నలుగురు కాంగ్రెస్ మహిళా సభ్యులపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు... ఆయనది జాతివివక్షేనంటూ ఆరోపణల వెల్లువ

ఫొటో సోర్స్, EPA
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ జాతివివక్షపూరితమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డెమొక్రటిక్ పార్టీకి చెందిన కాంగ్రెస్ మహిళా సభ్యులను విమర్శిస్తూ ట్విటర్‌లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
ఈ మహిళలు ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైన, అత్యంత అవినీతిమయమైన దేశాల నుంచి వచ్చినవారని, వీళ్లు తిరిగి వెళ్లిపోవాలని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మహిళలు తిరిగి వెళ్లిపోయేందుకు ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోనీ ఉచితంగా ప్రయాణ ఏర్పాట్లు చేయాలన్నారు.
నల్లజాతీయులైన ఈ నలుగురు కాంగ్రెస్ సభ్యులు, స్పీకర్ పెలోసీ మధ్య ఘర్షణ తర్వాత వారం రోజులకు ట్రంప్ తాజా వ్యాఖ్యలు చేశారు.

ఫొటో సోర్స్, AFP
ఈ నలుగురు కాంగ్రెస్ సభ్యుల్లో ముగ్గురు అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్, రషీదా త్లాయిబ్, అయన్నా ప్రెస్లీ అమెరికాలోనే పుట్టి పెరిగారు. ఇల్హన్ ఒమర్ బాల్యంలో ఉండగా అమెరికాకు వచ్చేశారు.
ట్రంప్ జన్మించిన క్వీన్స్ ఆస్పత్రికి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో న్యూయార్క్ నగరంలోని బ్రోన్స్క్ ప్రాంతంలో ఒకాసియో-కోర్టెజ్ జన్మించారు.
తనపై, అమెరికాపై ఈ నలుగురు మహిళలు దుర్మార్గమైన విమర్శలు చేస్తున్నారని ట్రంప్ తన ట్వీట్లలో ఆరోపించారు.
పూర్తిగా విఫలమైన, అత్యంత అవినీతిమయమైన ప్రభుత్వాలున్న దేశాల నుంచి వచ్చిన ఈ నలుగురు 'ప్రగతిశీల' డెమోక్రాట్ కాంగ్రెస్ మహిళా సభ్యులు ప్రపంచంలోనే మహోన్నతమైన, అత్యంత శక్తిమంతమైన దేశం అమెరికాలో ప్రభుత్వం ఎలా నడవాలో ప్రజలకు చెబుతున్నారని ట్రంప్ ఎద్దేవా చేశారు.
"వాళ్లు ఏ దేశాల నుంచి వచ్చారో అవి కకావికలమై ఉన్నాయి, నేరాలతో కునారిల్లుతున్నాయి. వాళ్లు తిరిగి ఆ దేశాలకు వెళ్లి ఆ సమస్యల పరిష్కారంలో సాయపడొచ్చు కదా, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఎలా చేయాలో చెప్పొచ్చు కదా" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఈ నలుగురి పేర్లు ప్రస్తావించకుండానే అమెరికా అధ్యక్షుడు ఈ విమర్శలు చేశారు. స్పీకర్ పెలోసీ ప్రస్తావన తీసుకురావడంతో ఆయన ఈ నలుగురి గురించే అంటున్నారనే విషయం స్పష్టమైపోయింది.
ట్రంప్ వ్యాఖ్యలను స్పీకర్ పెలోసీ తప్పుబట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఇతర దేశస్థులు, ఇతర దేశాల మూలాలున్నవారి పట్ల ఎలాంటి ప్రాతిపదికలేని అపోహలు ట్రంప్ ట్వీట్లలో ఉన్నాయని ఆమె ఆక్షేపించారు. భిన్నత్వమే అమెరికా బలమని, ఐకమత్యమే అమెరికా శక్తి అని చెప్పారు.
ఈ వ్యాఖ్యలు చేసినందుకు ట్రంప్‌ను అభిశంసించాలని రషీదా త్లాయిబ్ ట్విటర్‌లో డిమాండ్ చేశారు.
ట్రంపే ఒక సంక్షోభమని, ఆయన భావజాలం ప్రమాదకరమైనదని, అదో సంక్షోభమని ఆమె విమర్శించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వానికి పోటీలో ముందువరుసలో ఉన్న బెర్నీ శాండర్స్ స్పందిస్తూ- ట్రంప్ జాతివివక్షతో మాట్లాడుతున్నారని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి:
- దుబాయ్ యువరాణి.. భర్తను వదిలి లండన్ ఎందుకు పారిపోయారు?
- చైనా ముస్లింలు: పిల్లలను కుటుంబాలకు దూరం చేస్తున్నారు
- అరబ్ దేశాల్లో మతాన్ని వదిలేసేవారు పెరుగుతున్నారు :బీబీసీ సమగ్ర సర్వే
- చంద్రయాన్ మిషన్ 2- చంద్రుని మీదకు ఉపగ్రహ యాత్ర ఎలా సాగుతుంది
- డాక్టర్ మయిల్‌స్వామి అన్నాదురై: పశువుల కొట్టం నుంచి అంతరిక్ష పరిశోధనల దాకా...
- 'నందాదేవి' పర్వతారోహణలో చనిపోయినవారు తీసుకున్న చివరి వీడియో
- అబ్ఖాజియా: ఇదో అజ్ఞాత దేశం.. దీనిని భారత్ ఇప్పటికీ గుర్తించలేదు
- భారతదేశ వాతావరణం: ఒకవైపు వరదలు, మరోవైపు కరవు... ఎందుకిలా
- అపోలో మిషన్: చంద్రుని మీద మానవుడి తొలి అడుగుకు స్వర్ణోత్సవం
- రెండు వందల రూపాయల అప్పు తీర్చడానికి 30 ఏళ్ళ తరువాత ఇండియాకు వచ్చిన కెన్యా ఎంపీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








