ఆంథొనీ ఫాచీ: ఆరుగురు అమెరికా అధ్యక్షులకు సలహాలు ఇచ్చిన వైద్యుడు.. ఒకప్పుడు ఎయిడ్స్‌‌తో, ఇప్పుడు కరోనాతో యుద్ధానికి దిగిన సైనికుడు

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో డాక్టర్ ఫాచీ

ఫొటో సోర్స్, AFP

కరోనావైరస్‌తో అమెరికా చేస్తున్న పోరాటానికి డాక్టర్ ఆంథొనీ ఫాచీ ముఖచిత్రంగా మారారు. కానీ ప్రమాదకరంగా వ్యాపిస్తున్న తప్పుడు సమాచారంతో, కొన్నిసార్లు తమ సొంత ప్రభుత్వంలోని వారితోనే ఈయన యుద్ధం చేయాల్సివస్తోంది.

వైద్య పరిశోధకుడుగా ఐదు దశాబ్దాల అనుభవం ఉన్న ఫాచీ.. దేశంలో తన దిష్టిబొమ్మలు దహనం చేస్తుంటే, ఆందోళనకారులు తనను ‘హంతకుడు’గా వర్ణిస్తుంటే, తన ఆఫీసుపై పొగబాంబులు విసురుతుంటే అన్నీ చూస్తూ తనపని తాను చేసుకుపోతున్నారు.

కానీ, అమెరికా అత్యంత తీవ్రమైన ప్రజారోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొని, అసాధ్యమైన ప్రగతిని సాధించడానికి ఆ కనికరం, ప్రశాంతతలే ఆయనకు సహకరించాయని, ఆయన దేశంలోనే అత్యంత ప్రముఖ ప్రముఖ వైద్యుడని చాలామంది ఫాచీని ప్రశంసిస్తున్నారు.

ఇంతకు ముందు 1980లలో అమెరికాలో హెచ్ఐవీ/ఎయిడ్స్ మహమ్మారి వ్యాపించిన సమయంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఇమ్యునాలజీ హెడ్‌గా ఉన్న డాక్టర్ పాచీ ఇప్పుడు 79 ఏళ్ల వయసులోనూ ఇలాంటి గడ్డు పరిస్థితినే ఎదుర్కున్నారు.

ఇప్పుడు, కోవిడ్-19తో పోరాటానికి అమెరికా ‘యుద్ధ స్థితి’లో ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించినపుడు, ఆ యుద్ధంలో ఫాచీ మళ్లీ కీలకంగా నిలిచారు.

Sorry, your browser cannot display this map