ మ్యాచ్‌పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నా, చాలా రాజకీయ పార్టీలు ఈ మ్యాచ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

రమీజ్ రాజా

ఫొటో సోర్స్, Twitter/@iramizraja

రమీజ్ రాజా ఏం చెప్పారు?

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ రమీజ్ రాజా తన జట్టుకు, తన దేశానికి ఇది 'ప్రత్యేక మ్యాచ్' అని అభిప్రాయపడ్డారు.

రమీజ్ రాజా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దీన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

ఇందులో, పాకిస్తాన్ జట్టుకు మద్దతు ఇవ్వాలని అభిమానులను రమీజ్ రాజా విజ్ఞప్తి చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

"మ్యాచ్ జరగబోతోందని మీకు తెలుసు. ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్, పాకిస్తాన్ జట్టుకు అండగా నిలవాలని అభిమానులందరినీ అభ్యర్థిస్తున్నాను. మనం ఆ మ్యాచ్ గెలిస్తే, ఇన్షా అల్లా.. మొత్తం సమాజానికి చాలా మంచి సందేశం ఇచ్చినట్లు అవుతుంది" అని రమీజ్ రాజా అన్నారు.

2019 జూన్ 16న వన్డే వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య చివరి మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్తాన్‌పై గెలిచింది.

అక్టోబర్ 24న జరగాల్సిన మ్యాచ్‌పై ఎవరికి తోచిన అభిప్రాయాలను వారు వ్యక్తం చేస్తున్నారు. వీరిలో కేవలం క్రికెట్ ఆటగాళ్లు, నిర్వాహకులు, అధికారులు, క్రీడా విమర్శకులు, అభిమానులు మాత్రమే లేరు. రాజకీయాలకు సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఈ మ్యాచ్‌కు సంబంధించి తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

భారత్-పాక్ మ్యాచ్

ఫొటో సోర్స్, Reuters

మ్యాచ్‌ ఆడొద్దని డిమాండ్

భారత్‌, పాక్‌ సంబంధాలు దెబ్బతినడం, ఇటీవల జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాద తదితర ఘటనలను ఉదహరిస్తూ ఈ మ్యాచ్‌ను రద్దు చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. దీనికి మద్దతిచ్చే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ వస్తోంది.

ప్రతిపక్ష నాయకులతో పాటు, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన చాలా మంది నాయకులు కూడా పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లు ఆడకూడదని వాదిస్తున్నారు.

ఇలా జరగడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇక, దాయాది దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే రెండు జట్లు తలపడుతున్నాయి.

ఇక రెండు జట్లు ఏదైనా ఐసీసీ టోర్నీల్లో తలపడినప్పుడు, క్రీడాభిమానుల్లో హైటెన్షన్ మెుదలవుతుంది.

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

'టికెట్లకు విపరీతంగా పెరిగిన డిమాండ్'

భారత జట్టు సారథ్య బాధ్యతల నుంచి ప్రపంచ కప్ తర్వాత విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ల నుంచి తప్పుకోనున్నట్టు ప్రకటించారు. ఈ సమయంలో విరాట్ కచ్చితంగా ట్రోఫీని గెలవాలని భావిస్తారు. దీంతో పాక్‌పై ఒత్తిడి కూడా పెరుగుతోంది.

అయితే, పాకిస్తాన్‌తో జరగబోయే మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. "తాను ఎప్పుడూ దీన్ని భిన్నమైన కోణంలో చూడలేదు" అని పేర్కొన్నారు.

న్యూస్ ఏజెన్సీ పీటీఐ ప్రకారం, "నిజాయితీగా చెప్పాలంటే, నేను ఎప్పుడూ అలా భావించలేదు. క్రికెట్‌లో ఇతర మ్యాచ్‌ల మాదిరిగానే దీనిని కూడా చూస్తాను" అని కోహ్లీ చెప్పారు.

'ఇది అభిమానులకు మామూలు మ్యాచ్ కాదు' అని తనకు తెలుసునని కోహ్లీ అంగీకరించాడు. అలాంటి వారిలో తన స్నేహితులు కూడా ఉన్నారని చెప్పాడు.

"ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయని నాకు తెలుసు, టిక్కెట్లకు కూడా డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. నా స్నేహితులు కూడా టికెట్లు అడుగుతున్నారు. లేవని సమాధానం ఇస్తున్నాను"అని ఆయన వివరించారు.

బాబర్ అజామ్

ఫొటో సోర్స్, Getty Images

పైచేయి ఎవరిది

పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ కూడా మ్యాచ్ గెలవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. పీసీబీ చీఫ్‌లాగే, తన జట్టు విజయం సాధించాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు.

పాకిస్తాన్ మీడియా, అభిమానులు తరచుగా బాబర్ అజమ్‌ను భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోలుస్తుంటారు.

ర్యాంకింగ్స్, రికార్డుల గణాంకాల్లో భారతదేశం మెరుగైన స్థితిలో ఉంది. టీ- 20 ర్యాంకింగ్‌లో భారతదేశం రెండవ స్థానంలో ఉండగా, పాకిస్తాన్ మూడో స్థానంలో ఉంది.

రికార్డుల విషయానికొస్తే టీ-20ల్లో ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరింటిలో భారత్ విజయం సాధించింది.

సౌరవ్, జై షాలను కలవడాన్ని ప్రస్తావించిన రమీజ్ రాజా

రమీజ్ రాజా విడుదల చేసిన ప్రకటనలో, ఆయన బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ, బోర్డు కార్యదర్శి జయ్ షాలతో జరిగిన సమావేశాన్ని కూడా ప్రస్తావించారు.

రమీజ్ రాజా మాట్లాడుతూ.. "నేను సౌరవ్ గంగూలీని కలిశానా అనే చర్చ జరుగుతుంది. అవును నేను గంగూలీని కలిశాను. జై షాను కూడా కలిశాను"

"చూడండి, మనం ఒక క్రికెట్ బంధాన్ని ఏర్పరచుకోవాలి. నేను క్రికెట్ కంటే రాజకీయాలు ఉత్తమమని ఎప్పుడూ భావించను."

క్రికెట్‌ను రాజకీయాలకు దూరంగా చూడాలని రమీజ్ రాజా మాట్లాడినా, అలా చేయడం అంత సులభం కాదు.

ఇతర స్పోర్ట్స్‌తో పోలిస్తే, రెండు దేశాలలో క్రికెట్ చాలా ప్రజాదరణ పొందింది. క్రికెట్‌తో ఇక్కడి ప్రజల భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయి.

భారతదేశం, పాకిస్తాన్‌లో క్రికెట్, రాజకీయాలను వేరుగా ఉంచే ప్రయత్నాలు తరచుగా విజయవంతం కాకపోవడానికి ఇదే కారణం అని నిపుణుల అభిప్రాయపడుతున్నారు.

పాకిస్తాన్‌ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం ఆ దేశ ప్రధానిగా ఉన్నారు. ఇదే సమయంలో, ప్రస్తుత బీసీసీఐ కార్యదర్శి జయ్ షా తండ్రి, అమిత్ షా హోం మంత్రిగా ఉన్నారు. ఆదివారం పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు సంబంధించి జయ్ షాపై అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు.

సుబ్రమణ్యస్వామి

దేశ గౌరవాన్ని కాపాడండి : సుబ్రమణ్యస్వామి

సోమవారం రమీజ్ రాజా వీడియోను పీసీబీ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన రెండు గంటల తర్వాత బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేశారు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

"టెర్రర్ సేల్స్‌మ్యాన్ పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్‌కి ఎందుకీ హడావుడి? బీసీసీఐకి చెందిన జై షాకి తన తండ్రి హోం మినిస్టర్‌గా ఏమి చెబుతున్నారో తెలుసా? బెట్టింగ్ ద్వారా డబ్బు సంపాదించే దుబాయ్ డాన్లకి మాత్రమే క్రికెట్ ఆడటం ముఖ్యం. ఈ క్రికెట్‌ మ్యాచ్‌ను రద్దు చేయండి, దేశం గౌరవాన్ని కాపాడండి"అని సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఈ తరహా డిమాండ్‌లు కేవలం సుబ్రహ్మణ్యం స్వామి మాత్రమే లేవనెత్తలేదు.

వ్యాపారవేత్త, రచయిత సుహైల్ సేథ్ కూడా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ గురించి అనేక ప్రశ్నలు సంధించారు.

"కశ్మీర్‌లోని అమాయక భారతీయులపై సరిహద్దు దాటి నిరంతరం దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో పాకిస్తాన్- ఇండియా మధ్య మ్యాచ్ జరగడం అవసరమా? లేదా మనం పాకిస్తాన్‌కి చెందిన ఏ ఏ యాప్‌లపై నిషేధం విధించవచ్చో చూద్దామా? క్రికెట్ విషయానికి వస్తే, ఈ వ్యాపారం దేశానికి ప్రాధాన్యతనిస్తుందా?" అని సుహైల్ సేథ్ పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తార్కిషోర్ ప్రసాద్ కూడా పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్‌పై పలు ప్రశ్నలు సంధించారు. కశ్మీర్ లోయలో స్థానికేతరులైన బిహార్‌వాసులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయి. దీంతో బిహార్‌ నాయకులు ఈ మ్యాచ్ గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

మరోవైపు, ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడొద్దని డిమాండ్ చేశాయి.

అయితే, "ఐసీసీతో ఉన్న ఒప్పందం మేరకు మీరు ఏ జట్టుతోనూ ఆడటానికి నిరాకరించలేరు. ఐసీసీ టోర్నమెంట్‌లలో ఆడాల్సిందే" అని కాంగ్రెస్ నాయకుడు, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు.

దశాబ్దాలుగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లు తీవ్ర ఉద్రిక్తతలు, ఒత్తిడితో కూడుకున్నవిగా ఉంటున్నాయి. ప్రస్తుత ఆటగాళ్లు బహిరంగంగా ఏమీ చెప్పకపోవచ్చు, కానీ చాలా మంది మాజీ ఆటగాళ్లు భారత్‌, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ సాధారణ మ్యాచ్‌లాంటిది కాదని ప్రకటనలు చేస్తున్నారు.

సచిన్ తెందూల్కర్

ఫొటో సోర్స్, Getty Images

నిద్రలేని రాత్రులు గడిపిన సచిన్‌

చాలా సార్లు, ఒత్తిడి కారణంగా, ఆటగాళ్లు నిద్రకు దూరమవుతుంటారు.

దిగ్గజ ఆటగాడు సచిన్ తెందూల్కర్ తన ఆత్మకథ "ప్లేయింగ్ ఇట్ మై వే"లో కూడా ఈ విషయాన్ని పేర్కొన్నారు.

సచిన్ తెందూల్కర్, 2003లో దక్షిణాఫ్రికాలో పాకిస్తాన్‌తో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ గురించి ప్రస్తావిస్తూ, "ఈ మ్యాచ్‌ రెండు జట్లకు అత్యంత కీలక మ్యాచ్ అవుతుంది. తీవ్రస్థాయిలో భావోద్వేగాలు ఉండటంతో మ్యాచ్‌కు ముందు మూడు రాత్రులు సరిగా నిద్ర పట్టలేదు"అని ఆయన పేర్కొన్నారు.

భారతదేశం, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లలో అది ఒక అత్యుత్తమ వన్డే మ్యాచ్‌. ఆ మ్యాచ్‌లో సచిన్ తెందూల్కర్ 75 బంతుల్లో 98 పరుగులు చేశారు. షోయబ్ అక్తర్ బంతిపై సచిన్ అప్పర్ కట్ ద్వారా కొట్టిన సిక్స్ ఈరోజు కూడా గుర్తుండిపోతుంది.

"(అప్పుడు) జట్టు వరల్ట్‌ కప్‌లో వైఫల్యాన్ని భారత దేశం తట్టుకోలేకపోయింది. అయినా పాక్‌-భారత్‌ మ్యాచ్‌, మా అభిమానులలో చాలామందికి నిజమైన ఫైనల్. సెంచూరియన్‌లో పాకిస్తాన్‌ను ఓడిస్తే, మిగిలిన టోర్నమెంట్‌లో ఏం జరిగినా వారు పట్టించుకోరు" అని సచిన్‌ పేర్కొన్నారు.

మహేంద్ర సింగ్ ధోనీ

ఫొటో సోర్స్, Getty Images

ఆ మ్యాచ్ జరిగి 18 సంవత్సరాలు గడిచాయి. అయినా 'గెలవాలనే పట్టుదల' ఇరుదేశాల్లో చెక్కుచెదరకుండా ఉంది.

చాలా సంవత్సరాలుగా సచిన్ తెందూల్కర్‌తో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్న స్పిన్నర్ హర్భజన్ సింగ్ వీడియో ఇటీవల వైరల్ అయింది.

పాకిస్తాన్ జట్టు భారత్‌తో టీ 20 మ్యాచ్‌లు ఆడి, నిరాశతో వెనుతిరుగుతుందంటూ హర్భజన్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

"నేను షోయబ్ అక్తర్‌కి కూడా చెప్పాను. ఈసారి ఆడటం వల్ల ఉపయోగం ఏముంది? మీరు మాతో వాకోవర్‌(ఆడకుండానే ఓటమి అంగీకరించడం) చేయడం ఉత్తమం. మీరు మాతో ఆడటం, ఓడిపోవడం, నిరాశ చెందటం ఎందుకు. మా బృందం చాలా బలంగా ఉంది. మీకు అవకాశం లేదు!"అని ఆయన అన్నారు.

కానీ, ఇప్పుడు ఈ మ్యాచ్‌పై ప్రకటనలు వెలువడుతున్న సందర్భంలో మైదానంలోపలగానీ, వెలుపలగానీ వాకోవర్‌ చేయడానికి ఎవరూ సిద్ధంగా ఉన్నట్లు అనిపించడం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)