నరేంద్ర మోదీ: ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కోవిడ్ వ్యాక్సిన్ల వృధా 10 శాతం పైనే ఉంది’’ - Newsreel

ఫొటో సోర్స్, UGC
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సీన్ల వృధా పది శాతం పైగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోనూ దాదాపు అదే స్థాయిలో వ్యాక్సీన్ వృధా జరుగుతోందని చెప్పారు.
ప్రధాని మోదీ బుధవారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''వ్యాక్సీన్ల వృధా ఎందుకు జరుగుతోందో రాష్ట్రాల్లో సమీక్షించాలి. ప్రతి సాయంత్రం పర్యవేక్షించాలి. వృధా జరగకుండా క్రియాశీలమైన వారిని సంప్రదించాలి'' అని సూచించారు.
దేశంలో కరోనా సోకిన వారిలో 96 శాతం మందికి పైగా కోలుకున్నారని మోదీ చెప్పారు. ప్రపంచంలో కరోనా మరణాల రేటు అతి తక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటిగా ఉందని చెప్పారు.
కరోనా 'సెకండ్ వేవ్'ను అడ్డుకోవాలి...
కొన్ని రాష్ట్రాల్లో కేసులు అకస్మాత్తుగా పెరగటం మొదలైందని.. రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆందోళన వ్యక్తం చేశారని ప్రధాని ఉటంకించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
''ఇప్పుడిప్పుడే మొదలైన కరోనా 'సెకండ్ వేవ్'ను తక్షణం ఆపాలి. ఇందుకోసం సత్వర, నిర్ణయాత్మక చర్యలు చేపట్టాలి'' అని మోదీ పేర్కొన్నారు.
అవసరమైనపుడు సూక్ష్మ కంటైన్‌మెంట్ జోన్లను చేసే అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.
''ప్రజలను భయాందోళనలకు గురిచేయాల్సిన అవసరం లేదు. పానిక్ వాతావరణాన్ని నెలకొల్పాల్సిన అవసరం లేదు. మనం కొన్ని ముందు జాగ్రత్తలు, కొన్ని చర్యలు చేపట్టటం ద్వారా ప్రజలకు వారి కష్టాల నుంచి విముక్తి కల్పించాల్సి ఉంది'' అని ప్రధాని వ్యాఖ్యానించారు.


ఫొటో సోర్స్, Getty Images
కూలిన మిగ్-21 బైసన్ యుద్ధ విమానం.. పైలట్ మృతి
భారత వాయుసేనకు చెందిన మిగ్-21 యుద్ధ విమానం బుధవారం కుప్పకూలింది. విమానం పైలట్ చనిపోయారు.
బుధవారం సైనిక శిక్షణలో భాగంగా ఎగిరిన ఈ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్ ఎ గుప్తా ప్రాణాలు కోల్పోయారు.
''మధ్య భారతదేశంలోని ఒక వైమానిక స్థావరంలో యుద్ధ శిక్షణ కోసం టేకాఫ్ తీసుకుంటున్న ఐఏఎఫ్ మిగ్-21 బైసన్ విమానం పెను ప్రమాదానికి గురైంది'' అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్వీట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఈ ప్రమాదం పట్ల వాయుసేన తీవ్ర విచారం వ్యక్తం చేసింది. చనిపోయిన గ్రూప్ కెప్టెన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ ప్రమాదానికి వెనుక కారణాలను తెలుసుకోవటం కోసం దర్యాప్తుకు ఆదేశించామని తెలిపింది.


ఫొటో సోర్స్, Getty Images
బెంగళూరు-జైపూర్ విమానంలో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం
కర్ణాటకలోని బెంగళూరు నుంచి రాజస్థాన్‌లోని జైపూర్ వెళ్లిన ఇండిగో విమానంలో బుధవారం ప్రయాణించిన ఓ గర్భిణి విమానంలోనే పాపకు జన్మనిచ్చారు.
విమానంలో ప్రయాణిస్తున్న ఒక డాక్టర్, విమాన సిబ్బంది సహాయంతో కాన్పు చేశారు.
జైపూర్ విమానాశ్రయానికి సమాచారం అందించడంతో విమానం అక్కడికి చేరేసరికి తల్లీబిడ్డలకు పూర్తి వైద్య సహాయం అందించేందుకు వీలుగా అంబులెన్స్, డాక్టర్‌ని సిద్ధంగా ఉంచారు.
ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఇండిగో విమానయాన సంస్థను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4


ఫొటో సోర్స్, EPA
అమెరికాలోని మసాజ్ సెంటర్, స్పాలలో కాల్పులు.. 8 మంది మృతి
అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో జరిగిన కాల్పుల్లో 8 మంది మరణించారు. ఇందులో ఆరుగురు ఆసియా మహిళలు.
అట్లాంటాకు తూర్పున ఉన్న ఆక్వర్త్‌లోని ఒక మసాజ్ పార్లర్‌లో జరిగిన కాల్పుల్లో నలుగురు, మరో రెండు స్పాలలో ఇంకో నలుగురు మరణించారని పోలీసులు చెప్పారు.
ఈ మూడు దాడులకు కారణమని భావిస్తున్న ఓ 21 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
కాల్పులకు కారణమేంటన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.
పోలీసులను పరుగులు పెట్టించిన దుండగుడు..
స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ఆక్వర్త్‌లోని యంగ్ ఆసియన్ మసాజ్ సెంటర్‌లో మొదట కాల్పులు జరిగాయి. ఇద్దరు అక్కడికక్కడే మరణించగా గాయపడిన మరో ముగ్గురిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు పోలీసులు చెప్పారు.
ఆసుపత్రికి తీసుకెళ్లిన ముగ్గురిలో ఇద్దరు ఆ తరువాత మరణించారు.
మొదట చోటుచేసుకున్న కాల్పుల తరువాత గంట వ్యవధిలోనే నార్త్ ఈస్ట్ అట్లాంటాలో ఉన్న గోల్డ్ స్పాలో దోపిడీ జరుగుతోందని పోలీసులకు ఫోన్ వచ్చింది.
వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లగా తూటా గాయాలతో రక్తపు మడుగులో ముగ్గురు మహిళల మృతదేహాలు కనిపించాయి.
పోలీసులు ఇంకా అక్కడ ఉంటుండగానే మళ్లీ ఫోన్ మోగింది.. అరోమాథెరపీ స్పా నుంచి ఫోన్ వచ్చింది.
పరుగుపరుగున అక్కడికి వెళ్లగా అక్కడ మరో మహిళ మృతదేహం తూటా గాయాలతో కనిపించించింది.
సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా..
కాగా మూడు ఘటనల తరువాత సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు జార్జియాలోని ఉడ్‌స్టాక్‌కు చెందిన రాబర్ట్ ఆరోన్ లాంగ్ అనే 21 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశారు.
ఈ అనుమానితుడే మూడు చోట్లా కాల్పులు జరిపాడనడానికి గట్టి ఆధారాలున్నాయని పోలీసులు చెబుతున్నారు.


ఫొటో సోర్స్, XIAOHONGSHU
పిల్లల డ్రెస్సులతో పెద్దల సెల్ఫీలు.. చైనాలో కొత్త సోషల్ ట్రెండ్
చిన్నారులు వేసుకునే టీ షర్టులు, డ్రెస్సులతో మహిళలు సెల్ఫీలు దిగడం చైనాలో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్‌గా మారింది. ఆ దేశంలో ఫేమస్ అయిన యూనిక్లో స్టోర్‌లకు యువతులు ఎగబడుతున్నారు.
ఈ స్టోర్‌లలోని చిన్నపిల్లల సెక్షన్‌లో ఉండే దుస్తులను ట్రయల్ వేస్తూ యువతులు దిగిన సెల్ఫీలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
చైనాలో ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లకు సమానమైన క్రేజ్ ఉన్న షియాహోంగ్షు, వీబో సోషల్ ప్లాట్‌ఫామ్‌లపై ఈ ఫొటోలు విపరీతంగా షేర్ అవుతున్నాయి.
Adults trying on Uniqlo children's clothes హ్యాష్‌ట్యాగ్‌తో ఒక్క వీబోలోనే 68 కోట్ల సెల్పీలు షేర్ అయినట్లు తేలింది. ఈ ట్రెండ్ మీద స్పందించాల్సిందిగా యూనిక్లో స్టోర్‌ను బీబీసీ కోరగా, దాని యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
అయితే ఈ ట్రెండ్ కారణంగా స్టోర్‌లోని దుస్తులు పాడైపోతున్నాయన్నది ఒక్కటే కాకుండా, సన్నగా ఉన్నామని సోషల్ మీడియా ద్వారా చెప్పుకునేందుకు చైనీస్ యువత పోటీ పడుతున్న తీరుపైనా ఆందోళన వ్యక్తమవుతోంది.
గతంలో రెండు చేతులను వెనక్కి కట్టుకుని, నాభిని తాకే బెల్లి బటన్ ఛాలెంజ్(belly button challenge), ఏ4 సైజ్ పేపర్ వెడల్పుకన్నా తమ నడుము సన్నగా ఉందని చూపించే ఏ4వెస్ట్ ఛాలెంజ్(A4waist), కురుచ టాప్, స్లిమ్ జీన్స్ వేసుకునే బీఎం స్టైల్ ఛాలెంజ్( BM Style)ల మాదిరిగానే ఇప్పుడు ఈ పిల్లల డ్రెస్సులు వేసుకుని సెల్ఫీలు దిగే ట్రెండ్ చైనాలో కొనసాగుతోంది.


ఫొటో సోర్స్, Getty Images
నైగర్‌లో దుండగుల కాల్పులు- 58మంది మృతి
టిల్లాబెరీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణా రహితంగా జరిపిన దాడుల్లో 58మంది మరణించారని నైగర్ ప్రభుత్వం ప్రకటించింది.
మార్కెట్ నుంచి ప్రజలను తరలిస్తున్న నాలుగు వాహనాలపై సాయుధులైన దుండగులు కాల్పులు జరిపారని, అయితే ఇంత వరకు ఏ వర్గం కూడా ఈ కాల్పులకు తామే బాధ్యులమని ప్రకటించుకోలేదని ప్రభుత్వం వెల్లడించింది.
ప్రస్తుతం నైగర్ దేశంలో రెండు జిహాదీ గ్రూపులు పని చేస్తుండగా, అందులో మాలి-బుర్కినా ఫాసో సరిహద్దుల్లో ఒకటి, నైజీరియా సరిహద్దుల్లో రెండో గ్రూప్ యాక్టివ్‌గా ఉన్నాయి.
ఈ కాల్పుల్లో మరొక వ్యక్తి గాయపడ్డారని, రెండు వాహనాలను తగలబెట్టిన దుండగులు, మరో రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఘటన తర్వాత నైగర్ ప్రభుత్వం మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- No Smoking Day: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా... ‘నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే’
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
- కొండ బారిడి: తుపాకులు గర్జించిన నేలలో ఇప్పుడు సేంద్రియ వ్యవసాయ విప్లవం
- కరోనా వైరస్ వ్యాక్సీన్ కోసం నమోదు: కోవిన్ యాప్, వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ఇలా.. ఏఏ ధ్రువపత్రాలు కావాలంటే
- హాథ్రస్: కూతురిని వేధించారని కేసు పెట్టినందుకు తండ్రిని కాల్చి చంపేశారు
- కరోనావైరస్: ఇండియాలో మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతుండడానికి కారణమేమిటి.. మరో వేవ్ మొదలైందా
- ఇథియోపియా టిగ్రే సంక్షోభం: బీబీసీ విలేకరిని నిర్బంధించిన సైన్యం
- కృత్రిమ గర్భధారణ ఖర్చులు భరించలేక ఫేస్బుక్లో వీర్యదాతలను ఆశ్రయిస్తున్నారు... ఆరోగ్యం ఏమవుతుంది?
- భారతదేశంలోని ‘అస్థిపంజరాల సరస్సు’.. అంతు చిక్కని రహస్యాల నిలయంయాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








