కరోనావైరస్ నిజాముద్దీన్: తబ్లిగీ జమాత్ అధ్యక్షుడు ముహమ్మద్ సాద్‌పై హత్య కేసు నమోదు

తబ్లీగీ జమాత్

ఫొటో సోర్స్, Hindustan Times

ఫొటో క్యాప్షన్, భారతదేశంలోని 17 రాష్ట్రాల్లో 1,023 కరోనావైరస్ కేసులకు తబ్లీగీ జమాత్‌తో సంబంధాలున్నయని చెబుతున్నారు.

దిల్లీలోని తబ్లిగీ జమాత్ సంస్థ అధ్యక్షుడు ముహమ్మద్ సాద్ ఖాందాల్వీ మీద మానవ హత్యకు కారణమయ్యారనే అభియోగాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిజాముద్దీన్ ప్రాంతంలోని మసీదులో తబ్లిగీ జమాత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక సామూహిక కార్యక్రమం దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కోవిడ్-19 క్లస్టర్ల ఏర్పాటుకు దారితీసింది.

దేశ రాజధాని దిల్లీలో నిర్వహిస్తున్న ఆ కార్యక్రమాన్ని ముగించాల్సిందిగా రెండుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ, ముహమ్మద్ సాద్ వాటిని పట్టించుకోలేదని పోలీసులు చెబుతున్నారు. దేశంలోని 17 రాష్ట్రాలలో నమోదైన 1023 కరోనావైరస్ పాజిటివ్ కేసులకు నిజాముద్దీన్ కార్యక్రమంతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమానికి వచ్చిన విదేశీయుల ద్వారా వైరస్ మిగతా వారికి సోకిందని భావిస్తున్నారు.

అయితే, ముహమ్మద్ సాద్, ఆయన ఆధ్వర్యంలోని తబ్లీగీ జమాత్ ఆ ఆరోపణలను తొసిపుచ్చారు.

శిక్షార్హమైన హత్యా నేరానికి పాల్పడ్డారనే అభియోగాలతో ఆయన పై కేసు నమోదు చేశామని దిల్లీ పోలీసులు తెలిపారు. అంటే, సాద్‌కు ఈ కేసులో బెయిల్ కోసం ఆయన దరఖాస్తు చేసుకునేందుకు వీలుండదు.

ఆయన స్వీయ నిర్బంధం (ఐసోలేషన్)లో ఉన్న సమయంలో ఆయనపై ఈ అభియోగాలు నమోదయ్యాయి.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

దిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో తబ్లీగీ జమాత్ సామూహిక కార్యక్రమం మార్చి 3న మొదలైందని, భారతదేశంలో మార్చి 24న లాక్‌డౌన్ విధించిన తరువాత కూడా కొనసాగిందని పోలీసులు అంటున్నారు.

అయితే, మార్చి 22న జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన వెంటనే, ముహమ్మద్ సాద్ ఆ కార్యక్రమాన్ని సస్పెండ్ చేశారని, అందరూ ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని చెప్పారని తబ్లిగీ జమాత్ సంస్థ అంటోంది.

చాలా మంది వెళ్లిపోయారని, ఆ తర్వాత రోజు నుంచి రాష్ట్రాల సరిహద్దులు మూసివేయడంతో మిగతావారు అక్కడే ఉండిపోయారని, ఆ తర్వాత రెండు రోజులకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించి, బస్సులు, రైళ్లను రద్దు చేయడంతో వారు వెళ్ళలేకపోయారని ఆ సంస్థ చెబుతోంది.

ఆ మసీదు ప్రాంగణంలో వందల మంది ఉండేందుకు వసతి గదులు ఉన్నాయి.

అన్ని విషయాలనూ పోలీసులకు తెలియజేశామని, మసీదు పరిసరాలను పరిశీలించేందుకు వచ్చిన వైద్య అధికారులకు సహకరించామని నిర్వాహకులు చెబుతున్నారు.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)