ఉత్తరాంధ్ర మత్స్యకారులు: పాకిస్తాన్‌ జైలు నుంచి విడుదలై భారత్‌కు చేరుకున్న బాధితులు

ఉత్తరాంధ్ర మత్స్యకారులు

2018 నవంబర్ 28న తేదీన అరేబియా మహాసముద్రంలో వేటాడుతూ పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించారంటూ, పాకిస్తాన్ కోస్ట్‌గార్డ్ ఉత్తరాంధ్రకు చెందిన 20 మంది మత్స్యకారులను అరెస్టు చెసింది. దాదాపు 13 నెలల తర్వాత వీళ్లు మళ్లీ భారతదేశంలోకి అడుగు పెట్టారు.

ఉత్తరాంధ్ర మత్స్యకారులు

కరాచిలోని జైలు నుంచి పాకిస్తాన్ పోలీసు అధికారులు వీరిని వాఘా సరిహద్దు వరకు తరలించారు. అక్కడ పాకిస్తాన్ భద్రతాధికారులు ఈ మత్స్యకారుల్ని బీఎస్ఎఫ్ అధికారులకు అప్పగించారు.

ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, అధికారులు వాఘా-అటారి సరిహద్దు వద్ద వీరికి స్వాగతం పలికారు.

ఉత్తరాంధ్ర మత్స్యకారులు

శ్రీకాకుళం జిల్లాలో చేపల జెట్టీ లేకపోవడంతో మత్స్యకారులు ప్రతి ఏడాది ఆగస్టు నెలలో గుజరాత్‌లోని వీరావల్‌కు వలస వెళ్లి, అక్కడ బోట్లలో కూలీలుగా చేరి వేట సాగిస్తారు. ఇలా వేటాడుతూ పాకిస్తాన్ కోస్ట్‌గార్డ్‌కు చిక్కారు.

మొత్తం 20 మంది మత్స్యకారుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 13 మంది, విజయనగరం జిల్లాకు చెందిన ఆరుగురు ఉన్నారు. మిగతా ఒకరు ఎవరనేదానిపై ఇప్పటి వరకూ స్పష్టత లేదు.

ఉత్తరాంధ్ర మత్స్యకారులు

గుజరాత్‌లోని వీరావల్ నుంచి వీరంతా నాలుగు పడవలతో అరేబియా సముద్రంలో చేపల వేటకు బయల్దేరారు. మరో రెండు రోజుల్లో ఒడ్డుకు చేరుతామనగా వీరంతా పాక్‌ బందీలయ్యారు.

జీపీఎస్ విధానం ద్వారా సరిహద్దు తెలుసుకునే అవకాశం ఉన్నా మూడు బోట్లు పొరపాటున సరిహద్దులు దాటి పాక్ కోస్టుగార్డులకు చిక్కాయి.

ఉత్తరాంధ్ర మత్స్యకారులు

పాకిస్తాన్ మారీటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ(పీఎంఎస్ఏ) 20 మంది భారత మత్స్యకారులను అదుపులోకి తీసుకుంది.

కుసుమ్, అన్నపూర్ణ, కాజల్ అనే మూడు పడవలను పాక్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)