ఆఫ్రికా: ఏనుగుల వేటకు వేలంపాట

ఫొటో సోర్స్, Getty Images
ఆఫ్రికా దేశం బోట్స్‌వానా అధికారికంగా ఏనుగుల వేటకు తెర తీస్తోంది. అందుకోసం తొలిసారి వేలం పాట నిర్వహించడానికి సిద్ధమవుతోంది. గత ఏడాది అక్కడ ఏనుగుల వేటపై నిషేధం ఎత్తివేసిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రపంచంలోనే అత్యధికంగా బోట్స్‌వానాలో సుమారు 1,30,000 ఏనుగులున్నాయి.


నిర్ణీత అటవీ ప్రాంతంలో వాటిని వేటాడేందుకు అనుమతిస్తూ ఏడు వేట ప్యాకేజీలు రూపొందించినట్లు బోట్స్‌వానా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఏనుగుల జనాభా పెరగడం వల్ల తలెత్తిన మనుషులు, ఏనుగుల మధ్య సంఘర్షణను నివారించడానికి వేటపై నిషేధం ఎత్తివేసినట్లు అక్కడి ప్రభుత్వం చెబుతోంది. 2014లో అక్కడ ఏనుగుల వేటను నిషేధించారు.
నిషేధం ఎత్తివేతపై స్థానికుల నుంచి సానుకూలత వచ్చినా వన్యప్రాణి సంరక్షణ కార్యకర్తల నుంచి మాత్రం విమర్శలు వచ్చాయి.
ఈ ఏడాది 272 ఏనుగులను చంపడానికి అనుమతి
ఒక్కో ప్యాకేజీలో పది ఏనుగులను వేటాడే అవకాశం ఉండేలా ఏడు ప్యాకేజీలను ఈ వేలంలో ఆఫర్ చేస్తున్నారు. బోట్స్‌వానా రాజధాని గాబొరోన్‌లో ఈ వేలం నిర్వహిస్తున్నట్లు బీబీసీ ఆఫ్రికా దక్షిణ ప్రాంత ప్రతినిధి నామ్సా మసెకో తెలిపారు.
వేలంలో పాల్గొనే సంస్థలు బోట్స్‌వానాకే చెందినవి అయ్యుండాలన్నది నియమం. వేలంలో పాల్గొనే సంస్థలు 2 లక్షల పులా (బోట్స్‌వానా కరెన్సీ)లు డిపాజిట్‌గా చెల్లించాలి. ఇది భారత కరెన్సీలో సుమారు రూ. 13 లక్షలు ఉంటుంది.
ఈ ఏడాది 272 ఏనుగులను వేటాడి చంపుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. వేట కోసం ఎంపిక చేసిన అటవీ ప్రాంతాలన్నీ ఏనుగుల కారణంగా అక్కడ మనుషులు ఇబ్బందిపడుతున్నవేనని బోట్స్‌వానా వైల్డ్ లైఫ్ అధికార ప్రతినిధి అలీస్ మొలావా తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
నిషేధం ఎత్తివేతపై..
వేటపై నిషేధం ఎత్తివేయడం వల్ల ఏనుగుల సంఖ్య తగ్గితే అటవీ ప్రాంతాల చుట్టూ ఉన్న గ్రామాలకు ఉపశమనం దొరుకుతుందని స్థానికులు భావిస్తున్నారు.
కానీ, విమర్శకులు మాత్రం దీన్ని తప్పుపడుతున్నారు. మనిషి, ఏనుగుల మధ్య సంఘర్షణను నివారించడానికి ఇదిమీ సరైన పద్ధతి కాదని హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ వైల్డ్‌లైఫ్ డైరెక్టర్ ఆండ్రీ దెల్సింక్ అన్నారు.
ప్రస్తుత అధ్యక్షుడు మోగ్వీటీ మాసిసికి ముందు అధ్యక్షుడిగా పనిచేసిన ఇయాన్ ఖామా 2014లో ఏనుగుల వేటపై నిషేధం విధించారు.
వన్యప్రాణుల సంఖ్య తగ్గుతోందన్న కారణంతో అప్పట్లో ఈ నిషేధం విధించారు. దాన్ని మోగ్వీటీ గత ఏడాది ఎత్తివేశారు.

ఇవి కూడా చదవండి:
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- అమ్మకానికి గున్న ఏనుగులు
- ఒకదాన్నొకటి కాపాడుకునే ప్రయత్నంలో మొత్తం ఆరు ఏనుగులు మృతి
- విరాట్ కోహ్లీ మరో అయిదారేళ్లు ఆడితే... ఎన్నో ప్రపంచ రికార్డులు బద్దలవుతాయి: కపిల్ దేవ్
- కరోనావైరస్: అందర్నీ వణికిస్తున్న వైరస్ ఎన్నో ప్రాణులను కాపాడుతోంది
- ‘పిల్లలకు అన్నం పెట్టేందుకు నా జుట్టు అమ్ముకున్నా’
- ‘మోదీ.. అదే మీ ఆఖరి తప్పు అవుతుంది’: ఇమ్రాన్ ఖాన్
- బాలాదేవి: భారత మహిళా ఫుట్‌బాల్‌లో చరిత్ర సృష్టించిన క్రీడాకారిణి
- కరోనావైరస్: వధువు, వరుడు లేకుండా పెళ్లి వేడుక జరిగింది
- ఇంట్లో కుళాయి తిప్పితే మద్యం వచ్చింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








