కరోనావైరస్; 'గచ్చిబౌలి స్టేడియంలో 1400 పడకల ఐసీయూ సెంటర్ ఏర్పాటు... ఏప్రిల్ 15 దాకా ఎక్కడివాళ్ళు అక్కడే ఉండండి ' - కేసీఆర్

ఈటల, కేసీఆర్

ఫొటో సోర్స్, Telangana CMO

''యుద్ధం చేసే సమయంలో నిర్లక్ష్యం, అలసత్వం పనికిరాదు. వైద్యులు, అధికారులు, పోలీసు సిబ్బందికి ప్రజలు సహకరించాలి. బాధలైనా భరించాలి. ఏప్రిల్‌ 15 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నాం. తెలంగాణ సమాజానికి దండం పెట్టి చెబుతున్నా. గత్తర బిత్తర కావొద్దు. ఎక్కడివాళ్లు.. అక్కడే ఉండండి'' అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు.

లాక్‌డౌన్‌ చేయకుండా ఉంటే భయంకర పరిస్థితులుండేవన్నారు. ఇతర రాష్ట్రాల ఉద్యోగులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎట్టి పరిస్థితుల్లో హాస్టల్స్‌ మూసివేయబోమని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నవాళ్లందరికీ ఆహార వసతి ఏర్పాటు చేస్తామని, అందరి ఆకలి తీరుస్తామని భరోసా ఇచ్చారు.

కేసీఆర్ శుక్రవారం వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డిలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత సీఎం మీడియాతో మాట్లాడారు.

కరోనావైరస్

ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే:

తెలంగాణలో ఇప్పటివరకు 59 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 10 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ప్రస్తుతం 58 మందికి చికిత్స కొనసాగిస్తున్నాం. ఒకరు పూర్తిగా కోలుకుని వెళ్లారు. హోం క్వారంటైన్‌తో పాటు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లలో సుమారు 25,000 మంది పర్యవేక్షణలో ఉన్నారు.

కరోనావైరస్ మీద పోరాడటానికి ప్రణాళిక సిద్ధం చేశాం. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవటానికి డాక్టర్లు, ఇతర ఇబ్బందితో పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాం. 100 మంది అవసరమైన చోట 130 మంది సిబ్బందిని పెట్టుకుంటున్నాం. ఐసొలేషన్‌ వార్డుల్లో 11,000 మందికి చికిత్స అందించగలం. 12,400 ఇన్‌పేషంట్స్‌కు సేవలందించేందుకు బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయి. మరో 1,400 ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉంచాం. ఇంకా 500 వెంటిలేటర్లకు ఆర్డర్లు ఇచ్చాం.. అవి వస్తున్నాయి. వైద్యులకు కావాల్సిన సదుపాయాలన్నీ కల్పిస్తాం.

కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

గచ్చిబౌలి స్టేడియంలో 1400 పడకల ఐసీయూ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నాం. 60,000 మంది వ్యాధికి గురైనా చికిత్స అందించే ఏర్పాట్లు చేశాం. 11,000 మంది విశ్రాంత వైద్యులు, ల్యాబ్‌ టెక్నీషియన్ల సేవలు వాడుకునేలా చర్యలు తీసుకున్నాం.

అన్నదాతలను ఆదుకుంటాం. 15 రోజులు 24 గంటలు కరెంట్‌ సరఫరా చేస్తాం. ఎస్‌ఆర్‌ఎస్‌పీ, సాగర్‌, జూరాల ఆయకట్టులకు నీళ్లు అందిస్తాం. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. వ్యవసాయ, డైరీ, పౌల్ట్రీ ఉత్పత్తుల సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదు.

నిత్యావసరాలు, కూరగాయల కోసం ఇంటి నుంచి ఒక్కరే వెళ్లాలి. చికెన్‌, గుడ్లు తింటే కరోనా వస్తుందనేది అవాస్తవం. బలవర్దక ఆహారం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.''

వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)