రష్యా, అమెరికా సంఘర్షణల్లో యూరప్ నలిగిపోతోందా?

వీడియో క్యాప్షన్, రష్యా, అమెరికా సంఘర్షణల్లో యూరప్ ఎవరివైపు ఉంటుంది? కారణాలేంటి?

యుక్రెయిన్‌పై రష్యా యుధ్ధానికి దిగితే, యూరప్ తన అతిపెద్ద ఇంధన సరఫరాదారుతో ఘర్షణకు దిగినట్టవుతుంది. ఎందుకంటే యూరప్‌కి సరఫరా అయ్యే ఇంధనంలో 43శాతం రష్యా నుంచే జరుగుతోంది. ఇప్పటికే దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంధన ధరలు మండిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మిన్నంటాయి. యుక్రెయిన్-రష్యా వివాదం ఆర్థిక పతనానికి ఎలా దారితీయగలదో వివరిస్తున్నారు బీబీసీ ప్రతినిధి క్రిస్ మోరిస్.

యుక్రెయిన్ సంక్షోభానికి మూలాలు ఆధిపత్య పోరులో, రష్యా ఐడెంటిటీలో ఉన్నాయి.

చమురు, గ్యాస్ వంటి ఇంధన వనరుల నియంత్రణ కూడా అందులో ఒక ముఖ్యమైన భాగం.

ఇది రెండు పక్షాలకూ వర్తించేదే.

ప్రపంచంలో ఏ మూలలో ఒక సంఘటన జరిగినా దాని ప్రభావం అంతటికీ విస్తరిస్తుందనడానికి ఇది మరో ఉదాహరణ.

ఈ అనిశ్చితి కారణంగా ముడిచమురు ధర పెరిగిపోవడంతో యూరప్‌లో పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటాయి.

దీంతో జీవన వ్యయం కూడా పెరిగిపోక తప్పదు.

ఒకవేళ రష్యాపై ఆంక్షలు విధిస్తే, పరిస్థితి మరింత దిగజారుతుంది. ఎందుకంటే, యూరప్‌కు అమెరికాతోకన్నా రష్యన్ ఆర్థికవ్యవస్థతో లోతైన సంబంధాలున్నాయి.

రష్యా చమురు, గ్యాస్ పరిశ్రమకు యూరప్‌తో విడదీయరాని సంబంధం ఉంది. పైప్‌లైన్ నెట్‌వర్క్ దానికి స్పష్టమైన సాక్ష్యం.

యుక్రెయిన్‌లో సైనిక చర్య జరిగితే, న్యూ నోర్డ్ స్ట్రీమ్ 2 గ్యాస్ పైప్‌లైన్ సేవలను ఆపెయ్యాలనేది ఒక ప్రతిపాదిత ఆంక్ష. అది రష్యాకి పెద్ద దెబ్బ అవుతుంది. అయితే ఆంక్షలు వాణిజ్యంలో రెండు పక్షాలనూ దెబ్బతీస్తాయి.

ఈయూ సహజ వాయువు దిగుమతుల్లో 41%, ముడి చమురు దిగుమతుల్లో 27% రష్యా నుంచే వస్తాయి.

ఆ గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా మరెక్కడి నుంచైనా లిక్విడ్ నేచురల్ గ్యాస్ దిగుమతి చేసుకోవడం అనేది అతి పెద్ద సవాలు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)