గుజరాత్ సెక్స్ సీడీ: హార్దిక్ పటేల్‌పై ఆరోపణలతో ఎవరికి నష్టం?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాక్సీ గాగేద్కర్ ఛారా
- హోదా, బీబీసీ గుజరాతీ ప్రతినిథి
గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరు తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో లీక్ అయిన ఓ వీడియో సీడీ దుమారం రేపుతోంది.
ఈ వీడియోలో పాటీదార్ అనామత్ ఆందోళన్ సమితి కన్వీనర్ హార్దిక్ పటేల్ ఉన్నారని అంటున్నారు. ఆ వీడియోలో హార్దిక్ పటేల్ ఓ రూమ్‌లో ఒక గుర్తు తెలియని అమ్మాయితో కలిసి కనిపిస్తున్నారు.
ఈ వీడియోలో అమ్మాయితో కలిసి ఉన్న వ్యక్తి హార్దిక్ పటేలేనని మరో పాటీదార్ నేత అశ్విన్ పటేల్ ఆరోపించారు.
అయితే హార్దిక్ పటేల్ మాత్రం ఇది నకిలీ వీడియో అని అన్నారు. నీచ రాజకీయాల్లో ఇది కూడా ఓ భాగమని, అందుకే మహిళలను కించపరిచే విధంగా ఇలాంటి వీడియోలు తయారు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
"ఆ వీడియోలో ఉన్నది నేను కాదు. బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోంది. మహిళల పరువును రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోంది" అని హార్దిక్ పటేల్ గాంధీనగర్‌లో మీడియాతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలు సెక్స్ స్కాండల్ సీడీల సంగతేంటి?
ఎన్నికలకు ముందు ఇలాంటి సీడీలు బయటకు రావడంలో ఆశ్చర్యమేమీ లేదని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రంలోని ప్రొఫెసర్‌గా పనిచేసిన ఘన్‌శ్యామ్ షా తెలిపారు.
"వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇలాంటి సీడీలు ముందుకు రావడం కొత్త విషయమేమీ కాదు. గతంలో ఎందరో రాజకీయ నాయకులు ఇలాంటి సీడీలను బయటపెట్టారు" అని ప్రొఫెసర్ ఘన్‌శ్యామ్ తెలిపారు.
2005లో బీజేపీ నాయకుడు సంజయ్ జోషి సెక్స్ సీడీ కూడా బయటికి వచ్చింది. కానీ ఆ తర్వాత మధ్య ప్రదేశ్ పోలీసులు సంజయ్ జోషి నిర్దోషి అని ప్రకటించారు.
ఈ వీడియోతో హార్దిక్ పటేల్ కన్నా ఆ వీడియోలో కనిపిస్తున్న మహిళ పరువుకే ఎక్కువ భంగం వాటిల్లుతుందని ప్రొఫెసర్ షా అన్నారు.
ఈ విషయంపై కాంగ్రెస్, బీజేపీ నాయకులతోపాటు పలువురు సామాజికవేత్తలతో బీబీసీ మాట్లాడింది.

ఫొటో సోర్స్, Getty Images
మహిళలు రాజకీయాల్లోకి రారు !
ఓ మహిళను కావాలని ఇరికిస్తూ వివాదం సృష్టించడం తప్పని అందరూ అన్నారు.
ఇలాంటి ఘటనలు జరిగితే రాజకీయాల్లోకి మహిళలు రారని గుజరాత్ విశ్వవిద్యాలయంలోని సామాజికశాస్త్ర విభాగ అధిపతి ఆనందీ బేన్ పటేల్ తెలిపారు.
ఇలాంటి ఘటనలతో ప్రజా జీవితంలో ముందుకు రావాలనుకునే మహిళల విశ్వాసం దెబ్బతింటుందని ఆమె తెలిపారు.
ఈ వీడియో ద్వారా మహిళలను కించపరుస్తున్నారని గుజరాత్ కాంగ్రెస్ మహిళా మోర్చా నాయకురాలు సోనల్ పటేల్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒకవేళ ఆ వీడియోలో హార్దిక్ పటేల్ ఉన్నా అది ఆయన వ్యక్తిగత విషయమని ఆమె తెలిపారు.
హార్దిక్ పటేల్ ప్రత్యర్థులకు మరే ఇతర అవకాశం దొరక్కపోవడంతో వారు మహిళలను కించపరచే విధంగా ఇలాంటి వీడియోలు తయారు చేస్తున్నారని సోనల్ పటేల్ తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈ వీడియోను బీజేపీనే సృష్టించిందని హార్దిక్ పటేల్ ఆరోపించారు.
అయితే గుజరాత్ బీజేపీ ఉపాధ్యక్షురాలు జసూ బేన్ కోరాత్ ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. ఏ పార్టీ కూడా ఇలాంటి చర్యలను సహించదని ఆమె అన్నారు. గుజరాత్ లోని సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన బీజేపీ ముఖ్య నేతల్లో జసూ బేన్ కోరాత్ ఒకరు.
మా ఇతర కథనాలు:
- డ్రెస్‌కోడ్.. వారానికోసారి బట్టల్లేకుండా!
- మత్తు మందుల్ని మించిన వ్యసనం
- 'మా ఆయన పోర్న్ చూస్తారు.. నన్నూ అలాగే చేయమంటారు’
- అబ్బాయిలు ‘ఆ’ చిత్రాలను నెట్లో పెట్టలేరు!
- 2002 అల్లర్ల తర్వాత గుజరాత్ ముస్లింలలో మార్పొచ్చిందా?
- ఈ ఏడు ప్రశ్నలకు గుజరాత్ సీఎం ఏం చెప్పారు?
- గుజరాత్ ప్రచార బరిలో యూపీ సీఎం యోగి
- మోదీ లేదా రాహుల్... విదేశాల్లో ఎవరు పాపులర్?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








