కరోనావైరస్‌తో కలిసి జీవించటం ఇలాగే ఉంటుందా? లాక్‌డౌన్ అనంతర ప్రపంచం ఎలా ఉందో చూపే ఫొటోలివీ...

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచం మొత్తం ఇప్పుడు మారిపోయింది.
ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా, ప్రతి ఒక్కరి మీదా కోవిడ్-19 మహమ్మారి ప్రభావం కనిపిస్తోంది.
కొన్ని దేశాలు తమ దగ్గర అమలు చేసిన లాక్‌డౌన్ సడలించాయి.
కరోనా తర్వాత మళ్లీ మన జీవితాలు ప్రారంభం అయ్యాక రాబోవు కాలం ఎలా ఉంటుంది?
దానిని ఇప్పుడు మనం కొన్ని ఫొటోల ద్వారా చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
తరగతి గదులు
స్కూళ్లు, నర్సరీలను మళ్లీ తెరిచిన తర్వాత అందరూ సామాజిక దూరం పాటించాల్సి ఉంటుంది.
అది ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఒక పెద్ద పరీక్షలా ఉండబోతోంది.
చాలా తరగతి గదుల్లో పిల్లలు కూర్చునే బల్లలను కూడా మార్చాల్సి ఉంటుంది.
చిన్న పిల్లలు ఉన్న కుటుంబాల్లో ఇప్పుడు వారి భద్రత గురించి ఆందోళన పెరిగింది.
ఇటలీలోని ఇవరియాలో రెండు కిండర్ గార్డెన్ స్కూళ్లను గార్డెన్ పైలెట్ టెస్ట్ కింద తెరిచారు.
లాక్‌డౌన్ తర్వాత స్కూళ్లు మళ్లీ తెరిస్తే, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చూడాలనుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పార్కులు
పార్కులో కుటుంబం అంతా కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకున్న ఆ రోజులు గుర్తున్నాయా, చుట్టూ ఉన్న జనం ఆడుతూ పాడుతూ చేసే ఆ సందడి మళ్లీ వస్తుందా.
లాక్‌డౌన్ తర్వాత ఇప్పుడు అదంతా కాస్త భిన్నంగా కనిపిస్తుంది.
ఆడుకునే చాలా ప్రాంతాలను ఇప్పటికూ మూసేసే ఉన్నారు. ఇక కచ్చితంగా సామాజిక దూరం పాటించేలా పార్కులు లాంటి ప్రాంతాలను మళ్లీ తెరుస్తున్నారు.
అమెరికా బ్రూక్‌లిన్‌లో ఉన్న డోమినో పార్కులో నిర్వాహకులు పచ్చికపై సర్కిల్స్ వేశారు.
ఈ పార్కుకు వచ్చేవారు ఆ సర్కిళ్లలోనే ఉండి పిక్నిక్ ఆస్వాదించాలి. అలా దూరదూరంగా ఉంటూ సన్‌బాత్ చేయాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఉద్యోగాలు
లాక్‌డౌన్ సమయంలో చాలా మంది ఇళ్ల నుంచే పని చేస్తున్నారు. తమ సహోద్యోగులతో వీడియో కాల్ ద్వారా సంభాషిస్తున్నారు.
కానీ ఆఫీసులు మళ్లీ మొదలైతే, వాటిని కూడా ఇలాగే మార్చేయాల్సి ఉంటుంది.
దక్షిణాఫ్రికా జొహెన్నెస్‌బర్గ్ లో ఉద్యోగులకు ప్లాస్టిక్ క్యూబికల్స్ ఏర్పాటు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
షాపింగ్
షాపుల్లో మనం కొనుగోళ్లు జరిపే పద్ధతులు కూడా మారిపోతున్నాయి. ఆన్‌లైన్ కొనుగోళ్లు పెరుగుతున్నాయి.
సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల కోసం జనం సామాజిక దూరం పాటిస్తూ వరుసల్లో దూరదూరంగా నిలబడాల్సి వస్తోంది.
నెదర్లాండ్స్ రోటర్డామ్‌లో ఒక టైలర్ తనకు కరోనావైరస్ రాకుండా ప్లెక్సిగ్లాస్ ఉపయోగిస్తున్నాడు.
దానికి ఉన్న ప్లాస్టిక్ రంధ్రాల్లోంచి చేతులు పెట్టి సూట్ కుట్టించుకోడానికి వచ్చిన కస్టమర్ కొలతలు తీసుకుంటున్నాడు.

ఫొటో సోర్స్, EPA
హోటల్ భోజనం
మనం మళ్లీ మన ఇంట్లో వాళ్లతో కలిసి రెస్టారెంటుకు వెళ్లి భోజనం రుచిచూడగలమా
థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో సామాజిక దూరం అమలు చేయడానికి కార్డుబోర్డ్, ప్లాస్టిక్ షీట్లతో టేబుల్ మీద సెక్షన్స్ చేశారు. జనం వాటి లోపలే భోంచేస్తున్నారు.
సోషల్ డిస్టెన్సింగ్ నియమాలను అమలు చేయడానికి చాల రెస్టారెంట్లు ఇప్పుడు టేబుల్స్ మీద ఇలాగే చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
సంగీత విభావరులు
కరోనా వల్ల జీవితం దారుణంగా ఉన్నంత మాత్రాన మనం మన అభిరుచులు వదులుకోవాలనేం లేదు. అంటే సంగీతం, డ్యాన్స్ లాంటివి దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు.
అంటే ఇక రాబోవు రోజుల్లో జరిగే కాన్సెర్టులు భిన్నంగా ఉండబోతున్నాయి. అవి సరిగ్గా దక్షిణాఫ్రికా గొయాంగ్‌లో జరిగిన కార్యక్రమంలాగే ఉంటాయి.
ఇక్కడ కె-పాప్, ఇండీ, క్లాసికల్ సహా మూడు రోజుల మ్యూజిక్ కాన్సెర్ట్ జరిగింది. అది చాలా పాపులర్ అయ్యింది. వచ్చిన ప్రేక్షకులు తమ కార్లలోనే కూర్చుని దానిని ఆస్వాదించారు. సామాజిక దూరం కూడా పాటించారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ లక్షణాలు: ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- ‘కరోనావైరస్ టీకా పరీక్షల్లో ఉంది.. ఇప్పుడే ఉత్పత్తి ప్రారంభిస్తున్నాం’ - బ్రిటన్ సంస్థ వెల్లడి, భారత్‌లోనూ తయారీ
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారు చేసే అవకాశాన్ని ప్రపంచం ఎలా చేజార్చుకుంది?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- పాకిస్తాన్లో పేషెంట్లకు డాక్టర్లు విషమిచ్చి చంపుతున్నారా? వైద్యుల మీద జనం ఎందుకు దాడులు చేస్తున్నారు?
- చనిపోయారని మృతదేహం అప్పగించారు... ఆ తర్వాత కోలుకున్నారు వచ్చి తీసుకెళ్లండని ఫోన్ చేశారు...
- మీరా చోప్రాపై ట్రోలింగ్‌కు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు? ఈ కేసులో ఇప్పుడు ఏం జరుగనుంది?
- స్ట్రాబెర్రీ మూన్: ఈరోజు, రేపు చంద్ర గ్రహణం - భారతదేశంలో కనిపించే సమయాలివీ...
- పారిపోయి పెళ్లి చేసుకున్న జంటకు రూ.10 వేల జరిమానా విధించిన కోర్టు.. కరోనా కాలంలో మాస్కు ధరించనందుకు..
- టిఫానీ ట్రంప్: అమెరికాలో జరుగుతున్న నిరసనలకు ట్రంప్ కుమార్తె మద్దతు
- కరోనావైరస్: 36 రోజులు వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడి, బతికి బయటపడిన వ్యక్తి ఇతను
- జార్జ్ ఫ్లాయిడ్ ఎవరు? అనేక సార్లు అరెస్టయిన ఫ్లాయిడ్ కోసం అమెరికా ఎందుకు రగులుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








