కరోనా లాక్‌డౌన్: కశ్మీర్ పర్యాటక రంగంపై దెబ్బమీద దెబ్బ.. మొన్నటి వరకూ ఆర్టికల్ 370, ఇప్పుడు లాక్‌డౌన్

హౌస్ బోట్

వసంతం రాకతో భారత పాలిత కశ్మీర్ ప్రాంతంలో బాదం పూలు, ఆవ పూల తోటలు, చెర్రీలు, టులిప్ లు వికసించాయి. కానీ ఆ సౌందర్యాన్ని ఆస్వాదించడానికి తగినంత మంది యాత్రీకులు మాత్రం లేరు. కరోనా‌వైరస్ భయంతో కశ్మీర్‌లో పర్యాటక పరిశ్రమ పూర్తిగా స్తంభించి పోయింది.

గత ఆగష్టు 5వ తేదీన కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి ఆర్టికల్ 370 ద్వారా రాష్ట్రానికి ఉన్న స్వయం ప్రతిపత్తిని తొలగించినప్పటి నుంచి కశ్మీర్‌కి పర్యటకుల రాక పూర్తిగా తగ్గిపోయింది. కశ్మీర్ చాలా కాలం పాటు సైనిక నిర్బంధంలో ఉంది.

ఆగష్టు 5 తర్వాత కశ్మీర్ ఆర్ధిక వ్యవస్థ 18000 కోట్ల రూపాయిలు నష్టపోయినట్లు కశ్మీర్ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పేర్కొంది.

ఒక్క హోటల్ పరిశ్రమే గత ఆరు నెలల్లో మూడు వేల కోట్ల రూపాయిలు నష్టపోయింది.

పర్యటకులు లేక శ్రీ నగర్ దాల్ సరస్సులో ఉన్న హౌస్ బోట్‌లన్నీ ఖాళీగా ఉన్నాయని, హౌస్ బోట్ యజమానుల సంఘం ఉపాధ్యక్షుడు అబ్దుల్ రషీద్ తెలిపారు.

ఆర్టికల్ 370 నిర్మూలించిన దగ్గర నుంచి హౌస్ బోట్ పరిశ్రమ అత్యంత కష్టతరమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని , రషీద్ చెప్పారు. "మేము చాలా నష్టాలను చవి చూసాము. 2014లో కశ్మీర్‌లో వరదలు వచ్చినప్పుడు కూడా మేము వ్యాపారం లో నష్టాలు అనుభవించాము. 2016లో రాష్ట్రంలో అనిశ్చితి తలెత్తినప్పుడు కూడా కశ్మీర్ రాష్ట్రం లో ఆరు నెలల పాటు ఎటువంటి వ్యాపార లావాదేవీలు జరగలేదు. ఇదంతా మా ఆర్ధిక వ్యవస్థకి గండి కొట్టింది", అని రషీద్ అన్నారు.

హౌస్ బోట్

"మా వ్యాపారం చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉంది. వ్యాపారుల స్థితిగతులు చూస్తే మీకే అర్ధమవుతుందని", అయన అన్నారు..

"చాలా మంది వ్యాపారులు గత ఆరు నెలల్లో బ్రతుకు గడవడం కోసం అప్పులు చేసి జీవనం సాగిస్తున్నారు. పర్యటక రంగం మెరుగు పడితే అప్పులు తీర్చవచ్చని ఎదురు చూస్తున్నారు".

ఈ పరిశ్రమని నమ్ముకున్న వారి గురించి చెబుతూ, వ్యాపారం లేనపుడు వారు మరే ఇతర పనీ చెయ్యరు. "మాకు రేపటికి తినడానికి తిండి ఉంటుందో లేదో తెలియదు. మాకు హోటళ్లు కూడా లేవు. మేము కేవలం హౌస్ బోట్‌ల మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నాము. మేము స్వచ్చంద సంస్థల నుంచి సహాయం కోసం ఎదురు చూస్తున్నాము".

శ్రీ నగర్ లోని దాల్ సరస్సులో 800 కి పైగా హౌస్ బోట్‌లు ఉన్నాయి.

కశ్మీర్‌కి వచ్చే పర్యటకులు హౌస్ బోట్‌లో ఉండటానికి ఆశక్తి చూపిస్తారు.

కొన్ని నెలల పాటు నిర్బంధంలో ఉన్న తర్వాత నెమ్మదిగా కోలుకుంటూ, అంతా సవ్యంగానే ఉందనుకుంటున్న దశలో కరోనా వైరస్ మా జీవితాల పై పెద్ద ప్రభావాన్నే చూపిస్తుందని అన్నారు.

కశ్మీర్

ఇప్పటి వరకు కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో నాల్గు కోవిడ్-19 కేసులు నమోదు అయ్యాయి.

శ్రీనగర్ లోను, కశ్మీర్ లోని కొన్ని ప్రాంతాలలోను ప్రజా కదలికల పై ప్రభుత్వం నిర్బంధం విధించింది.

అన్ని వ్యాపార సంస్థలు, విద్య సంస్థలు, కార్యాలయాలు మూసివేశారు. ప్రజా రవాణా వ్యవస్థని కూడా నిలిపేశారు. తిరిగి ఆదేశాలు ఇచ్చే వరకు పార్కులు, ఉద్యానవనాలు కూడా తెరవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విదేశీ పర్యటకుల పై కూడా నిషేధం విధించింది.

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి
BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు

కశ్మీర్‌లో ముందుగా బుక్ చేసుకున్న హోటల్ రిజర్వేషన్‌లను కూడా పర్యటకులు రద్దు చేసుకుంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే హోటల్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వగలమో లేదో అని హోటల్ యజమానులు భయపడుతున్నారు.

హోటల్ పరిశ్రమ పూర్తిగా నష్టపోయిందని, హోటెలీర్స్ క్లబ్ చైర్మన్ ముష్తాక్ అహ్మద్ చైయా బీబీసీతో అన్నారు.

కశ్మీర్

"మా భవిష్యత్ ఏమిటో అర్ధం కావటం లేదు. ఎంత వరకు భరించగలమో అంత వరకు భరిస్తాము" అని చైయా అన్నారు.

పర్యాటక ప్రదేశమైన పహాల్గమ్‌లో కూడా పర్యటకులు ఎవ్వరూ లేరని పహాల్గమ్‌లో ఒక హోటల్ మేనేజర్ జావీద్ అహ్మద్ అన్నారు.

"మా దగ్గర 26 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మా యజమాని జీతాలు ఎలా ఇస్తారని", ప్రశ్నించారు.

పహాల్గమ్‌‌లో ఇంకొక హోటల్ మేనేజర్ ఇప్పటికే లక్షల రూపాయిల నష్టం వాటిల్లినట్లు తెలిపారు.

ఆర్టికల్ 370 నిర్మూలించిన తర్వాత కశ్మీర్‌లో ఇదే తోలి పర్యటక సీజన్.

భారత ప్రభుత్వం కశ్మీర్‌కి పర్యటకులను ఆకర్షించడానికి రోడ్ షోలు కూడా నిర్వహించింది.

మిగిలిన పర్యటక రంగాలలాగే శ్రీ నగర్లో బోటులను నడిపే శిఖరవాలాలు కూడా ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు.

హౌస్ బోట్

దాల్ సరస్సులో పర్యటకులను బోట్ విహారానికి తీసుకుని వెళ్లేవారిని శిఖరవాలాలు అంటారు.

ఆగష్టు 5వ తేదీ నుంచి ఇదే పరిస్థితి నెలకొని ఉందని శిఖరవాలా సంస్థ అధ్యక్షుడు గులాం అహ్మద్ మీర్ అన్నారు.

"కశ్మీర్లో ప్రత్యేక ప్రతిపత్తి తీయక ముందు ప్రభుత్వం అప్పటికే ఉన్న పర్యటకులను వెనక్కి తిరిగి పంపేసింది. కరోనా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రబలింది. ఇది మా మీద కూడా ప్రభావం చూపించిందని", అన్నారు.

పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. అయితే నేను కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న దగ్గర నుంచి గుల్మార్గ్ కి వెళ్లడం మానేశానని, మొహమ్మద్ షఫీ అనే ఫోటోగ్రాఫర్ చెప్పారు.

కశ్మీర్

నేను రోజుకి 400నుంచి 500 రూపాయిలు సంపాదించేవాడిని. ఇప్పుడు ఒక్క రూపాయి కూడా సంపాదన లేదు. ఇప్పుడు మా ప్రాణాలు నిలబెట్టుకోవడమే ప్రధానం అని అయన అన్నారు.

కరోనావైరస్ ప్రభావం ఒక్క కశ్మీర్ నే కాదు ప్రపంచం మొత్తం మీద ఉందని , కశ్మీర్ పర్యటక శాఖ డైరెక్టర్ నిసార్ అహ్మద్ అన్నారు.

ఇప్పుడు ప్రాణాలు కాపాడుకోవడమే మన ముందున్న పెద్ద సవాలు, ఇప్పటికే పర్యటక రంగానికి 70 శాతం నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు.

కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు జమ్మూ కశ్మీర్ యంత్రాంగం మార్చ్ 31 వరకు పూర్తి లాక్ డౌన్‌ని ప్రకటించింది.

వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)