నాసా: అంతరిక్ష కేంద్రంలో హాలిడే.. పర్యాటకులకు అనుమతి.. ఒక రాత్రికి అద్దె రూ. 24 లక్షలు

ఫొటో సోర్స్, NASA
అంతరిక్ష టూర్‌కు వెళ్లాలన్న ఆసక్తి ఉంటే, పెట్టే బేడా సర్దుకొని సిద్ధంగా ఉండమంటోంది అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా.
2020 నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్‌ఎస్)ను సందర్శించేందుకు పర్యాటకులను అనుమతిస్తామని ఆ సంస్థ ప్రకటించింది.
ఐఎస్‌ఎస్‌లో ఉండాలంటే ఒక రాత్రికి అద్దె రూ. 24 లక్షలు.
వాణిజ్య, పర్యాటక అవసరాలకు ఐఎస్ఎస్‌ను వినియోగించుకునేందుకు అవకాశమిస్తామని నాసా పేర్కొంది.
ఏటా రెండు ప్రైవేటు అంతరిక్ష యాత్రలు జరుగుతాయని ఐఎస్ఎస్ డిప్యూటీ డైరెక్టర్ రాబిన్ గటెన్స్ తెలిపారు.
అమెరికన్ వ్యోమనౌకల్లో వెళ్లే ప్రైవేటు వ్యోమగాములు ఐఎస్ఎస్‌లో 30 రోజుల వరకూ ఉండొచ్చని నాసా పేర్కొంది.
మునుపెన్నడూ లేని రీతిలో వాణిజ్య పరమైన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు నాసా సిద్ధమైందని సంస్థ ముఖ్య ఆర్థికాధికారి జైఫ్ డెవిట్ అన్నారు.
ఈ ప్రైవేటు అంతరిక్ష యాత్రలను స్పేస్ ఎక్స్, బోయింగ్ సంస్థ అంతరిక్షయాన సంస్థలు చేపట్టనున్నాయి.
వ్యోమనౌకలో సిబ్బంది, ప్రైవేటు వ్యోమగాములకు వైద్యపరంగా, శిక్షణపరంగా అర్హతలన్నీ ఉండేలా చూసే బాధ్యత ఆ సంస్థలదేనని నాసా పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఐఎస్‌ఎస్‌లో ఉండటానికన్నా.. అక్కడికి వెళ్లి, వచ్చేందుకే ఖర్చులు భారీగా అవుతాయి.
నాసా వ్యోమగాములకైతే స్పేస్‌ఎక్స్, బోయింగ్ సంస్థలు ఒక్కో వ్యోమనౌక ప్రయాణానికి రూ.416 కోట్ల వరకూ తీసుకుంటుంటాయి. ప్రైవేటు ప్రయాణికులకు కూడా ఇదే రీతిలో ప్రయాణ ఛార్జీలు ఉండొచ్చు.
గతంలో ఐఎస్‌ఎస్‌ను వాణిజ్య అవసరాలకు వాడకుండా నాసా నిషేధం అమలు చేసింది.
నిజానికి ఈ స్టేషన్ నాసాది కాదు. 1998 నుంచి రష్యాతో కలిసి దీన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు.
ఐఎస్‌ఎస్ వాణిజ్యపరమైన వినియోగం విషయంలో కొన్ని దశాబ్దాలుగా రష్యా సుముఖంగానే వ్యవహరిస్తోంది.
2001లో అమెరికన్ వ్యాపారవేత్త డెనీస్ టిటో తొలి అంతరిక్ష పర్యాటకుడిగా రికార్డు సృష్టించారు. ఎనిమిది రోజులపాటు ఐఎస్ఎస్‌లో గడిపి తిరిగివచ్చారు. ఈ యాత్ర కోసం ఆయన రష్యాకు రూ.138 కోట్లు చెల్లించారు.
ఐఎస్ఎస్ పూర్తి ప్రైవేటీకరణ దిశగానే నాసా తాజా నిర్ణయం తీసుకుంది.
ఈ స్టేషన్‌కు 2025కల్లా నిధులను నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గతేడాది బడ్జెట్‌లో పిలుపునిచ్చారు.
2024లో చంద్రుడి పైకి అంతరిక్ష యాత్ర చేపట్టాలని ప్రణాళికలు రచించినట్లు ఇటీవలే నాసా ప్రకటించింది. తొలిసారి చంద్రుడిపైకి ఓ మహిళను తీసుకువెళ్లనున్నట్లు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
- అమెజాన్ బ్లూ మూన్: చంద్రుడి మీదికి మనుషులు, ఉపగ్రహాలు.. అక్కడే అంతరిక్ష కాలనీలు
- ట్విటర్ సంచలనం: ఒక్క ట్రిక్కుతో 50 లక్షల రీట్వీట్లు
- మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ తెరలకు అతుక్కుపోతుంటే ఏం చేయాలి
- మిషన్ శక్తి: భారతదేశ పరీక్షల అనంతరం.. అంతరిక్షంలో చెత్తపై ఆమెరికా హెచ్చరికలు
- గగన్యాన్: ముగ్గురు భారతీయులు, ఏడు రోజులు, రూ.10 వేల కోట్ల వ్యయం
- 30 ఏళ్లుగా ఈ రోజు కోసమే ఎదురుచూస్తున్నాను: రాకేశ్ శర్మ
- న్యూయార్క్ ఆకాశంలో వింత కాంతి.. ‘ఏలియన్స్ రాకకు సంకేతమా?’
- నాసా పరిశోధన: భూమి నుంచి 640 కోట్ల కిలో మీటర్ల దూరంలో 'స్నో మ్యాన్'
- ఆ ప్రొడ్యూసర్ల భార్యలే ‘ఒప్పుకోమనేవారు’
- చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
- ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్: కొత్త ట్రెండ్.. ఉపవాసాలు చేసి బరువు తగ్గుతున్నారు
- ఫ్యాక్ట్ చెక్: బీరు దొరకట్లేదని కేసీఆర్కు బ్యాలెట్ బాక్సు ద్వారా లేఖ నిజమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








