చెట్లు రహస్యంగా ఎలా మాట్లాడుకుంటాయో తెలుసా?

వీడియో క్యాప్షన్, చెట్లు రహస్యంగా ఎలా మాట్లాడుకుంటాయో తెలుసా?
చెట్ల నెట్‌వర్క్

పరిస్థితులకు అనుగుణంగా చెట్లు స్పందిస్తాయని భారత శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ తన క్రెస్కోగ్రాఫ్ ఆవిష్కరణతో ఎప్పుడో నిరూపించారు.

ఇప్పుడు చెట్ల గురించి మరో ఆసక్తిరమైన విషయాన్ని బయటపడింది. అవి రహస్యంగా మాట్లాడుకుంటాయని, వనరులను ఒకదానితో ఒకటి పంచుకుంటాయని, పోట్లాడుకుంటాయని తేలింది.

మనకు వరల్డ్ వైడ్ వెబ్ నెట్‌వర్క్ ఉన్నట్లు చెట్లకు 'వుడ్స్ వైడ్ వెబ్' ఉంది. ఈ నెటవర్క్‌తో నేల లోపల చెట్లన్నీ అనుసంధానమై ఉన్నాయి.

ఇంతకీ చెట్లు ఒకదానితో ఒకటి ఈ వుడ్ వైడ్ వెబ్‌తో ఎలా మాట్లాడుకుంటున్నాయి? అవి ఏం చెబుతున్నాయి? ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)