బోరిస్ జాన్సన్: బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి

ఫొటో సోర్స్, Reuters
కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు తమ నాయకుడిగా బోరిస్ జాన్సన్‌ను బ్యాలట్ పద్ధతిలో ఎన్నుకున్నారు. దీంతో యునైటెడ్ కింగ్‌డమ్ తదుపరి ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వం, ప్రధాన మంత్రి పదవికి జరిగిన పోటీలో జెరెమీ హంట్ 46,656 ఓట్లు సాధించగా, బోరిస్ జాన్సన్‌కు 92,153 ఓట్లు లభించాయి.
బుధవారం బ్రిటన్ ప్రధాన మంత్రిగా బోరిస్ జాన్సన్ బాధ్యతలు చేపడతారు. ఈయన గతంలో లండన్ మేయర్‌గా పనిచేశారు.
‘‘థెరిసా మే ప్రభుత్వంలో పనిచేయడం తనకు లభించిన గొప్ప అవకాశమని’’ ఆమె స్థానంలో బాధ్యతలు చేపట్టనున్న బోరిస్ జాన్సన్.. కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ఎన్నికైన తర్వాత మాట్లాడుతూ చెప్పారు.
థెరిసా మే పదవీకాలం మంగళవారంతో పూర్తికానుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ బ్యాలట్ ఓటింగ్‌లో 87.4 శాతం పోలింగ్ జరగ్గా.. మొత్తం 160,000 ఓట్లు పోలయ్యాయి.
‘‘బ్రెగ్జిట్‌ను పూర్తి చేయడం, దేశాన్ని ఏకం చేయడం, జెరెమీ కార్బిన్‌ను ఓడించడం’’ తాను చేయబోయే పనులని బోరిస్ జాన్సన్ తన ప్రసంగంలో హామీ ఇచ్చారు.
అక్టోబర్ 31 నాటికల్లా బ్రెగ్జిట్ పూర్తయ్యేలా చూస్తామని, తద్వారా లభించే అన్ని అవకాశాలనూ, ప్రయోజనాలనూ అందుకుంటామని ఆయన చెప్పారు.
‘‘మళ్లీ మనం పైకెదగనున్నాం’’ అని ఆయన ప్రకటించారు.
కాగా, ప్రస్తుతం ప్రధానమంత్రిగా ఉన్న థెరిసా మే ట్విటర్ ద్వారా బోరిస్ జాన్సన్‌కు అభినందనలు తెలిపారు. తనవైపు నుంచి పూర్తి మద్దతు ఇస్తానని పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
చిన్నతనం నుంచే ‘ప్రపంచానికి రాజు’ కావాలని బోరిస్ జాన్సన్ కోరుకునేవారని, ఇప్పుడు ఆయన కన్జర్వేటివ్ పార్టీకి రాజు అయ్యారని బీబీసీ రాజకీయ వ్యవహారాల ఎడిటర్ లారా కెన్స్‌బెర్గ్ తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
కాగా, బోరిస్ జాన్సన్‌కు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అభినందనలు తెలిపారు.
‘బోరిస్ జాన్సన్ దేశ మద్దతును గెలవలేదు’ - లేబర్ పార్టీ
కాగా, బోరిస్ జాన్సన్ ఎన్నికపై లేబర్ పార్టీ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు జెరెమీ కార్బిన్ స్పందిస్తూ.. ‘‘(బోరిస్ జాన్సన్) లక్ష కంటే తక్కువ కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల మద్దతును గెలుపొందారు. కానీ దేశ మద్దతును గెలవలేదు’’ అని ట్వీట్ చేశారు.
దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలనేది దేశ ప్రజలు సార్వత్రిక ఎన్నికల ద్వారా నిర్ణయించాలని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- జలియన్ వాలాబాగ్ విషాదం బ్రిటిష్ ఇండియా చరిత్రలో మాయని మచ్చ: థెరెసా మే
- బ్లడీ సండే: బ్రిటన్ చరిత్రలోనే అదో చీకటి రోజు
- బ్రెగ్జిట్: యురోపియన్ యూనియన్‌కు ‘విడాకులిస్తున్న’ బ్రిటన్... ఎందుకు? ఏమిటి? ఎలా?
- బ్రెగ్జిట్: ఎందుకింత సంక్లిష్టం.. ఈయూ, బ్రిటన్ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి
- బ్రెగ్జిట్: విశ్వాస పరీక్షలో నెగ్గిన బ్రిటన్ ప్రధాని థెరిసా మే
- ఇరాన్ సీజ్ చేసిన బ్రిటన్ నౌకలోని 18 మంది భారతీయుల పరిస్థితి ఏమిటి
- చంద్రశేఖర్ ఆజాద్ తనను తాను కాల్చుకొని చనిపోయాడనేది నిజమేనా?
- కశ్మీర్ వివాదంపై ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని మోదీ కోరలేదు: భారత్
- విమానం ఎగిరేముందు చక్రాల చాటున దాక్కున్నాడు, పైనుంచి కిందపడి మరణించాడు
- వయసులో ఉన్న స్త్రీలు గర్భసంచులను ఎందుకు తీయించుకుంటున్నారు
- అక్కడ గ్రహాంతర జీవులున్నాయా? అందుకే ఎవరూ రావద్దని అమెరికా హెచ్చరించిందా...
- మెట్రో స్టేషన్లో మూకదాడి.. 45 మందికి తీవ్ర గాయాలు
- అంబటి రాయుడు, అతడి '3డీ' ట్వీట్‌పై ఎమ్మెస్కే ప్రసాద్ ఏమన్నారంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








