Eng Vs Aus : లార్డ్స్‌లో ఆస్ట్రేలియా విజయం.. స్టోక్స్ మళ్లీ పోరాడినా ఇంగ్లండ్‌కు వరుసగా రెండో ఓటమి..

ఫొటో సోర్స్, AFP
క్రికెట్ వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌కు వరుసగా రెండో పరాజయం.
క్రికెట్ మక్కాగా పిలుచుకునే లార్డ్స్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టుపై ఆస్ట్రేలియా 64 పరుగుల తేడాతో విజయం సాధించింది.
286 పరుగుల లక్స్య ఛేదనలో ఆరంభంలోనే కష్టాల్లో పడ్డ ఆ జట్టు ఇక ఏ దశలోనూ కోలుకోలేదు.
44.4 ఓవర్లలో ఆ జట్టు 221 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో స్టోక్స్ (89) పోరాడినా, చివరి దాకా అతడు నిలవలేదు.
ఆసీస్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఇంగ్లండ్‌ను దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నారు.
బెహ్రెండార్ఫ్ ఐదు వికెట్లు తీశాడు. స్టార్క్‌కు నాలుగు వికెట్లు పడ్డాయి.
అంతకుముందు, ఫించ్ సెంచరీ, వార్నర్ హాఫ్ సెంచరీ చేయడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 285-7 స్కోరు సాధించింది.
స్మిత్, కేరీ చెరో 38 పరుగులు చేశారు.
నిజానికి ఆ జట్టు ఇంకా భారీ స్కోరు చేయగలిగేదే. 32 ఓవర్లు పూర్తయ్యే సమయానికి ఆసీస్ జట్టు ఒక్క వికెట్ నష్టానికి 173 పరుగులతో ఉంది.
అయితే, ఆ తర్వాత ఇంగ్లండ్ బౌలర్లు ఆసీస్‌ను కట్టడి చేశారు. 285-7కే స్కోరును పరిమితం చేశారు.
ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్‌కు రెండు వికెట్లు పడ్డాయి. ఆర్చర్, వుడ్, స్టోక్స్, అలీ తలో వికెట్ తీశారు.
ఫించ్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు.
తొమ్మిదో వికెట్ డౌన్..
44వ ఓవర్ మూడో బంతికి ఆర్చర్ (1) క్యాచౌట్ అయ్యాడు.
ఈ వికెట్ కూడా బెహ్రెండార్ఫ్‌కే పడింది.
ఇది మ్యాచ్‌లో అతడికి ఐదో వికెట్.
ఇంగ్లండ్ స్కోరు 211 పరుగులుండగా ఈ వికెట్ పడింది.
వోక్స్ క్యాచౌట్..
బెహ్రెండార్ఫ్ వేసిన 42వ ఓవర్‌లో వోక్స్ (26) క్యాచౌట్ అయ్యాడు.
ఆ ఓవర్ పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ స్కోరు 207-8.
ఆర్చర్ (0), రషీద్ (14) క్రీజులో ఉన్నారు.
గెలవాలంటే 48 బంతుల్లో 79 పరుగులు చేయాలి.

ఫొటో సోర్స్, Reuters
మోయిన్ అలీ కూడా..
ఇంగ్లండ్ జట్టు ఏడో వికెట్ కూడా కోల్పోయింది.
బెహ్రెండార్ఫ్ బౌలింగ్‌లో మోయిన్ అలీ (6) ఆడిన బంతి ఎడ్జ్ తీసుకుంది. కీపర్ కేరీ దాన్ని ఒడిసిపట్టుకున్నాడు.
ఇంగ్లండ్ స్కోర్ 39.3 ఓవర్లకు 189-7.
స్టార్క్, బెహ్రెండార్ఫ్ చెరో మూడు వికెట్లు తీశారు.
స్టోక్స్ ఔట్..
ఇంగ్లండ్‌కు గట్టి షాక్ తగిలింది.
89 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టోక్స్ ఔటయ్యాడు. స్టార్క్ అద్భుతమైన యార్కర్‌తో అతడిని బురిడీ కొట్టించాడు.
37 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోరు 177-6.
గెలవాలంటే 78 బంతుల్లో 109 పరుగులు చేయాలి.
వోక్స్, మోయిన్ అలీ క్రీజులో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒకే ఒవర్లో మూడు ఫోర్లు
కమిన్స్ వేసిన 36వ ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి.
స్టోక్స్ రెండు ఫోర్లు, వోక్స్ ఒక ఫోర్ కొట్టారు.
వీళ్లిద్దరి భాగస్వామ్యం 50 పరుగులు దాటింది.
స్టోక్స్ (88) సెంచరీకి చేరువయ్యాడు.
35 ఓవర్లకు..
35 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ ఐదు వికెట్ల నష్టానికి 160 పరుగుల వద్ద ఉంది.
స్టోక్స్ 107 బంతుల్లో 79 పరుగులు చేశాడు.
క్రీజులో అతడితోపాటు వోక్స్ (1) ఉన్నాడు.
గెలవాలంటే ఇంగ్లండ్ 90 బంతుల్లో 126 పరుగులు చేయాలి.
క్రీజులో అతడితోపాటు వోక్స్ (11) ఉన్నాడు.
ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
ఇంగ్లండ్ ఐదో వికెట్ కూడా కోల్పోయింది.
స్టాయినిస్ వేసిన 28వ ఓవర్లో రెండో బంతికి బట్లర్ క్యాచౌట్ అయ్యాడు. బౌండరీ దగ్గర ఖవాజా అద్భుతంగా ఈ క్యాచ్ అందుకున్నాడు.
ఇంగ్లండ్ స్కోరు 30 ఓవర్లకు 135-5.
స్టోక్స్ హాఫ్ సెంచరీ
26 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ స్కోరు 117-4.
స్టోక్స్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అతడు, బట్లర్ కలిసి ఇంగ్లండ్‌ను గండం దాటించేందుకు ప్రయత్నిస్తున్నారు.
వారిద్దరూ ఐదో వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.
75 బంతుల్లో స్టోక్స్ హాఫ్ సెంచరీ పూర్తైంది.
20 ఓవర్లకు..
20 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ స్కోరు 91-4.
స్టోక్స్ (35), బట్లర్ (14) క్రీజులో ఉన్నారు.
ఐదో వికెట్‌కు వీళ్లిద్దరూ 38 పరుగులను జోడించారు.
నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
53 పరుగుల జట్టు స్కోరు వద్ద బెయిర్‌స్టో ఔటయ్యాడు. 27 పరుగులు చేసి అతడు పెవిలియన్ చేరాడు.
ఈ వికెట్ కూడా బెహ్రెండార్ఫ్‌కే పడింది.
16 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ స్కోరు 65-4.

ఫొటో సోర్స్, AFP
తొలి ఆరు ఓవర్లలోనే మూడు వికెట్లు
తొలి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ జేమ్స్ విన్స్ (0)ను మంచి ఇన్‌స్వింగర్‌తో బెహ్రెండార్ఫ్ బౌల్డ్ చేశాడు.
ఆ తర్వాత వచ్చిన రూట్ (8)ను నాలుగో ఓవర్‌లో స్టార్క్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత మరో ఓవర్‌లో అతడే ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (4) వికెట్ కూడా తీశాడు.
ఆరు ఓవర్లు ముగిసిసేరికి 26-3 స్కోరుతో ఇంగ్లండ్ ఇబ్బందుల్లో చిక్కుకుంది.
ఆస్ట్రేలియా 285-7
నిర్ణీత 50 ఓవర్లలో ఆసీస్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది.
ఫించ్ సెంచరీ సాధించాడు. వార్నర్ (53) రాణించాడు. స్మిత్, కేరీ చెరో 38 పరగులు చేశారు.
ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్‌కు రెండు వికెట్లు పడ్డాయి. ఆర్చర్, వుడ్, స్టోక్స్, అలీ తలో వికెట్ తీశారు.
ఓ దశలో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించేలా కనిపించింది. అయితే, ఇంగ్లండ్ ఆ జట్టును బాగా కట్టడి చేసింది.

ఫొటో సోర్స్, Reuters
ఆ పది ఓవర్లు
32 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 173-1 స్కోరుతో ఆ జట్టు భారీ స్కోరు సాధించేలా కనిపించింది.
అయితే, ఆ తర్వాత పది ఓవర్లలో నాలుగు వికెట్లు చేజార్చుకుని, 55 పరుగులే చేయగలిగింది. 42 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు 228-5 మాత్రమే.
41వ ఓవర్‌లో స్టాయినిస్ రనౌట్ అయ్యాడు. స్టాయినిస్ రెండో పరుగు కోసం తిరిగి వస్తుండగా, స్మిత్ అదే ఎండ్‌లో ఉండిపోయాడు.
ఆ తర్వాత వచ్చిన కేరీ కాస్త కుదురుగా ఆడాడు.
స్మిత్ (38), కాసేపటికే కమిన్స్ (1) పెవిలియన్‌కు చేరినా, చివర్లో స్టార్క్ సహకారంతో వీలైనన్ని పరుగులు పిండుకున్నాడు.

ఫొటో సోర్స్, AFP
సెంచరీ చేసి ఫించ్ ఔట్
ఆర్చర్ వేసిన 36వ ఓవర్లో రెండో బంతికి సెంచరీ పూర్తి చేసుకున్న ఓపెనర్ ఫించ్, ఆ మరుసటి బంతికే ఫైన్‌లెగ్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు 185-3.
అతడి స్థానంలో వచ్చిన మ్యాక్స్‌వెల్ (8 బంతుల్లో 12 పరుగులు) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు.
కీపర్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికి 35.2 ఓవర్లు పడ్డాయి. ఆస్ట్రేలియా స్కోరు 185-2.
ఖవాజా బౌల్డ్
ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది.
ఖవాజా (23)ను ఇంగ్లండ్ పేసర్ బెన్ స్టోక్స్ బౌల్డ్ చేశాడు. ఖవాజా ఔటయ్యే సమయానికి ఆసీస్ స్కోరు 32.2 ఓవర్లలో 173-2.
అతడి స్థానంలో స్టీవ్ స్మిత్ బ్యాటింగ్‌కు వచ్చాడు.
ఫించ్ 92 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు.
తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్
123 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది.
ఆసీస్ ఓపెనింగ్ జోడీని మోయిన్ అలీ విడదీశాడు.
అతడు వేసిన 23వ ఓవర్లో వార్నర్ రూట్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
వార్నర్ 61 బంతుల్లో వార్నర్ 53 పరుగులు చేశాడు.
అతడి స్థానంలో ఖవాజా బ్యాటింగ్‌కు వచ్చాడు.

ఫొటో సోర్స్, Reuters
20 ఓవర్లకు..
ఆసీస్ ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు.
20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆ జట్టు వికెట్లేవీ కోల్పోకుండా 110 పరుగులు చేసింది.
తొలి పది ఓవర్లు నెమ్మదిగా ఆడినా, ఆ తర్వాత వార్నర్, ఫించ్ కాస్త వేగం పెంచారు.
ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.
పది ఓవర్లకు..
ఆసీస్ ఓపెనర్లు నెమ్మదిగా ఆడుతూ 44 పరుగులు చేశారు.
వార్నర్ 22, ఫించ్ 20 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నారు.
ఇంగ్లండ్ బౌలర్లు ఆర్చర్, వోక్స్ చెరో ఐదు ఓవర్లు వేశారు.
కఠినమైన పిచ్‌పై ఈ పది ఓవర్లనూ ఆస్ట్రేలియా బాగా ఆడిందని ఆ దేశ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ అన్నాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఐదు ఓవర్లకు..
ఆస్ట్రేలియా వికెట్లేవీ కోల్పోకుండా 23 పరుగులు చేసింది.
డేవిడ్ వార్నర్ 6 పరుగుల వద్ద, ఫించ్ 15 పరుగుల వద్ద ఉన్నారు.
ఓటమి తర్వాత బరిలో ఇంగ్లండ్...
టోర్నీలో ఇప్పటివరకూ ఈ రెండు జట్లు చెరో ఆరు మ్యాచ్‌లు ఆడాయి.
భారత్‌తో ఆడిన ఒక మ్యాచ్‌లో మాత్రమే ఓడిన ఆస్ట్రేలియా 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్, శ్రీలంక చేతుల్లో ఓడిన ఇంగ్లండ్ 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.
ఓటమి తర్వాత ఆ జట్టు ఆడుతున్న మ్యాచ్ ఇది.
టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








