#PradeepMehra ఇండియన్‌ ఆర్మీలో చేరడం కోసం అర్ధరాత్రి పరుగు.. ఆఫీస్ నుంచి ఇంటికి రోజూ 10 కిలోమీటర్లు రన్నింగ్.. యువకుడి శ్రమకు నెటిజన్లు ఫిదా

ప్రదీప్ మెహ్రా

ఫొటో సోర్స్, Vinod Kapri

ఫొటో క్యాప్షన్, ప్రదీప్ మెహ్రా ప్రతి రాత్రీ ఉద్యోగం ముగించుకుని రన్నింగ్ చేస్తూ ఇంటికి వెళతాడు

అది దిల్లీ శివార్లలోని నోయిడా. శనివారం రాత్రి ఓ యువకుడు రాత్రి పూట పరుగు తీస్తున్నాడు. అలా పరుగెడుతూ ఓ కారును దాటేశాడు. ఆ కారులో ఉన్న వ్యక్తి.. అతడి పక్కకు కారును పోనిచ్చి కారులో లిఫ్ట్ ఇస్తానని ఆఫర్ చేశాడు.

కానీ ఆ యువకుడు లిఫ్ట్ వద్దన్నాడు. పరిగెడుతూనే ఉన్నాడు. అదేమంటే.. తాను ప్రతి రోజూ రాత్రి పనైపోయాక అలాగే పరిగెడుతూ ఇంటికి వెళతానని చెప్పాడు. ప్రతి రోజూ 10 కిలోమీటర్లు పరుగు తీస్తుంటానన్నాడు.

ఎందుకలా అంటే.. ఆర్మీ ఉద్యోగం కోసం తన శరీరాన్ని సంసిద్ధంగా ఉంచుకోవటం కోసమని బదులిచ్చాడు.

ఆ యువకుడి పేరు ప్రదీప్ మెహ్రా. వయసు 19 ఏళ్లు. అతడు అర్ధరాత్రి పరుగెత్తుతున్న దృశ్యాన్ని ఆ కారులో ఉన్న వ్యక్తి వినోద్ కాప్రి వీడియో తీసి ఆదివారం సాయంత్రం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటివరకూ 60 లక్షల వ్యూస్ వచ్చాయి.

ప్రదీప్ మెహ్రా నోయిడాలోని ఓ మెక్‌డొనాల్డ్స్ ఔట్‌లెట్‌లో నైట్ షిఫ్టులో పని ముగించుకుని ఇంటికి పరుగుపెడుతూ వెళుతుండగా వినోద్ కాప్రి చూశారు. ఆ యువకుడు ఏదైనా ఇబ్బందుల్లో ఉండి అలా పరుగున వెళుతున్నాడేమోనని వినోద్ భావించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

సినీ దర్శకుడైన వినోద్ కాప్రి.. ఆ యువకుడిని తన కారులో నుంచే వీడియో తీస్తూ అతడి పక్కన కారును మెల్లగా నడుపుతూ ఏమైంది, ఎందుకు అంటూ అడిగి వివరాలు తెలుసుకున్నారు.

''ఈ కుర్రాడు చెప్పే కారణం వింటే ఇతడితో ప్రేమలో పడతారు'' అని కామెంట్ రాసి ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు.

ప్రదీప్ తన సోదరుడితో కలిసి నోయిడాలో నివసిస్తున్నాడు. పగటి పూట వ్యాయామం చేయటానికి టైం లేదని, కాబట్టి రాత్రి పనైపోయాక రోజూ ఇలా పరిగెడుతూ ఇంటికి వెళుతుంటానని చెప్పాడు.

అతడు పరుగు ఆపకుండా.. ''ఒకవేళ నేను మీ కారు ఎక్కి వస్తే నా రొటీన్ దెబ్బతింటుంది'' అని నవ్వుతూనే వినోద్ ఇచ్చిన లిఫ్ట్ ఆఫర్‌ను తిరస్కరించాడు.

తనతో వచ్చి భోజనం చేయాలని వినోద్ కాప్రి అడిగినపుడు, అందుకూ తిరస్కరించాడు. తన అన్న కూడా నైట్ షిఫ్టులో పనిచేస్తుంటాడని, తాను ఇంటికెళ్లి అన్నకు, తనకు వంట చేయాలని చెప్పాడు.

పొద్దున్నే ఎందుకు రన్నింగ్ చేయలేదని అడిగితే.. ఉదయం పనికి వెళ్లటానికి ముందు పొద్దున్నే లేచి వంటి చేయాల్సి ఉంటుందని ప్రదీప్ వివరించాడు.

తమ అమ్మానాన్నలు ఉత్తరాఖండ్‌లో ఇంటి దగ్గర ఉంటారని, తమ అమ్మకు అనారోగ్యంగా ఉందని, ఆమెను తమ నాన్న చూసుకుంటున్నాడని చెప్పాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ప్రదీప్ పట్టుదల చూసిన అచ్చెరువొందిన వినోద్.. అతడిని అభినందించటం వీడియోలో కనిపించింది. ఈ వీడియో వైరల్ అయితే ఏం చేస్తావని ప్రదీప్‌ను అడిగాడు.

''నన్నెవరు గుర్తుపడతారు... అది వైరల్ అయితే కానివ్వండి. నేనేమీ తప్పు చేయటం లేదు కదా'' అని నవ్వుతూ బదులిచ్చాడు.

ఈ అంశంపై మాట్లాడటానికి బీబీసీ ఫోన్ కాల్స్, మెసేజెస్ చేసినా ప్రదీప్ స్పందించలేదు. దీనిపై వ్యాఖ్యానించటం అతడికి ఇష్టం లేదని వినోద్ చెప్పారు.

ప్రదీప్ అకుంఠితదీక్షను కీర్తిస్తూ సోషల్ మీడియాలో వేలాది మంది కామెంట్లు పెట్టారు.

వీడియో క్యాప్షన్, ఒకప్పుడు ఆకలితో అలమటించిన ఒంటరి ముస్లిం మహిళలు, నేడు వందల మందికి కడుపు నింపుతున్నారు

''ప్రపంచం నిన్ను తెలుసుకుంటుంది'' అని ఒక ట్విటర్ యూజర్ వ్యాఖ్యానించారు.

దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా.. తాను ఆ వీడియోను వీక్షించటం ఆపలేకపోతున్నానని స్పందించారు.

''ఈ పిల్లాడి పట్టుదల, అంకితభావం ముందు సివిల్ సర్వెంట్లు, రాజకీయ నాయకులు దిగదిడుపే''నని ఆయన వ్యాఖ్యానించారు.

రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సతీశ్ దువా.. తాను ప్రదీప్ శిక్షణ గురించి ఇండియన్ ఆర్మీలోని ఓ సీనియర్ అధికారితో మాట్లాడానని ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ప్రదీప్ చదువుకి, అతడి తల్లి ఆస్పత్రి ఖర్చులకు నిధులు సమకూర్చటానికి తాము సిద్ధమని సమాజ్‌వాది పార్టీ అధికార ప్రతినిధి చెప్పారు.

ప్రదీప్ మెహ్రాను ప్రశంసిస్తూ కొంతమంది సెలబ్రిటీలు కూడా ట్వీట్లు చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

Presentational white space
పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

Presentational white space
పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

Presentational white space

ఈ స్ఫూర్తిదాయకమైన వీడియో.. 'భారతదేశంలో యువత ఉద్యోగాల కోసం ఎంత నిస్పృహ'లో ఉన్నారనే దానిని కూడా ప్రతిఫలిస్తోందని ఇంకొందరు వ్యాఖ్యానించారు.

Presentational white space

ఆదివారం రాత్రి ప్రదీప్ మెహ్రా పని ముగించుకున్న తర్వాత అతడిని కలవటానికి వినోద్ కాప్రి మెక్‌డొనాల్డ్ ఔట్‌లెట్ దగ్గరకు వెళ్లారు.

ఇంటి దగ్గరి ఫ్రెండ్స్, జనం నుంచి తనకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయని అతడు చెప్పాడు.

ఈ వీడియోకు వచ్చిన భారీ స్పందనను చూసిన ప్రదీప్.. ''కష్టపడి పనిచేస్తే ప్రపంచం తలవంచుతుంది'' అని స్పందించాడు.

ఈసారి తన రొటీన్‌కు విరామం ఇచ్చి, ఇంటి దగ్గర కారులో దింపుతానన్న ప్రదీప్ ఆఫర్‌ను అంగీకరించాడు.

''నిన్న రాత్రి మీరు లిఫ్ట్ ఇస్తానన్నపుడు.. రన్నింగ్‌ను మధ్యలో ఆపకూడదని వద్దన్నాను'' అని చెప్పాడు.

వీడియో క్యాప్షన్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి, కాశీలో పురోహితుడిగా మారిన తెలుగు యువకుడు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)