దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2020: పోలింగ్ తేదీ ఫిబ్రవరి 8.. ఓట్ల లెక్కింపు 11వ తేదీన.. ఎన్నికల సంఘం కొత్త కాన్సెప్ట్.. పోలింగ్ కేంద్రానికి రాలేని దివ్యాంగులు, వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ఫిబ్రవరి 8వ తేదీన జరుగనుంది. ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 11వ తేదీన జరుగుతుంది.
భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను ప్రకటించారు.
ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 14వ తేదీన విడుదల అవుతుంది.
నామినేషన్లు వేసేందుకు జనవరి 21 చివరి తేదీ.
దిల్లీలో మొత్తం ఓటర్లు - 1,46,92,136
పోలింగ్ కేంద్రాలు - 13750
అసెంబ్లీ నియోజకవర్గాలు - 70
2015 ఎన్నికల ఫలితాలు - ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 67 నియోజకవర్గాల్లో, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 3 స్థానాల్లో గెలిచాయి. కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం కూడా లభించలేదు.
దిల్లీలో ఎన్నికల కోడ్ తక్షణం అమల్లోకి వచ్చింది.
ఎన్నికల సంఘ కొత్త కాన్సెప్ట్..
ఈ ఎన్నికల్లో భారత ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని ప్రవేశపెడుతోందని సునీల్ అరోరా చెప్పారు.
శారీరకపరమైన ఇబ్బందులు, తప్పనిసరి పరిస్థితుల వల్ల పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఎన్నికల్లో పాల్గొనలేని ఓటర్ల కోసం గైర్హాజరీ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని తెలిపారు.
దివ్యాంగులు, 80 ఏళ్లు దాటిన పెద్దవారు కావాలంటే పోస్టల్ బ్యాలెట్ విధానంలో కూడా ఓటు హక్కును ఉపయోగించుకోవచ్చునని వివరించారు.
ఇవి కూడా చదవండి:
- ఈ 23 ఏళ్ల ఎంపీ సగం జీతం చాలంటున్నారెందుకు?
- ఇదోరకం మోసం.. కొన్ని సెకన్ల ముందు సమాచారం తెలుసుకుని కోట్లు కొల్లగొడుతున్నారు
- JNU: క్యాంపస్ హింసకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు
- నుదిటిపై గాటు సీరియల్ కిల్లర్‌ను పట్టిచ్చింది
- అత్యాచారం కేసులో జర్నలిస్టుకు రూ. 21.5 లక్షల పరిహారం
- పాకిస్తాన్లో ప్రతి హత్యా నేరానికీ ఓ రేటు
- సులేమానీ కుమార్తె: నా తండ్రిని చంపిన అమెరికాకు 'చీకటి రోజు' తప్పదు
- ఇరాన్ అణుబాంబును ఎంత కాలంలో తయారు చేయగలదు...
- CAAకు మద్దతు కోసం బీజేపీ మిస్డ్ కాల్ ప్రచారం... అదే నంబర్‌తో నకిలీ అకౌంట్లు
- రెండో ప్రపంచ యుద్ధం నాటి ఓ అస్థిపంజరం చెప్పిన కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








