వైఎస్సార్‌సీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదు - ఎన్నికల సంఘం
ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆపార్టీ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయంపై ఎన్నికల కమిషన్ అభ్యంతరం చెప్పింది. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ని ఎన్నుకోవడం చెల్లదని తెలిపింది. ఈ మేరకు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది.
లైవ్ కవరేజీ
ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో తిరిగి మళ్లీ రేపు ఉదయం కలుద్దాం
పాకిస్తాన్: అంటువ్యాధుల సంక్షోభంలో చిక్కుకుంటుందా?
వైఎస్సార్‌సీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదు - ఎన్నికల సంఘం, వడిశెట్టి శంకర్, బీబీసీ కోసం

ఫొటో సోర్స్, facebook/ysrcpofficial
ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆపార్టీ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయంపై ఎన్నికల కమిషన్ అభ్యంతరం చెప్పింది. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ని ఎన్నుకోవడం చెల్లదని తెలిపింది. ఈ మేరకు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది.
జూలై 8,9 తేదీలలో మంగళగిరి సమీపంలో ఆ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరిగాయి. ఆ సందర్భంగా రెండో రోజు నిర్వహించిన సమావేశాల్లో పార్టీ రాజ్యాంగం సవరిస్తున్నట్టు తీర్మానం చేశారు. ఆ వెంటనే ఈ ఎన్నిక జరిగింది.
వైఎస్ జగన్ ని పార్టీ శాశ్వత అధ్యక్ష హోదాలో ఎన్నుకుంటూ విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ప్లీనరీలో ఆమోదించారు. అదే నెల 22న ఈసీకి ఈ వివరాలు తెలియజేశారు. కానీ వివరణ కోరుతూ ఆగష్టు 1, 5, తేదీలలో ఎన్నికల సంఘం లేఖలు రాసినా ఆపార్టీ నుంచి తగిన స్పందన లేదని తెలిపింది. ఆగష్టు 23నాడు పార్టీ తరుపున అందిన లేఖలో అంశాలు చెల్లవని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు కూడా నిర్ధిష్ట కాలపరిమితిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంది. శాశ్వత అధ్యక్షుడు అన్నది ప్రజాస్వామ్య విరుద్దం అంటూ ప్రస్తావించింది. పార్టీలకు తరచూ ఎన్నికలు జరగాలని తెలిపింది.
శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఎన్నికల సంఘం నియమాలకు విరుద్దం అని స్పష్టం చేసింది.
వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్న వైసీపీ..
వైసీపీ నాయకత్వం ఈసీకి తెలియజేసిన అంశాలు ఆసక్తిగా ఉన్నాయి. తమ పార్టీ రాజ్యాంగాన్ని ఫిబ్రవరిలో సవరించినట్టు పేర్కొనడం విశేషం. దానిపై మీడియాలో కథనాలు వచ్చాయని తెలిపినట్టు ఈసీ ప్రస్తావించడం ఆసక్తిగా కనిపిస్తోంది. ఆ కథనాలపై విచారణ చేస్తున్నామని, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానమని వైసీపీ పేర్కోన్నట్టు ఈసీలో లేఖలో ఉండడం చర్చనీయాంశం అవుతోంది. వైసీపీ వాదనను తోసిపుచ్చుతూ ఈసీ స్పష్టత కోరింది.
పార్టీ అంతర్గత విచారణ చేసి వెంటనే స్పందించాలని కోరింది. త్వరగా దీనిపై స్పష్టతనిస్తూ బహిరంగ ప్రకటన చేయాలని ఆదేశించింది. అస్సష్టత తొలగించేలా చర్యలుండాలని ఎన్నికల సంఘం తెలిపింది.
శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నిక అనేది సమంజసం కాదని, ఇలాంటివాటిపై స్పష్టత ఇవ్వకపోతే ఇతర పార్టీల్లో గందరగోళం నెలకొంటుందని, దీనిని మిగతా పార్టీలు కూడా అనుసరించే ప్రమాదం ఉంటుందని పేర్కొంది.
జగన్ మోహన్ రెడ్డి ని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్న తీరు మీద సమాధానం కోరినా స్పందించకపోవడం పట్ల ఈసీ సీరియస్ అయ్యింది. శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికను అంగీకరించడమా లేదా తిరస్కరించడమా అన్నది తేల్చుకుండా తాత్సార్యం చేయడాన్ని నిలదీసింది. ఈసీ లేఖలోని అంశాలపై పార్టీలో అంతర్గతంగా చర్చించి, వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని వైసీపీ పేర్కొనడం గమనార్హం.
రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి, మైదానంలో ప్రవర్తన గురించి చర్చ ఎందుకు?
OSCAR: అమెరికన్ సినిమాల అవార్డులకు ఇంత క్రేజ్ ఎలా వచ్చింది? ఆస్కార్‌లో విదేశీ చిత్రాల ఎంట్రీకి నిబంధనలు ఏమిటి?
విమెన్ టీ20 ఆసియాకప్‌కు ఎంపికైన తెలుగు అమ్మాయి

ఫొటో సోర్స్, Kalpana
ఫొటో క్యాప్షన్, క్రికెటర్ సబ్బినేని మేఘన విమెన్ టీ20 ఆసియా కప్‌కు టీం ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన సబ్బినేని మేఘన తుది జట్టులో స్థానం దక్కించుకుంది.
హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధన(వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, షఫాలీ వర్మ, జెమీమా రొడ్రిగ్యూస్, సబ్బినేని మేఘన, రీచ ఘోష్(వికెట్ కీపర్), స్నేహ రాణ, దయాలన్ హేమలత, మేఘన సింగ్, రేణుక ఠాకుర్, పూజ వస్త్రకర్, రాజేశ్వరి గైక్వాడ్, రాధ యాదవ్, కేపీ నవ్గిరే
స్టాండ్ బై ప్లేయర్స్: తానియా సప్న భాటియా, సిమ్రన్ దిల్ బహుదూర్
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కాకినాడ: ‘గర్బిణి అని నమ్మించారు, తొమ్మిది నెలల తర్వాత డెలివరీకి వెళితే గర్భంలో శిశువు లేదన్నారు’.. ప్రైవేటు ఆసుపత్రిపై పోలీసులకు ఫిర్యాదు
‘సిజేరియన్ చేయాలంటే హరీశ్ రావు నుంచి లెటర్ తెమ్మన్నారు, నార్మల్ డెలివరీ సమయంలో నా భార్య చనిపోయింది’
వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్సిటీగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ ప్రవేశపెట్టిన బిల్లును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించింది.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ ప్రవేశపెట్టిన బిల్లును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించింది.
నేడు కొన్ని గంటలపాటు ఈ బిల్లు మీద మంత్రులు, ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో మాట్లాడారు.
తాము ఎందుకు వైఎస్‌ఆర్ పేరు పెడుతున్నామో వారు వివరించారు.
అసెంబ్లీ ప్రారంభం కాగానే తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పునకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు.
దీంతో అధికారిక, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకుని సభలో గందరగోళం నెలకొంది.
చివరకు తెలుగు దేశం పార్టీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు.
పుతిన్: ‘అణ్వాయుధాలు చూపి మమ్మల్ని భయపెడుతున్నారు... మా వద్దా తగిన ఆయుధాలున్నాయి’

ఫొటో సోర్స్, Russian Presidential Press Service
రష్యా సైన్యంలోకి 3 లక్షల మంది ‘రిజర్విస్టు’లను తిరిగి పిలవనున్నట్లు ఆ దేశ రక్షణశాఖ మంత్రి తెలిపారు.
గతంలో సైన్యంలో పని చేసి ప్రస్తుతం పౌర జీవితంలో ఉన్నవారిని ‘రిజర్విస్టులు’ అంటారు.
వీరి సేవలు యుక్రెయిన్ యుద్ధంలో ఉపయోగించుకోనున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.
యుక్రెయిన్‌లోని దోన్బస్ రీజియన్‌లో గల తమవారిని రక్షించుకోవడం రష్యా బాధ్యతని పుతిన్ అన్నారు.
అలాగే దేశంలో ఆయుధాల ఉత్పత్తిని పెంచేందుకు నిధుల కేటాయింపును పెంచారు.
యుక్రెయిన్‌లోని రష్యా నియంత్రణలోని గల భూభాగాల్లోని ప్రజలు ‘నియో నాజీల పాలనలో ఉండాలని కోరుకోవడం లేదు’ అని పుతిన్ అన్నట్లు రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.
పశ్చిమ దేశాలను తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నాయని పుతిన్ అన్నారు. కానీ ఆ బెదిరింపులను ఎదుర్కొనే ఆయుధ సంపత్తి తమ వద్ద ఉందని స్పష్టం చేశారు.
అణ్వాయుధాలను చూపిస్తూ తమను పశ్చిమ దేశాలు బ్లాక్ మెయిల్ చేస్తున్నాయని, అయితే వారికి సమాధానం చెప్పడానికి ‘మా వద్ద చాలా ఆయుధాలున్నాయి’ అని ఆయన హెచ్చరించారు.
నేడు జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు పుతిన్ సిద్ధంగా ఉన్నారని తాజాగా టర్కీ అధ్యక్షుడు ఎర్దోవాన్ వ్యాఖ్యానించారు.
ఇంతలో పుతిన్ యుక్రెయిన్‌కు అదనంగా బలగాలు పంపుతున్నట్లు ప్రకటించారు.
ఇరాన్ నిరసనలు: హిజాబ్‌లను తగులబెడుతున్న మహిళలు
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పునకు నిరసనగా యార్లగడ్డ రాజీనామా

ఫొటో సోర్స్, Facebook/ LakshmiPrasad Yarlagadda
ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా చేశారు.
హెల్త్ యూనివర్సిటీకి వైస్సార్ పేరు పెట్టడం చాలా బాధాకరమని, ఎన్‌టీఆర్ పేరు తొలగించడం సరైన నిర్ణయం కాదని ఆయన అన్నారు.
అన్నం, చపాతి తినకూడదంటే ఏం తినాలి, పిండిపదార్థాలతో ఆరోగ్యానికి ప్రమాదమా
బాలీవుడ్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ మృతి

ఫొటో సోర్స్, Getty Images
బాలీవుడ్ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ(58) చనిపోయారు.
అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొంతకాలంగా దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.
1980ల నుంచి రాజు శ్రీవాస్తవ సినిమాల్లో నటిస్తున్నారు. 2005లో ‘ది గ్రేట్ ఇండియన్ లాఫర్ చాలెంజ్’తో ఆయనకు బాగా పేరు వచ్చింది.
ఆయన ఉత్తర్ ప్రదేశ్ ఫిలిం డెవల్మెంట్ కౌన్సిల్ చైర్మన్‌గా కూడా పని చేశారు.
‘బాజీగర్’, ‘మైనే ప్యార్ కియా’ వంటి సినిమాల్లో ఆయన నటించారు.
రాజు శ్రీవాస్తవ మృతి మీద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విచారం వ్యక్తం చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
చిత్తూరు: పేపర్ ప్లేట్ తయారీ కేంద్రంలో మంటలు... ముగ్గురు మృతి
మంగళవారం అర్ధరాత్రి చిత్తూరు జిల్లాలోని ఒక పేపర్ ప్లేట్ తయారీ కర్మాగారంలో మంటలు చెలరేగి ముగ్గురు చనిపోయినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.
మంటలు చెలరేగడానికి కారణాల మీద విచారణ జరుగుతోందని చిత్తూరు పోలీసులు తెలిపారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
వినాయక చవితికి రోడ్డు మీద గుంతలు తవ్వినందుకు జరిమాన

వినాయక చవితి సందర్భంగా రోడ్లను తవ్వినందుకు లాల్‌బగ్చా రాజా సర్వజనీక్ గణేశోత్సవ్ మండల్‌కు జరిమానా విధించింది ముంబయి మున్సిపల్ కార్పొరేషన్.
రోడ్డు మొత్తం 183 గుంతలు తవ్వినందుకు గుంతకు 2,000 రూపాయల చొప్పున మొత్తం 3.66 లక్షల రూపాయలు ఫైన్ విధించారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మియన్మార్‌లో స్కూల్ మీద సైనిక దాడి... 11 మంది పిల్లలు మృతి

ఫొటో సోర్స్, Social Media/Reuters
ఉత్తర మియన్మార్‌లో ఒక స్కూలు మీద సైనిక హెలికాప్టర్ కాల్పులు జరపడంతో సుమారు 11 మంది పిల్లలు చనిపోయారని యూనిసెఫ్ తెలిపింది.
రెబల్స్ పట్టులో ఉన్న సగాయింగ్ రీజియన్‌లో గల ఒక టెంపుల్ స్కూల్ మీద మియన్మార్ ఆర్మీ కాల్పులు జరిపిందని యూనిసెఫ్ వెల్లడించింది.
చిన్నారుల నుంచి టీనేజ్ పిల్లల వరకు ఆ పాఠశాలలో చదువుకుంటున్నారు.
అయితే ఆ స్కూల్లో దాక్కుని ఉన్న తిరుగుబాటుదారుల మీద తాము దాడి చేశామని మియన్మార్ మిలిటరీ తెలిపింది.
అదే రోజు ఆరుగురు గ్రామస్థులను సైనికులు కాల్చివేసినట్లు బీబీసీ బర్మీస్ తెలిపింది.
సౌత్ ఇండియాతో నార్త్ ఇండియా అభివృద్ధిలో పోటీ పడలేకపోతుందా
తిరుమల తిరుపతికి ముస్లింల కోటి రూపాయల విరాళం
తమిళనాడుకు చెందిన ముస్లిం దంపతులు సుబీనా బాను, అబ్దుల్ ఘనీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సుమారు కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు.
ఇందులో 87 లక్షల రూపాయల విలువైన ఫర్నీచర్, ఇతర సామానులను కొత్తగా కట్టిన పద్మావతి రెస్ట్ హౌస్ కోసం ఇచ్చారు.
మరొక 15 లక్షల రూపాయలను ఎస్‌వీ అన్న ప్రసాదం ట్రస్టుకు ఇచ్చారు.