మేజర్ ప్రసాద్ మహాదిక్ చైనా సరిహద్దులో చనిపోయారు... భర్తనే స్ఫూర్తిగా తీసుకుని గౌరీ ప్రసాద్ ఇండియన్ ఆర్మీకి సెలెక్ట్ అయ్యారు

గౌరీ ప్రసాద్

గౌరీ ప్రసాద్ మహాదిక్. భారత సైన్యంలో పనిచేసిన మేజర్ ప్రసాద్ మహాదిక్ భార్య.

మేజర్ ప్రసాద్ మహాదిక్ సైన్యంలో ఉండగానే 2017లో భారత్-చైనా సరిహద్దుల్లో మరణించారు.

అయితే, భర్త చనిపోవడంతో తన భవిష్యత్ ఏమైపోతుందో అని గౌరి నిరుత్సాహపడలేదు. ఆయన నడిచిన బాటలోనే నడిచేందుకు సిద్ధమయ్యారు.

తన భర్త మేజర్ ప్రసాద్ మహాదిక్‌ లాగే గౌరీ ప్రసాద్ మహాదిక్ కూడా సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నారు.

వీడియో క్యాప్షన్, తాళి ఉంటే నా భర్త నాతోనే ఉన్నట్లుంటుంది

పోటీ పరీక్షల కోసం ఎంతో కష్టపడి చదివారు. ఒకే ఏడాదిలో ఆమె ఎస్ఎస్‌బీ (సర్వీస్ సెలెక్షన్ బోర్డ్) పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. అంతేకాదు, ఆ పరీక్షలో టాపర్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

ఆ పరీక్ష సమయంలో తన భర్తకు కేటాయించిన చెస్ట్ ప్లేట్ నెంబర్‌నే ఆమెకు కూడా కేటాయించారు.

గౌరీ, ప్రసాద్

అన్ని పరీక్షల్లోనూ ఉత్తీర్ణురాలైన గౌరీ 2020లో భారత సైన్యంలో చేరతారు. అంతకంటే ముందు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ తీసుకుంటారు.

భర్త మరణించినప్పటికీ గౌరీ ఇప్పటికీ తాళిని ధరిస్తున్నారు.

"తాళి నా మెడలో ఉంటే నా భర్త నాతోనే ఉన్నట్లుంటుంది" అని గౌరీ అంటారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)