స్పెయిన్‌కు డోనల్డ్ ట్రంప్ సలహా: సహారా ఎడారి సరిహద్దు వెంట ప్రహరీ కట్టండి

ఫొటో సోర్స్, AFP
యురోపియన్ వలసదారుల సంక్షోభాన్ని పరిష్కరించేందుకు గాను సహారా ఎడారికి చుట్టూ ప్రహరీ గోడ కట్టాలని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సూచించారని స్పెయిన్ విదేశాంగ శాఖ మంత్రి జోసెఫ్ బొర్రెల్ చెప్పారు.
అయితే, ట్రంప్ సలహాతో తాను విభేదించానని ఆయన తెలిపారు.
బొర్రెల్ గతంలో యురోపియన్ పార్లమెంటు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
జూన్ నెలాఖరులో అమెరికా పర్యటనకు వెళ్లిన బొర్రెల్‌తో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత వారం మాడ్రిడ్ నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న బొర్రెల్.. తన అమెరికా పర్యటన సందర్భంగా ట్రంప్‌తో జరిగిన చర్చను ప్రస్తావించారు. ఈ విషయంపై బీబీసీ సంప్రదించగా.. స్పెయిన్ విదేశాంగ శాఖ ఖరారు చేసింది.

ఫొటో సోర్స్, Reuters
అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్ చేసిన హామీల్లో మెక్సికో సరిహద్దు వెంట అమెరికా గోడను నిర్మించటం కూడా ఒకటి.
‘‘సహారా సరిహద్దు మెక్సికో సరిహద్దు కంటే పెద్దదేమీ కాదు’’ అని ట్రంప్ అన్నారని బొర్రెల్ తెలిపారు.
అమెరికా-మెక్సికో సరిహద్దు 1954 మైళ్లు కాగా, సహారా 3 వేల మైళ్ల మేర విస్తరించి ఉంది.

ఫొటో సోర్స్, AFP/Getty Images
సహారా ఎడారిపై స్పెయిన్‌కు ఎలాంటి అధికారమూ లేదు. కాకపోతే ఉత్తర ఆఫ్రికా తీరంలో సహారా ఎడారి సరిహద్దు అయిన సటా, మెలిల్లా ప్రాంతాల్లో మాత్రం మొరాకోతో సరిహద్దును పంచుకుంటోంది.
ఇక్కడే వివాదాస్పదమైన ఫెన్సింగ్ (కంచె) కూడా ఉంది.
యూరప్‌లో మెరుగైన జీవితాన్ని ఆశించే ఆఫ్రికా వలసదారులను సటా, మెలిల్లా ప్రాంతాలు ఆకర్షిస్తున్నాయి. ఇలా సరిహద్దు దాటే శరణార్థులు తరచూ హింస, అవమానాలు ఎదుర్కొంటున్నారు. తద్వారా సంఘర్షణలు తలెత్తుతున్నాయి.
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ స్పెయిన్‌కు 35 వేల మంది వలసదారులు వచ్చారు. యురోపియన్ యూనియన్‌లోని దేశాల్లో ఈ ఏడాది అత్యధిక వలసదారులు వచ్చింది స్పెయిన్‌కే కావటం గమనార్హం.
ఇవి కూడా చదవండి:
- అసలు న్యూక్లియర్ బటన్ ట్రంప్ వద్దే ఉంటుందా?
- ట్రంప్ మానసిక స్థితిపై మళ్లీ చర్చ
- స్నేహితుడా.. శత్రువా.. ఎవరైతే ‘నాకేంటి అంటున్న ట్రంప్
- అమెరికా: తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని వేరు చేస్తున్న ట్రంప్
- జెట్ ఎయిర్వేస్: విమానంలో కేబిన్ ప్రెషర్ మరచిన పైలట్లు.. ప్రయాణికుల అస్వస్థత
- ‘‘భారత్‌లో ఎదుర్కొన్నంత వర్ణవివక్ష మరెక్కడా చూడలేదు’’
- నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో పిల్లలు ఎందుకు పుడతారు?
- గంజాయి కోలా... ప్రయోగాలు చేస్తున్న కోకా కోలా
- ప్రసవం తర్వాత మహిళల కుంగుబాటు లక్షణాలేంటి? ఎలా బయటపడాలి?
- మూడు బ్యాంకుల విలీనంతో సామాన్యుడికి లాభమేంటి?
- పూజకు ముందు.. పీరియడ్లను వాయిదా వేసే పిల్ తీసుకుంటున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









