హెచ్ఐవీ.. ఎయిడ్స్: చైనాలో 14 శాతం పెరిగిన కొత్త కేసులు

ఫొటో సోర్స్, Science Photo Library
హెచ్ఐవీ/ఎయిడ్స్ ఉన్న రోగుల సంఖ్య 14 శాతం పెరిగిందని చైనా తెలిపింది.
దేశంలో మొత్తం 8.2 లక్షల మంది హెచ్ఐవీ/ఎయిడ్స్ బారిన పడిన వారున్నారని చైనా ఆరోగ్య శాఖ అధికారులు ఒక సమావేశంలో తెలిపారు. 2018 రెండో త్రైమాసికంలోనే 40 వేల కొత్త కేసులు నమోదైనట్లు వారు వెల్లడించారు.
వీటిలో ఎక్కువ శాతం కేసులో లైంగిక కార్యకలాపాల వల్లే సంక్రమించాయి. ఇది గత ధోరణికి భిన్నమైనది. చైనాలో ఇప్పటివరకు హెచ్ఐవీ/ఎయిడ్స్ ఎక్కువగా రక్త మార్పిడి వల్లే సంక్రమించేది.
అయితే ఇటీవలి కాలంలో అలాంటి కేసులు దాదాపు సున్నాకు పడిపోయాయని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
ముఖ్యంగా, ఎల్జీబీటీ వర్గాలలో లైంగిక కార్యకలాపాల కారణంగా హెచ్ఐవీ/ఎయిడ్స్ పెరుగుతున్నట్లు గుర్తించారు.
చైనాలో 1997లో హోమోసెక్సువాలిటీని నేరాల జాబితా నుంచి తొలగించినా, ఎల్జీబీటీల పట్ల సమాజంలో ఇప్పటికీ చిన్న చూపు ఉంది.
ఇతర పురుషులతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే పురుషుల్లో 70-90 శాతం తిరిగి మహిళలను వివాహం చేసుకుంటున్నారు.
ఇలాంటి సంబంధాలలో లైంగికపరంగా సరైన రక్షణ తీసుకోకపోవడంతో హెచ్ఐవీ/ఎయిడ్స్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
- ‘అమ్మాయిలను చూస్తే నాకెందుకు ఆకర్షణ కలగటం లేదు?’
- స్వలింగ సంపర్కం - సెక్షన్ 377: లైంగిక అవగాహన ఏ వయసులో వస్తుంది?
- భార్యపై అత్యాచారం చేయించిన భర్త.. స్వలింగ సంపర్కురాలైనందుకు కక్ష
- పాకిస్తాన్ 'దుర్మార్గమైన అజెండా': చర్చల రద్దుకు దారి తీసిన ఈ స్టాంపులపై ఏముంది?
- ఇండోనేసియాలో సునామీ: 380 మందికి పైగా మృతి
- బిగ్ బాస్: పోటీదారులను హౌజ్లోకి ఎలా తీసుకెళ్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు
- అభిప్రాయం: ‘శబరిమల తీర్పు’ సరే... మరి మన ఇళ్లల్లో ఆ నిషేధం పోయేదెన్నడు?
- విదేశాల్లో కరెన్సీ నోట్లను ముద్రిస్తే దేశానికి ప్రమాదమా?
- సుప్రీంకోర్టుకు నామినేట్ చేసిన బ్రెట్ కావెనాపై ఎఫ్బీఐ దర్యాప్తుకు ట్రంప్ ఆదేశం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









