ట్విటర్ వర్సెస్ కేంద్రం: అనేక ప్రశ్నలు సంధించిన మంత్రి రవిశంకర్ ప్రసాద్

ఫొటో సోర్స్, Getty Images
ట్విటర్ - కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం మరింత ముదురుతోంది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విటర్‌కు అనేక ప్రశ్నలు సంధించారు.
ఒకేసారి వరుస ట్వీట్లు చేసిన ఆయన ట్విటర్‌ను టార్గెట్ చేశారు. ఆయన ఏమన్నారంటే..
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
"మే 26న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గైడ్‌లైన్స్ అమలు చేయడంలో ట్విటర్ విఫలమైంది. మా నిబంధనలు అనుసరించడానికి ట్విటర్‌కు చాలా అవకాశాలు ఇచ్చాం. కానీ అది కావాలనే వాటిని పాటించకూడదనే మార్గం ఎంచుకుంది"
విశాల భారతదేశంలాగే, దేశంలో సాంస్కృతిక వైవిధ్యం ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సోషల్ మీడియా వల్ల, ముఖ్యంగా నకిలీ వార్తల ద్వారా వ్యాపించే చిన్న నిప్పురవ్వ కూడా పెనుమంటగా మారవచ్చు. వాటిని అడ్డుకోవడం కోసమే మేం కొత్త నిబంధనలు రూపొందించాం"
"భావ ప్రకటనా స్వేచ్ఛ జెండాను మోస్తున్నట్టు ట్విటర్ తనను తాను వర్ణించుకుంటోంది. కానీ గైడ్‌లైన్స్ విషయానికి వస్తే మాత్రం నిర్లక్ష్యం చేస్తోంది. వీటితోపాటూ, ట్విటర్ భారత చట్టాలను పాటించడానికి నిరాకరిస్తోంది. యూజర్ల ఫిర్యాదులను కూడా నిర్లక్ష్యం చేస్తోంది. తన సౌకర్యం, ఇష్టాయిష్టాలను బట్టి వ్యవహరిస్తోంది"
"నకిలీ వార్తలను అడ్డుకోవడంలో ట్విటర్ ఎలా ఏకపక్షంగా వ్యవహరించిందో ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఘటనలు నిదర్శనం. వాస్తవాలను ధ్రువీకరించుకోవడం గురించి ట్విటర్ చాలా ఉత్సాహంగా ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ, ఉత్తర్‌ప్రదేశ్ సహా చాలా కేసుల్లో దాని నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తోంది"
"ఫార్మా అయినా, ఐటీ సెక్టార్ అయినా భారత కంపెనీలు అమెరికా, లేదా వేరే ఏ దేశానికైనా వ్యాపారం చేయడానికి వెళ్లినపుడు అక్కడి నియమ నిబంధనలు పాటిస్తాయి. భారత్‌లో హింసకు గురైనవారికి ఒక గళం ఇవ్వడానికి కేంద్రం నిబంధనలు రూపొందించినపుడు దానిని అనుసరించడానికి ట్విటర్ అయిష్టత చూపిస్తోంది"
"చట్ట నిబంధనలు భారత సమాజాలకు ఆధారం. భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి భారత్ రాజ్యాంగబద్ధమైన హామీని ఇస్తుంది. జీ-7లో కూడా అదే పునరుద్ఘాటించింది. భావ ప్రకటనా స్వేచ్ఛ ముసుగులో భారత చట్టాలను అనుసరించకుండా ఏ విదేశీ కంపెనీ అయినా తప్పించుకోలేదు" అని రవిశంకర్ ప్రసాద్ ట్వీట్లు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
యూజర్ల అభ్యంతరకర పోస్టులకు ఇక ట్విటర్‌పై కూడా క్రిమినల్ కేసులు
అంతకుముందు, కొత్త ఐటీ నిబంధనలు అమలు చేయకపోవడంతో ట్విటర్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు ఏఎన్ఐ తెలిపింది. ట్విటర్ 'సంధాన వేదిక'గా భారత్‌లో తన హోదాను కోల్పోనుందని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.
"కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా లేనందువల్ల ట్విటర్ ఇక మీదట భారత్‌లో 'సంధాన వేదిక'గా తన హోదాను కోల్పోనుంది" అని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు ఏఎన్ఐ ట్వీట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కేంద్రం తాజా నిర్ణయంతో యూజర్ల అభ్యంతరకర పోస్టులకు ఇకపై ట్విటర్ కూడా క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇకపై ట్విటర్‌ను యూజర్ల కంటెంట్‌ను అందుబాటులో ఉంచే ఒక సంధాన వేదికగా చూడరు.
ట్విటర్‌ను ఒక పబ్లిషర్‌లా భావిస్తారు. అందులో వచ్చే ప్రతి విషయానికి ట్విటర్ నేరుగా బాధ్యత వహించాల్సి ఉంటుంది.
అంటే యూజర్లు ఏవైనా అభ్యంతరకర పోస్టులు, వీడియోలు, ఫొటోలు పెడితే దానికి ట్విటర్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. భారత్‌లో ఉన్న చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులు, ఇతరత్రా చర్యలూ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇండియాలో ప్రస్తుతం ట్విటర్ ఒక్కటే కొత్త మార్గదర్శకాలను పాటించడం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది.
సోషల్ మీడియాలో డిజిటల్ కంటెంట్ నియంత్రణ కోసం కేంద్రం మే 26 నుంచి కొత్త ఐటీ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది.
కొత్త నిబంధనలు పాటించాలంటూ జూన్ మొదటివారంలో కేంద్రం ట్విటర్‌కు నోటీసులు జారీ చేసింది.
ఇప్పుడు అది తన సంధాన హోదాను కోల్పోనుందని ప్రభుత్వం చెప్పిందని ఏఎన్ఐ తెలిపింది.
అయితే, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి నోటీసు రాలేదని ట్విటర్ పేర్కొంది.

ఫొటో సోర్స్, YT
ముస్లిం వృద్ధుడి వీడియో కేసులో ట్విటర్‌పై ఎఫ్ఐఆర్
మరోవైపు, ముస్లిం వృద్ధుడి వీడియో కేసులో ట్విటర్, రానా అయూబ్, ఇంకా చాలా మంది జర్నలిస్టులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
మత సామరస్యాన్ని చెడగొట్టారనే ఆరోపణలతో ఉత్తర్‌ప్రదేశ్ ఘాజియాబాద్ పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసారు.
జూన్ 5న ఒక ముస్లిం వృద్ధుడిపై దాడి కేసులో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఘాజియాబాద్ పోలీసులు బీబీసీ ప్రతినిధి దిల్‌నవాజ్ పాషాకు చెప్పారు.
అయితే అబ్దుల్ సమద్ అనే ఆ వృద్ధుడి వీడియోలో ఆయన గడ్డాన్ని కట్ చేశారని, వందేమాతరం, జైశ్రీరాం అనాలని బలవంతం చేశారని చెబుతున్నారు.
తనను అడవివైపు తీసుకెళ్లారని, అక్కడ బందీగా ఉంచారని అబ్దుల్ సమద్ అందులో చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
అయితే, ఇందులో మతపరమైన కోణాలను ఘాజియాబాద్ పోలీసులు తోసిపుచ్చారు. జర్నలిస్టులు రానా అయూబ్, సబా నక్వీ, మొహమ్మద్ జుబైర్‌ల పేర్లను ఎఫ్ఐఆర్‌లో నిందితులుగా చేర్చారు.
వీరితోపాటూ ఆన్‌లైన్ న్యూస్ వెబ్‌సైట్ ద వైర్, కాంగ్రెస్ నేత సల్మాన్ నిజామీ, సమా మొహమ్మద్, మస్కూర్ అస్మానీలను కూడా నిందితులుగా పేర్కొన్నారు.
వీరంతా వాస్తవాలు ధ్రువీకరించుకోకుండానే ఈ కేసుకు మతం రంగు పులిమారని పోలీసులు ఆరోపించారు.
మత సామరస్యాన్ని చెడగొట్టాలనే ఉద్దేశంతో వీరు ట్వీట్లు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ట్వీట్లను వేల సార్లు రీట్వీట్ చేశారని ఎఫ్ఐఆర్‌లో చెప్పారు.

ఫొటో సోర్స్, up police
తర్వాత ఆ ట్వీట్లను డిలీట్ చేయలేదని, ట్విటర్ కూడా వాటిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని కూడా పోలీసులు పేర్కొన్నారు.
దాంతో, ఘాజియాబాద్ పోలీసులు ట్విటర్ మీద కూడా కేసు నమోదు చేశారు.
కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చిన తర్వాత ట్విటర్‌పై కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి.
ఇవి కూడా చదవండి:
- భారత్ - చైనా: గాల్వాన్ లోయలో ఘర్షణలు ఎలా మొదలయ్యాయి.. ఆ తర్వాత ఏం జరిగింది?
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: ఏడాది గడిచినా వీడని డెత్ మిస్టరీ
- ఉత్తరాఖండ్ జల ప్రళయం: ''సొరంగంలో 7 గంటలు ప్రాణాలను అరచేత పెట్టుకుని గడిపాం''
- టోక్యో ఒలింపిక్స్ వచ్చే నెలలో మొదలవుతాయా... ఈ క్రీడా వేడుకకు కోవిడ్ ఎమర్జెన్సీ అడ్డంకి అవుతుందా?
- సియాచిన్: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రం
- ఫ్రెంచ్ ఓపెన్ 2021: తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేజిక్కించుకున్న బార్బోరా క్రెచికోవా
- ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి... వీటిని ఆపేదెలా?
- కరోనా సేవకుడే కరోనాతో మృతి... వందల మృతదేహాలకు అంత్యక్రియలు చేసిన బృందంలో విషాదం
- చైనాలో అతి సంపన్నులపై పెరిగిపోతున్న అసహనం... సంపద ప్రదర్శనపై చిర్రెత్తిపోతున్న జనం
- లైంగిక దోపిడీ: 'అయినవారే, ఘోరాలకు పాల్పడుతుంటే అన్నీ మౌనంగా భరించే చిన్నారులు ఎందరో' - అభిప్రాయం
- కోవిడ్ వ్యాక్సీన్ పేటెంట్ వివాదం ఏంటి... ఈ హక్కులు తొలగిస్తే టీకా అందరికీ అందుతుందా?
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- భారత్‌లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
- కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్‌లో బలహీన పడుతోందా... కేసులు నిజంగానే తగ్గుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









