#FIFA2018: 12 మైదానాలు, రూ.23వేల కోట్లు

ఫొటో సోర్స్, DMITRY SEREBRYAKOV
2018 ఫిఫా ప్రపంచ కప్ మ్యాచ్‌ల కోసం రష్యాలోని 12 స్టేడియాలను ముస్తాబు చేశారు. ఈ స్టేడియాల నిర్మాణ, నవీకరణ కోసం రష్యా దాదాపు రూ. 23 వేల కోట్లు(3.45 బిలియన్ డాలర్లు) ఖర్చు చేసినట్టు ది మాస్కో టైమ్స్ పత్రిక తెలిపింది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఈ 12 మైదానాల్లో మొత్తం 64 మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఆ స్టేడియాల విశేషాలు ఓ సారి చూద్దాం.

1. లుజ్నికి స్టేడియం, మాస్కో
ఈ స్టేడియం సామర్థ్యం: 81,006*
తొలి మ్యాచ్, ఆఖరి మ్యాచ్‌లు ఈ స్టేడియంలోనే జరగనున్నాయి.
1956లో ప్రారంభమైన ఈ మైదానాన్ని తాజాగా ఫిఫా ప్రపంచకప్ కోసం నవీకరించారు.
ఈ ప్రపంచ కప్ వేదికల్లో అతిపెద్ద మైదానం ఇదే. 1980 ఒలింపిక్స్ గేమ్స్‌కు ప్రధాన వేదిక ఇదే.
2. స్పార్టక్ స్టేడియం, మాస్కో

ఫొటో సోర్స్, Getty Images
ఈ స్టేడియం 2014లో ప్రారంభమైంది. దీని సామర్థ్యం: 43,298*
3. నిజ్నీ నోవ్గోరోడ్ స్టేడియం, నిజ్నీ నోవ్గోరోడ్

ఫొటో సోర్స్, Getty Images
సామర్థ్యం: 45,331*
2018 ఫిఫా వరల్డ్ కప్ కోసం రష్యా ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్మించిన స్టేడియాల్లో ఇదొకటి.
రష్యా రాజధాని మాస్కో నుంచి 426 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిజ్నీ నోవ్గోరోడ్ ప్రాంతంలో ఈ స్టేడియం ఉంది.
4. మోర్డోవియా అరేనా

ఫొటో సోర్స్, DigitalGlobe/ScapeWare3d
సామర్థ్యం : 44,442*
దీని నిర్మాణ పనులు 2010లో ప్రారంభించగా.. ఇటీవలే పూర్తయ్యాయి. ఇది మాస్కో నుంచి ఆగ్నేయం మూలన 643 కిలోమీటర్ల దూరంలో ఉంది.
5. కజన్ అరేనా, కజన్

ఫొటో సోర్స్, Getty Images
సామర్థ్యం: 44,779*
రిపబ్లిక్ ఆఫ్ టటర్‌స్తాన్‌లో అతిపెద్ద నగరమైన కాజన్‌లో ఈ స్టేడియం ఉంది. మాస్కో నుంచి తూర్పున 820 కిలోమీటర్ల దూరంలో ఉంది.
6. సమర అరేనా, సమర

ఫొటో సోర్స్, Getty Images
సామర్థ్యం: 44,807*
ఈ స్టేడియాన్ని కాస్మోస్ అరేనా అని కూడా అంటారు. 2014లో నిర్మాణం ప్రారంభించగా ఇటీవలే పూర్తయింది.
మాస్కో నుంచి 1054 కిలోమీటర్ల దూరంలో, ఆగ్నేయ యూరోపియన్ రష్యా ప్రాంతంలో ఉంది.
7. యెకటెరిన్‌బర్గ్ అరేనా, యెకటెరిన్‌బర్గ్

ఫొటో సోర్స్, Getty Images
సామర్థ్యం: 35,696*
1953లో ప్రారంభమైన ఈ స్టేడియాన్ని ఇటీవల నవీకరించారు.
రష్యాలోని నాలుగో పెద్ద నగరమైన యెకటెరిన్‌బర్గ్‌లో ఉంది.
యూరప్, ఆసియా సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఈ నగరం, మాస్కో నుంచి దాదాపు 1750 కిలోమీటర్ల దూరంలో ఉంది.
8. సెయింట్ పీటర్స్ బర్గ్ స్టేడియం

ఫొటో సోర్స్, Getty Images
సామర్థ్యం: 68,134*
రష్యాలోని పెద్ద స్టేడియాల్లో ఇదొకటి.
గతేడాది పూర్తైన ఈ మైదానం నిర్మాణం కోసం దాదాపు 5 వేల కోట్లకు పైనే ఖర్చయినట్టు అంచనా.
9. కలినింగ్రాడ్ స్టేడియం, కలినింగ్రాడ్

ఫొటో సోర్స్, Getty Images
సామర్థ్యం: 35,212*
ఈ స్టేడియంలో నాలుగు ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
10 . వొల్గోగ్రాడ్ అరేనా

ఫొటో సోర్స్, Getty Images
సామర్థ్యం: 45,568*
మాస్కో నుంచి సుమారు 940 కిలోమీటర్ల దూరంలో నైరుతి రష్యాలోని వోల్గా నది తీరాన ఈ స్టేడియం ఉంది. ఇక్కడ కూడా 4 మ్యాచ్‌లు జరగనున్నాయి.
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఇది రణక్షేత్రంగా ఉండేది. ఇప్పటికీ తవ్వకాలు జరిపేకొద్దీ ఇక్కడ అస్థిపంజరాలు, గ్రెనేడ్ల లాంటి బయటపడుతూనే ఉన్నాయి.
11. రోస్టోవ్ అరేనా

ఫొటో సోర్స్, Getty Images
సామర్థ్యం: 45,145*
2018 ఫిఫా ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్మించిన ఈ స్టేడియాన్ని ఇటీవలే ప్రారంభించారు.
మాస్కో నుంచి దక్షిణాన దాదాపు 1100 కిలోమీటర్ల దూరంలో ఉన్న డాన్ నదీ తీరంలో ఉంది.
12. ఫిష్ట్ స్టేడియం

ఫొటో సోర్స్, Getty Images
సామర్థ్యం: 47,700*
నల్ల సముద్రం(బ్లాక్ సీ) తీరాన ఉన్న సోచి నగరంలో ఈ స్టేడియాన్ని 2014 వింటర్ ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్మించారు.
*గమనిక: ఆయా మైదానాల పూర్తిస్థాయి సామర్థ్యానికి సంబంధించిన వివరాలు ఇచ్చాం. కానీ, ఫిఫా నిబంధనల ప్రకారం ప్రపంచ కప్ కోసం సీటింగ్ సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








