గోల్ఫ్ ఆడుతున్నప్పుడు డోనల్డ్ ట్రంప్‌పై దాడి చేస్తామని హెచ్చరించిన ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమైనీ

యుద్ధవిమానం నీడలో గోల్ఫ్ ఆడుతున్న ట్రంప్
ఫొటో క్యాప్షన్, విమానం నీడలో గోల్ఫ్ ఆడుతున్న ట్రంప్ ఫొటోను

గత ఏడాది ఇరాన్ మిలటరీ కమాండర్, మేజర్ జనరల్ కాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై దాడి చేయాలంటూ పిలుపునిచ్చిన ఒక సందేశాన్ని ఇరాన్ సుప్రీం నేత అలీ ఖమైనీ అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసారు.

డోనాల్డ్ ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా, పైనుంచి యుద్ధవిమానం లేదా పెద్ద డ్రోన్ వెళుతుంటే ఆ నీడ ఆయన మీద పడినట్లు ఉన్న ఫొటో అయతొల్లా అలీ ఖమైనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంది.

ఈ ఫొటోకు "ప్రతీకారం తప్పదు" అనే శీర్షిక కూడా పెట్టారు.

ఈ ఫొటోను మొట్టమొదట పోస్ట్ చేసిన @khamenei_site అనే అకౌంట్‌ను ట్విట్టర్ రద్దు చేసింది. ఈ అకౌంట్ ఫేక్ అని, ట్విట్టర్ నిబంధనలను ఉల్లంఘించిందని ట్విట్టర్ ప్రతినిధి రాయిటర్స్ వార్తా సంస్థకి తెలిపారు.

అయితే, ఆ ట్వీట్‌ను అయతొల్లా ఖమైనీ పార్శీ ట్విట్టర్ అకౌంట్‌నుంచీ రీట్వీట్ చేసారు. ఈ అకౌంట్‌కు 3,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ, తరువాత ఈ ట్వీట్‌ను కూడా తొలగించారు.

పార్శీలో రాసిన ఆ సందేశంలో "ప్రతీకారం" అనే పదం ఎర్ర రంగులో ఉంది.

"సులేమానీని హత్య చేసినవారు, ఆ హత్యను ఆదేశించినవారు మూల్యం చెల్లింక తప్పదు" అని పార్శీ భాషలో రాసి ఉంది.

అయతొల్లా ఖమైనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫొటో ప్రముఖంగా కనిపించేట్లు ఉంది. ఫొటో పక్కన, డిసెంబర్ 16న ఖమైనీ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ "ఏ సమయంలోనైనా జరగవచ్చు" అని రాసి ఉంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఈ నేపథ్యంలో ఇరాన్ నేత ట్విట్టర్ అకౌంట్ రద్దు చేయాలంటూ పలువురు వినియోగదారులు ట్విట్టర్‌ను కోరారు.

ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన ట్రంప్ అకౌంట్‌ను ట్విట్టర్ రద్దు చేసింది. మరి ఇరాన్ నేత విషయంలో ఎందుకు ఉపేక్షిస్తోందంటూ ట్విట్టర్ యూజర్స్ ప్రశ్నిస్తున్నారు.

"మాజీ అమెరికా అధ్యక్షుడిని హతమార్చాలంటూ ఇంత దారుణమైన వ్యాఖ్యలు ఎలా చేయగలరు? అలాంటి వ్యాఖ్యలు చేసినవారిని ట్విట్టర్ ఎందుకు ఉపేక్షిస్తోంది?" అని ఒక యూజర్ ఇంగ్లిష్‌లో ట్వీట్ చేసారు.

"ట్రంప్ అకౌంట్ తొలగించారు. కానీ ఈ అకౌంట్ మాత్రం ఉంచారు. ఇదేమైనా జోకా?" అని మరొకరు ట్వీట్ చేసారు.

మేజర్ జనరల్ కాసిం సులేమానీని గత ఏడాది బాగ్దాద్‌లో ఒక అమెరికా డ్రోన్ హతమార్చింది.

సులేమానీ నాయకత్వంలో ఇరాన్ అనుకూల మిలిటెంట్ బృందాలకు ఆ దేశం మద్దతు ఇచ్చింది. ఇరాక్, సిరియాలలో తమ సైనిక స్థావరాలను విస్తరించింది. సిరియాలో జరుగుతున్న దీర్ఘకాలిక అంతర్యుద్ధంలో తిరుగుబాటు బృందాలపై సిరియా చేసిన దాడిని ఇరాన్ నిర్దేశించింది.

జనరల్ సులేమానీ ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా లక్షలమంది చావుకు కారణమయ్యారని అప్పట్లో ట్రంప్ అన్నారు.

ఇందుకు ప్రతిగా, ఇరాక్ ఎయిర్‌బేస్‌లో ఉన్న అమెరికా దళాలపై ఇరాన్ వరుసగా మిసైల్స్ ప్రయోగించింది. ఇలాంటివే మరిన్ని దాడులు జరుగుతాయని హెచ్చరించింది.

దానికి తోడు, "నేరస్థులపై తీవ్రమైన ప్రతీకారం తీర్చుకోవాల్సి ఉంది" అని జనరల్ సులేమానీ వ్యాఖ్యానించారు.

అమెరికా, బ్రిటన్‌లలో అభివృద్ధి చేస్తున్న కరోనావైరస్ వ్యాక్సీన్లు "నమ్మదగినవి కావు" అంటూ ఈ నెల ప్రారంభంలో అయతొల్లా ఖమైనీ చేసిన ట్వీట్‌ను ట్విట్టర్ తొలగించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)