ఇన్‌స్టాగ్రామ్‌తో డబ్బులు సంపాదిస్తున్న చిన్న వ్యాపారులు

ఫొటో సోర్స్, CAT MEFFAN
- రచయిత, జో క్లెయిన్‌మన్
- హోదా, టెక్నాలజీ రిపోర్టర్
ఇన్‌స్టాగ్రామ్ రోజూ చూస్తుంటారు కదా? అందులో ఏముంటాయి? ఇదేమి పిచ్చి ప్రశ్న.. ఇంకేం ఉంటాయి ఫొటోలు కాక అంటారేమో! ఆ ఫొటోలే మీకు సిరులు తెచ్చి పెడితే ఎంతో బాగుంటుంది కదా ! పదండి ఎలాగో తెలుసుకుందాం.
ఓసారి కాస్త వెనక్కి తిరిగి 2012లోకి వెళ్దాం.
అప్పటికి ఇన్‌స్టాగ్రామ్ వయసు 18 నెలలు. ఏడాదిన్నర వయసున్న అంకుర సంస్థ (స్టార్టప్)ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. ఎంత అనుకున్నారు దాదాపు రూ.5,500 కోట్లు (ఒక డాలరుకు రూ.55 చొప్పున). అప్పట్లో అది ఒక సంచలనం.
ఇప్పుడు 2017కి వద్దాం.
ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ వినియోగాదార్ల సంఖ్య 70 కోట్లు. ట్విటర్, స్నాప్‌చాట్‌ను దాటేసింది.
నచ్చిన ఫొటోలను వెతుకున్నే సౌకర్యం. చిన్నచిన్న వీడియోలు పంచుకునేందుకు అనువుగా ఉండే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు దీనికి అదనపు సొబగులు అద్దాయి.
24 గంటల తరువాత వీడియోలు వాటంతటవే డిలీట్ అయ్యే ఈ సదుపాయం చిన్న వ్యాపార సంస్థలు, ఫ్రీల్యాన్సర్లను ఎంతగానో ఆకట్టుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
మరి డబ్బులు ఎలా సంపాదించాలి?
డొన్నా మెకాలక్ "ఇన్‌స్టాగ్రామ్ అనేది షాప్‌కు ద్వారం లాంటిద"ని చెబుతున్నారు. సల్కీ డాల్ పేరిట ఫ్యాషన్ ఉత్పతులను డొన్నా విక్రయిస్తున్నారు.
వినియోగదార్లు ఇప్పుడు బిజినెస్ కార్డుల అడగడం లేదు. ఇన్‌స్టాగ్రాం హ్యాండిల్ అడుగుతున్నారు.
కేవలం ఒక పోస్ట్‌తో తనకు అయిదు రోజుల్లోనే అవకాశాలు వెల్లువెత్తినట్లు యోగా శిక్షకురాలు క్యాట్ మెఫాన్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఆమెకు 77,000 మంది ఫాలోవర్లు ఉన్నారు.
వ్యాపారానికి తగిన చిత్రాలు
డొన్నా, క్యాట్ తమ పోస్టులకు #యోగా, # ఓఓటీడీ (ఔట్ ఫిట్ ఆఫ్ ది డే) వంటి హ్యాష్ ట్యాగ్‌లు పెడతారు. వీటి వలన మరింత మందికి చేరువయ్యే అవకాశం ఉంది. నకిలీల బెడద తప్పించుకునేందుకు వారు చిన్నచిన్న వీడియోలతో స్టోరీస్ పోస్ట్ చేస్తారు.
వినియోగదార్లను ఆకర్షించేందుకు అనవసరమైన ఫొటోలు పెట్టకుండా వ్యాపారానికి తగిన చిత్రాలు మాత్రమే ఉంచుతారు.
మన ఫాలోవర్ల సంఖ్యనుపెంచుకోవాలంటే ఇది ఎంతో ముఖ్యమని డానీ కాయ్ చెబుతున్నారు. 1,73,000 మంది ఫాలోవర్లు ఉన్న ఈ ఫొటోగ్రాఫర్ ప్రస్తుతం ఇన్‌స్టాగ్రాం కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు.

ఫొటో సోర్స్, DANNY COY
24 గంటల్లో ఒక పోస్ట్ చాలు!
ఫాలోవర్లను ఆకర్షించాలంటే నిరంతరం పోస్ట్ చేస్తూ ఉండాలి. అలాగని ప్రతి రోజూ చేయనక్కర్లేదు. 24 గంటల్లో ఒకటి చాలు. అప్పుడే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో వారికి పూర్తిగా అర్థమవుతుంది.
గణనీయ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న ఇన్‌స్టాగ్రామర్లను ఆయా కంపెనీలు తమ బ్రాండు ప్రచారకర్తలుగా ఎంచుకుంటున్నాయి.
అందుకు కొంత రుసుము చెల్లిస్తాయి. అయితే ఇన్‌స్టాగ్రామ్ నియమ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
‘ఇప్పుడు కంపెనీలు తెలివి మీరుతున్నాయి. 18 నెలల క్రితం వరకు నెలకు రూ.1.7-2.5 లక్షల మధ్య సంపాదించే వాడినని కానీ ఇప్పుడు సంస్థలు అంతగా ఇవ్వడం లేదు’ అని డానీ కాయ్ చెబుతున్నారు.
ఒక ఇన్‌స్టాగ్రామర్ స్వచ్ఛందంగా ఏదైనా కంపెనీని ట్యాగ్ చేస్తే ఎటువంటి డబ్బులు చెల్లించకుండానే ఆ ఖాతాలోని ఫొటోలను అనుమతి లేకుండానే సంస్థ వాడుకుంటోందని తెలిపారు.

ఫొటో సోర్స్, Mariann Hardey
అయితే తమకు నచ్చిన ఫొటోలు, వీడియోలు ఉంటే ఆ కంటెంట్ బ్రాండ్ గురించి ఇన్‌స్టాగ్రామర్లు పెద్దగా పట్టించుకోరని డుర్హామ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ (మార్కెటింగ్)గా పని చేసే మారియన్ హార్దే అంటున్నారు.
చాలా మందికి తాము బ్రాండెడ్ కంటెంట్ చూస్తున్నామనే విషయం తెలియదు
. అయితే ఇన్‌స్టాగ్రామ్‌ను తరచుగా ఉపయోగించేవారికి మాత్రం బ్రాండెడ్ కంటెంట్‌ను ఎలా ఫిల్టర్ చేయాలో బాగా తెలుసని మారియన్ చెబుతున్నారు.
మొత్తానికి చేసే పోస్ట్ కొత్తగా ఉందా? ఫొటో ఆకట్టుకుంటోందా? అనేదే ముఖ్యం.
కాబట్టి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా డబ్బులు సంపాదించాలంటే మన పోస్టులు ఫాలోవర్లను నిరంతరం ఆకట్టుకునేలా ఉండాలి.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








