బాలీవుడ్: ట్రాఫిక్‌లో సెల్ఫీ దిగినందుకు హీరో వరుణ్ ధవన్‌కు జరిమానా

వరుణ్ ధవన్

ఫొటో సోర్స్, Varun Dhawan/Twitter

సెల్ఫీ తీసుకుంటే జరిమానా కట్టాలా?

బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్‌కు ఈ పరిస్థితే ఎదురైంది.

ముంబయిలో ఓ అభిమానితో ముచ్చటపడి దిగిన సెల్ఫీ ఇప్పుడు ఆయనను చిక్కుల్లో పడేసింది.

వరుణ్ ధవన్ కారు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగింది. ఆయన కారు పక్కనే ఉన్నఆటోలోని అమ్మాయి ఆయనతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించింది.

ఆమె కోరిక మేరకు తన కారు కిటికీలో నుంచి తల బయటకు పెట్టి మరీ ఆ అభిమానితో వరుణ్ సెల్ఫీ దిగారు.

ఈ చిత్రాలను ముంబయికి చెందిన 'మిడ్ డే' పత్రిక ప్రచురించింది. వీటిని చూసిన ముంబయి పోలీసులు ధవన్‌ను ట్విటర్‌లో హెచ్చరించారు.

రద్దీ రోడ్లపై భద్రత గురించి ఏ మాత్రం ఆలోచించకుండా తన ప్రాణాలు, అభిమాని జీవితం రిస్క్‌లో ఉంచి సెల్ఫీ దిగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ఇటువంటి సాహసాలు సినిమాల్లో బాగుంటాయి. ముంబయి రోడ్లపై కాదు. మీ ప్రాణాలతో పాటు మీ అభిమాని, రోడ్డుపై ప్రయాణిస్తున్న ఇతరుల జీవితాలను మీరు ప్రమాదంలోకి నెట్టారు. యువత ఎంతో అభిమానించే మీరు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుకుంటున్నాం. మీరు చేసిన సాహసానికి గుర్తుగా ఈ-చలానా మీ ఇంటికి వస్తోంది. రెండోసారి ఇలా జరిగితే మేం మరింత కఠినంగా వ్యవహరిస్తాం" అని ముంబయి పోలీసులు ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఇందుకు వరుణ్ ధవన్ ట్విటర్ ద్వారా క్షమాపణలు చెప్పారు. ఇటువంటి తప్పు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు.

"రోడ్డుపై సెల్ఫీ తీసుకున్నందుకు క్షమాపణలు చెబుతున్నాను. ఆ సమయంలో మా వాహనాలు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్నాయి. అభిమాని కోరికను కాదని ఆమెను బాధపెట్టడం ఇష్టం లేక ఆ పని చేయాల్సి వచ్చింది. ఇకపై సెల్ఫీ తీసుకునేటప్పుడు భద్రతను కూడా పరిగణనలోకి తీసుకుంటాను. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాను" అని వరుణ్ ధవన్ ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చుకున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఈ తతంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ప్రజలు పలు రకాలుగా స్పందించారు.

"ప్రభుత్వం నుంచి మేం ఆశిస్తోంది ఇదే. సెలబ్రిటీలు కూడా సాధారణ పౌరుల మాదిరే బాధ్యతాయుతంగా వ్యవహరించాలి" అని ఎన్.ఎస్ స్లాథియా అనే ట్విటర్ హ్యాండ్లర్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

"దీనిపై ఏం చర్యలు తీసుకుంటారు?" అంటూ ఫహద్ నసీం అనే ట్విటర్ ఖాతాదారుడు నరేంద్ర మోదీ చిత్రాన్ని పోస్ట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

"ట్రాఫిక్‌లో కారు ఆగి ఉన్నప్పుడు సెల్ఫీ తీసుకుంటే తప్పు ఏముంది? ఆయనేమీ డ్రైవింగ్ చేయడం లేదు కదా. మామూలు వ్యక్తి ఈ పని చేస్తే పట్టించుకునే వారేనా?" అంటూ కపిల్ అనే ట్విటర్ ఖాతాదారుడు ప్రశ్నించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

ఇవి కూడా చూడండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)