కర్ణాటక పోలీస్: బరువు తగ్గకుంటే ఉద్యోగం ఊడుతుంది

ఫొటో సోర్స్, Getty Images
కర్ణాటకలో స్థూలకాయులైన పోలీసులు బరువు తగ్గకపోతే సస్పెన్షన్‌కు గురయ్యే పరిస్థితి వచ్చింది.
''గత 18 నెలల్లో రాష్ట్రానికి చెందిన 100 మంది పోలీసులు జీవనశైలి రుగ్మతల వల్ల చనిపోయారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం'' అని కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్(కేసీఆర్‌పీ) చీఫ్ భాస్కర్ రావు బీబీసీకి చెప్పారు.
స్థూలకాయంతో ఇబ్బందిపడుతున్న వారి సంఖ్య డిపార్ట్‌మెంట్లో పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
జీవనశైలి, ఆహారపు అలవాట్లు మార్చుకునేందుకు పోలీసులకు సాయం చేస్తామని ఆయన వివరించారు.
కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్(కేసీఆర్‌పీ)లో మొత్తంగా 14 వేల మంది పోలీసులు ఉన్నారు. రాష్ట్రంలో నిర్వహించే భారీ కార్యక్రమాలకు భద్రత కల్పించేందుకు, శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు పరిస్థితిని అదుపు చేసేందుకు ఈ బలగాలను వినియోగిస్తుంటారు.
కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్(కేసీఆర్‌పీ)లో స్థూలకాయులైన పోలీసులను సీనియర్ అధికారులు గుర్తిస్తారు. వారు బరువు తగ్గేలా శారీరక వ్యాయామాలు చేయిస్తారు.
''కేసీఆర్‌పీ పోలీసుల షుగర్ లెవల్స్‌ను, వారి ఆరోగ్యపరిస్థితిని 6 నెలలకు ఒకసారి పరిశీలిస్తున్నాం. ఇకపై ఎవరైనా ఆరోగ్యంపట్ల ఆశ్రద్ధగా ఉంటే వారిని సస్పెండ్ చేస్తాం. విధుల నుంచి తొలగిస్తాం'' అని భాస్కర్ రావు బీబీసీకి తెలిపారు.
భారత్‌లో పోలీసులు బరువు తగ్గడానికి కష్టపడుతుండటం అసాధారణమేమీ కాదు.
''గత 18 నెలల్లో 153 మంది సిబ్బంది చనిపోయారు. ఇందులో 24 మంది రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతే మరో 9 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మిగిలిన వారు జీవనశైలి రుగ్మతలు, షుగర్, గుండెపోటుతో చనిపోయారు. ఇదే మేం మేల్కోవడానికి సరైన సమయం అనిపించింది'' అని కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్(కేసీఆర్‌పీ) చీఫ్ చెప్పారు.
''బియ్యం సంబంధిత ఆహారాన్నే ఇక్కడి పోలీసులు ఎక్కుగా తీసుకుంటుంటారు. పొగతాగడం, మద్యపానం చేసేవారున్నారు. వ్యాయామం చేయడం లేదు. అందుకే ప్రతి పోలీసు బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) చెక్ చేయాలని మా పాటూన్ కమాండర్స్‌లను ఆదేశించాం'' అని ఆయన వెల్లడించారు.
స్థూలకాయులైన పోలీసులకు కేఎస్ఆర్‌పీ యోగా తరగతులు నిర్వహిస్తుంది. ఈత కొట్టడంలో శిక్షణ ఇస్తోంది.
ఇవి కూడా చదవండి:
- BBC Special: కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటక ప్రాంతంగా ఎందుకు మారింది?
- వ్యవసాయం: కనీస మద్దతు ధరల గురించి యువత తెలుసుకోవాల్సింది ఏంటి?
- స్పైడర్‌మ్యాన్ సహ సృష్టికర్త మృతి
- హెచ్ఐవీ వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందడుగు
- కొత్తగా పుట్టిన గ్రహం.. ఫొటోకి చిక్కింది
- సోషల్: అద్దె ఇంటికి ఎవరైనా అద్దె కట్టాల్సిందే కదా, మరి కులం అడగడం ఎందుకు?
- #లబ్‌డబ్బు: ఆన్లైన్లో ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయండి ఇలా..
- వీకెండ్లో విశ్రాంతి కోసం ఓ పది విషయాలు
- డ్రెస్‌కోడ్.. వారానికోసారి బట్టల్లేకుండా!
- ప్రపంచంలోనే కష్టమైన ప్రయాణం!
- ఇంతకూ మనం పది శాతం మెదడునే వాడుతున్నామా?
- థాయిలాండ్ గుహలో బాలలు.. ఒక్కొక్కరిదీ ఒక్కో కథ: ఆ అబ్బాయి తీసుకెళ్లిన ఆహారమే అందరి ఆకలి తీర్చింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








