పంజాబ్: విజిలెన్స్ రైడ్స్ సమయంలో ఐఏఎస్ కుమారుడి మృతి, వాళ్లే హత్య చేశారని ఆరోపించిన తల్లి

బీజేపీ నేత మంజీందర్ సింగ్ సిర్సా ట్విటర్‌లో షేర్ చేసిన ఒక వీడియోలో సంజయ్ కుటుంబ సభ్యులు, వీళ్లే మా అబ్బాయిని చంపారు అని అనడం వినిపిస్తోంది.

లైవ్ కవరేజీ

  1. ఎమర్జెన్సీ: 'సంజయ్ గాంధీని ఎదిరించే ధైర్యం ఆరోజుల్లో ఎవరికీ ఉండేది కాదు'

  2. జూలై 1: కొత్త కార్మిక చట్టాలతో ఉద్యోగుల జీవితాల్లో, జీతాల్లో వచ్చే మార్పులు ఇవీ...

  3. తీస్తా సెతల్వాద్: అహ్మదాబాద్‌కు తరలించిన ఏటీఎస్, అక్కడ ఆమె ఏమన్నారంటే...

  4. నేటి ముఖ్యాంశాలు

    • గుజరాత్ యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) శనివారం నాడు ముంబయిలోని సామాజిక హక్కుల ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్ ఇంటికి వెళ్ళి ఆమెను అదుపులోకి తీసుకుని శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించిందని వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
    • ‘అగ్నిపథ్’‌ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధ్వంసానికి పాల్పడిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయి డిఫెన్స్ అకాడమీ యజమాని ఆవుల సుబ్బారావుకు రైల్వే కోర్టు రిమాండ్ విధించింది.
    • బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు.
    • తుపాకీ నియంత్రణ (గన్ కంట్రోల్) బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. గత 30 సంవత్సరాలలో ప్రవేశపెట్టిన అత్యంత ముఖ్యమైన ఆయుధ చట్టం ఇది.
    • అమెరికాలో అబార్షన్ల చట్టబద్ధతను అక్కడి సుప్రీంకోర్టు కొట్టివేసిన తరువాత అబార్షన్ క్లినిక్కులు మూతపడుతున్నాయి.
    • కేరళలోని వయనాడ్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కార్యాలయంపై శుక్రవారం జరిగిన దాడిని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఖండించారు. ఈ కేసులో బాధ్యులైన వారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు.

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్‌పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

  5. దళిత రైతు పొలంలోకి మురుగు నీరంతా వదిలేశారు

  6. పంజాబ్: విజిలెన్స్ రైడ్స్ సమయంలో ఐఏఎస్ కుమారుని మృతి

    సంజయ్ పోప్లీ కుటుంబ సభ్యులు

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, సంజయ్ పోప్లీ కుటుంబ సభ్యులు

    పంజాబ్‌ ఐఏఎస్ అధికారి సంజయ్ పోప్లీ కుమారుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు.

    శనివారం విజిలెన్స్ బృందం మరోసారి దర్యాప్తు చేయడం కోసం సంజయ్ ఇంటికి చేరుకుంది.

    ‘‘ఒక కేసులో దర్యాప్తు కోసం విజిలెన్స్ బృందం సంజయ్ ఇంటికి చేరుకుంది. టీమ్ ఇక్కడికి వచ్చినప్పుడు గన్‌తో కాల్చినట్లు ఒక శబ్ధం వినిపించింది. తర్వాత సంజయ్ పోప్లీ కుమారుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది’’ అని ఎస్‌ఎస్పీ కుల్దీప్ చహల్‌ను ఉటంకిస్తూ వార్తా ఏజెన్సీ ఏఎన్‌ఐ తెలిపింది.

    అదే సమయంలో విజిలెన్స్ బృందమే కాల్చి చంపిందని సంజయ్ కుటుంబం ఆరోపించింది.

    బీజేపీ నేత మంజీందర్ సింగ్ సిర్సా ట్విటర్‌లో షేర్ చేసిన ఒక వీడియోలో సంజయ్ కుటుంబ సభ్యులు, వీళ్లే మా అబ్బాయిని చంపారు అని అనడం వినిపిస్తోంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    అవినీతి ఆరోపణలతో గత వారమే సంజయ్ పోప్లీని పంజాబ్ విజిలెన్స్ బ్యూరో అరెస్ట్ చేసింది.

    ‘‘విజిలెన్స్ టీమ్, సంజయ్ కుమారుడిని పై అంతస్తులోకి తీసుకెళ్లింది. మేం అప్పుడు కింది అంతస్థులో ఉన్నాం. కాసేపటి తర్వాత గన్ శబ్ధం వినిపించింది. విజిలెన్స్ బృందమే చంపేసింది’’ అని సంజయ్ పోప్లీ బంధువు అను ప్రీత్ కులర్ చెప్పినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    వార్తా సంస్థ ఏఎన్‌ఐ ప్రకారం, ఐఏఎస్ సంజయ్ పోప్లీ ఇంటి నుంచి శనివారం బంగారు, వెండి నాణేలతో పాటు డబ్బు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 3

  7. ఎమర్జెన్సీ: ఇందిరాగాంధీ ఇద్దరు మహారాణులను జైలుకు ఎందుకు పంపారు, అప్పుడేం జరిగింది?

  8. బ్రేకింగ్ న్యూస్, తీస్తా సెతల్వాద్‌ను ముంబయిలో అదుపులోకి తీసుకున్న గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్

    తీస్తా సెతల్వాద్

    గుజరాత్ యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) శనివారం నాడు ముంబయిలోని సామాజిక హక్కుల ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్ ఇంటికి వెళ్ళి ఆమెను అదుపులోకి తీసుకుని శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించిందని వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.

    2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల గురించి తీస్తా సెతల్వాద్ నిరాధారమైన విషయాలు చెబుతున్నారని హోం మంత్రి అమిత్ షా ఏఎన్ఐ ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని గంటలకే ఏటీఎస్ ఆమెను అదుపులోకి తీసుకుంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    సెతల్వాద్‌ను అదుపులోకి తీసుకున్న తరువాత శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్ నుంచి గుజరాత్ పోలీసులు వెళ్లిపోతున్న దృశ్యాన్ని ఈ ఏఎన్ఐ ట్వీట్‌లో చూడవచ్చు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    శనివారం ఉదయం 10.07 గంటలకు ఏఎన్ఐ భారత హోం మంత్రి అమిత్ షా ఇంటర్వ్యూలో 30 సెకండ్ల వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో అమిత్ షా, 'తీస్తా సెతల్వాద్ ఆధ్వర్యంలోని స్వచ్ఛంద సంస్థ (ఎన్‌జీఓ) బీజేపీ కార్యకర్తల గురించి అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసింది. ఆ ఫిర్యాదులన్నింటినీ వాస్తవాలుగా భావిస్తూ మీడియా నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చింది' అని వ్యాఖ్యానించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 3

  9. అనంతపురం: 'మా అమ్మే కిరాయి హంతకులతో నా భర్తను చంపించింది' - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

  10. అమెరికా: అబార్షన్ హక్కును రద్దు చేసిన రోజున ఓ క్లినిక్‌లో వాతావరణం ఎలా ఉందంటే...

  11. కోవిడ్-19: రెండు డోసుల వ్యాక్సీన్ తీసుకున్న వారికి, తీసుకోని వారికి కరోనావైరస్ లక్షణాలలో వ్యత్యాసం ఉందా

    covid

    ఫొటో సోర్స్, Getty Images

    జలుబు, తలనొప్పి, తుమ్ములు, గొంతు నొప్పి, ఆగకుండా వచ్చే దగ్గు.. ఇవి వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కోవిడ్-19 సోకిన వారిలో సాధారణంగా కనిపించే లక్షణాలు.

    అయితే, వ్యాక్సీన్లు తీసుకోని వారిలో ఈ లక్షణాలు కాస్త భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎక్కువ మంది తమకు తొలనొప్పి ప్రధానంగా ఉందని చెబుతున్నారు. ఆ తర్వాత గొంతు నొప్పి, జలుబు, జ్వరం, దగ్గు కూడా ఉన్నాయని అంటున్నారు.

  12. చైనాలో మహిళలపై పెరుగుతున్న హింస, వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం

  13. అమెరికా: అబార్షన్‌‌లపై నిషేధం - ఏయే రాష్ట్రాలలో ఎలా ఉంది

  14. అగ్నిపథ్: సికింద్రాబాద్ హింస కేసులో ఆవుల సుబ్బారావుకు రిమాండ్ విధించిన రైల్వే కోర్టు

    ‘అగ్నిపథ్’‌ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధ్వంసానికి పాల్పడిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయి డిఫెన్స్ అకాడమీ యజమాని ఆవుల సుబ్బారావుకు రైల్వే కోర్టు రిమాండ్ విధించింది.

    ఈ కేసులో సుబ్బారావుతో పాటు ఆయన అకాడమీలో పనిచేసే శివ కుమార్, మల్లారెడ్డి, బీసి రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి రైల్వే కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.

    అనంతరం పోలీసులు సుబ్బారావుతో పాటు మిగతా ముగ్గురిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

    కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆవుల సుబ్బారావు 2011 వరకు ఆర్మీలోనే పనిచేశారని, ఆర్మీలో ఆయన నర్సింగ్ అసిస్టెంట్‌గా పనిచేశారని సికింద్రాబాద్ జీఆర్పీ ఎస్పీ మీడియాకు తెలిపారు.

    2014లో ఆయన గుంటూరు జిల్లా నరసరావుపేటలో సాయి డిఫెన్స్ అకాడమీ ప్రారంభించారని రైల్వే పోలీసులు చెప్పారు.

    Avula Subbarao

    ఫొటో సోర్స్, UGC

  15. Emergency: ‘అక్రమ నిర్బంధానికి బలైన’ స్నేహలతారెడ్డి జైలు డైరీ

    స్నేహలతారెడ్డి, ఎమర్జెన్సీ

    ఫొటో సోర్స్, NANDANAREDDY, ఎమర్జెన్సీ

    ఫొటో క్యాప్షన్, స్నేహలతారెడ్డి

    ‘‘ఒక మహిళ లోపలికి రాగానే.. అందరి ముందూ ఆమె దుస్తులు విప్పి నగ్నంగా నిలబెడతారు. ఒక మనిషిని జైలులో పెట్టినపుడే అతడు కానీ ఆమె కానీ శిక్ష అనుభవిస్తున్నట్లే. ఇంకా ఆ మనిషి శరీరాన్ని కూడా ఇలా దిగజార్చి అవమానించి తీరాలా?‘‘

    ఒక డైరీలో అక్షరబద్ధం చేసిన చీకటి చరిత్రలోని ఒక ప్రశ్న ఇది. అది ఒక మహిళ డైరీ. అది జైలులో రాసిన డైరీ. జైలు డైరీ. 46 సంవత్సరాల కిందట ‘ఎమర్జెన్సీ’ కాలంలో జైలు నిర్బంధంలో ఉన్న ఒక మహిళ రాసిన డైరీ. ఆ చీకటి చరిత్రకు సాక్షిగా నిలిచి బలైన ఓ వనిత ఆమె.

    ఆమె పేరు స్నేహలతారెడ్డి. స్నేహగా.. స్నేహలతగా ఆమె సుపరిచితం. నర్తకిగా ఖ్యాతి గడించారు. నటిగా ప్రశంసలందుకున్నారు. పౌర హక్కుల ఉద్యమంలో ఒక కార్యకర్తగా భాగమయ్యారు. ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించారు.

  16. ద్రౌపది ముర్ముకు మద్దతిస్తున్నట్లు ప్రకటించిన మాయవతి

    మాయవతి

    ఫొటో సోర్స్, Getty Images

    బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు.

    ఇది బీజేపీ లేక ఎన్‌డీఏకు అనుకూలంగానో, ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగానో తీసుకున్న నిర్ణయం కాదని, తమ పార్టీ సిద్ధాంతాలను, ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయమని ఆమె స్పష్టం చేశారు.

    ఆదివాసీ మహిళకు, కష్టపడి పైకొచ్చిన వ్యక్తికి మద్దతిస్తున్నామని మాయవతి ఏఎన్ఐతో చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  17. అగ్నిపథ్: సైన్యంలో ఉద్యోగాల కోసం పుట్టుకొచ్చిన కోచింగ్ సెంటర్లు, విద్యార్థుల కలలు కల్లలేనా

  18. మహారాష్ట్ర రిసార్ట్ రాజకీయాలు: ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడైనా ఇలాంటివి జరిగాయా? ఈ లగ్జరీ హోటళ్లలో ఎమ్మెల్యేలు ఏం చేస్తారు

    భారత్‌లో అసెంబ్లీల దగ్గర మొదలైన రాజకీయాలు ఇప్పుడు ఖరీదైన హోటళ్ల చుట్టూ తిరుగుతున్నాయి.

    భారత్‌లోని సుసంపన్న రాష్ట్రం మహారాష్ట్ర ఇప్పుడు రిసార్టు రాజకీయాలకు వేదికైంది. 40 మందికి పైగా శివసేన శాసనసభ్యులతో ఏక్‌నాథ్ శిందే ఈశాన్య రాష్ట్రం అస్సాంలోని గువాహటి నగరంలో మకాం వేసిన సంగతి తెలిసిందే.

    భారత్‌లో ఏ పార్టీ అయినా అసెంబ్లీలో తమ ఆధిక్యాన్ని నిరూపించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయొచ్చు. అయితే, ఆధిక్యం కంటే తక్కువ సీట్లు వచ్చినప్పుడు, లేదా సంకీర్ణంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినప్పుడు.. ప్రభుత్వాలు కూలిపోయే ముప్పు ఎక్కువ ఉంటుంది. ప్రత్యర్థి పార్టీలు అసంతృప్త నేతలకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తుంటాయి.

    ఇలాంటి పరిణామాలే ‘‘రిసార్టు రాజకీయాలు’’కు కారణం అవుతాయి. వీటిలో భాగంగా రాజకీయ పార్టీలు తమ శాసన సభ్యులను రిసార్టు లేదా హోటల్‌కు తీసుకెళ్తుంటాయి. ఇతర పార్టీల్లోకి, ప్రత్యర్థి క్యాంప్‌లోకి వెళ్లకుండా అక్కడ పక్కాగా నిఘా పెడుతుంటారు.

    మహారాష్ట్ర

    ఫొటో సోర్స్, BBC MARATHI

  19. గన్ కంట్రోల్ బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం

    అమెరికా

    ఫొటో సోర్స్, REUTERS

    తుపాకీ నియంత్రణ (గన్ కంట్రోల్) బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. గత 30 సంవత్సరాలలో ప్రవేశపెట్టిన అత్యంత ముఖ్యమైన ఆయుధ చట్టం ఇది.

    ఈ చట్టం, తుపాకీలు కొనుగోలు చేసే యువతపై కఠినమైన తనిఖీలను ఆదేశిస్తుంది. అలాగే, ముప్పుగా భావించే వ్యక్తుల నుంచి తుపాకీలను తొలగించే దిశగా రాష్ట్రాలను ప్రోత్సహిస్తుంది.

    అమెరికా కాంగ్రెస్‌లో గన్ కంట్రోల్ బిల్లుకు డెమొక్రాట్స్‌తో పాటు రిపబ్లికన్ల నుంచి కూడా మద్దతు లభించింది. 14 మంచి రిపబ్లికన్లు దీనికి మద్దతుగా ఓటు వేయడంతో 234 నుంచి 193 ఓట్ల తేడాతో ఈ బిల్లు పాస్ అయింది.

    ఈ బిల్లును అధ్యక్షుడు జో బైడెన్‌కు పంపించారు. ఆయన దీని మీద సంతకం చేయగానే చట్టబద్ధమవుతుంది.

    గత నెలలో న్యూయార్క్‌లోని బఫెలో సూపర్ మార్కెట్‌లో, టెక్సస్‌లో ఉవాల్డేలోని ఒక ప్రాథమిక పాఠశాలలో జరిపిన కాల్పుల్లో 31 మంది మరణించారు. దాంతో గన్ కంట్రోల్ బిల్లుకు మద్దతు పెరిగింది.

  20. అమెరికా: మూతబడుతున్న అబార్షన్ క్లినిక్కులు

    అబార్షన్
    ఫొటో క్యాప్షన్, లిటిల్ రాక్‌లోని సిబ్బంది అపాయింట్‌మెంట్‌లను రద్దు చేసినట్లు ఫోన్ ద్వారా చెబుతున్నారు.

    అమెరికాలో అబార్షన్ల చట్టబద్ధతను అక్కడి సుప్రీంకోర్టు కొట్టివేసిన తరువాత అబార్షన్ క్లినిక్కులు మూతపడుతున్నాయి.

    దాదాపు 50 ఏళ్ళ కిందట అబార్షన్‌ను దేశవ్యాప్తంగా చట్టబద్ధం చేస్తూ వెలువడిన తీర్పును శుక్రవారం అమెరికా సుప్రీం కోర్టు కొట్టి వేసింది.

    దాదాపు సగం రాష్ట్రాలు ఈ మేరకు కొత్త నిబంధనలు, నిషేధాలు ప్రవేశపెట్టనున్నాయి. ఇప్పటికే 13 రాష్ట్రాలు తక్షణమే అబార్షన్‌ను నిషేధించాయి.

    అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సుప్రీం కోర్టు తీర్పును "విషాదకరమైన తప్పిదం"గా పేర్కొన్నారు.

    అమెరికాలోని పలు నగరాల్లో నిరసనకారులు ప్రదర్శనలు చేపడుతున్నారు. ఫీనిక్స్, అరిజోనా రాష్ట్రాల్లో పోలీసులు నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాస్ ఏంజెలెస్‌లో నిరసనకారులు కొద్దిసేపు హైవేపై ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు.

    కోర్టు తీర్పు వెలువడిన వెంటనే, ఆర్కన్సాస్‌ రాష్ట్రం లిటిల్ రాక్‌లోని అబార్షన్ క్లినిక్‌లో పేషెంట్ ఏరియా మూసివేశారు. ఏడుపులు వినిపించాయి. మహిళల అపాయింట్మెంట్లు క్యాన్సిల్ చేశారు. ఆస్పత్రి సిబ్బంది అపాయింట్మెంట్ తీసుకున్న మహిళలకు ఫోన్ ద్వారా ఈ విషయన్ని తెలియజేశారు.

    అబార్షన్‌

    ఫొటో సోర్స్, REUTERS

    ఫొటో క్యాప్షన్, కొంతమంది నిరసనకారులు సుప్రీంకోర్టు న్యాయమూర్తి బ్రెట్ కావనాగ్ ఇంటి వెలుపల గుమిగూడారు