ఈ మరుగుజ్జు గ్రహానికి పేరు పెట్టే ఛాన్స్ మీదే

ఫొటో సోర్స్, HELP NAME 2007 OR10
మన సౌరవ్యవస్థలో 2007లో గుర్తించిన ఒక మరుగుజ్జు గ్రహానికి పేరు పెట్టాల్సిందిగా ప్రజలను ఖగోళ శాస్త్రవేత్తలు కోరుతున్నారు.
ఇది నెప్ట్యూన్ గ్రహానికి అవతల ఉంది.
గుర్తించినప్పటి నుంచి దీనిని (225088) 2007 ఓఆర్10గా వ్యవహరిస్తున్నారు.
ఇప్పుడు దీనికి ఒక ఆకర్షణీయమైన పేరు పెట్టాలని ప్రజలను శాస్త్రవేత్తలు కోరుతున్నారు. ఈ మరుగుజ్జు గ్రహానికి మూడు పేర్లను ప్రతిపాదించారు. వీటిలోంచి ఒకటి మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఎంపికైన పేరును పారిస్ కేంద్రంగా ఉండే అంతర్జాతీయ ఖగోళ సంఘం(ఐఏయూ)కు శాస్త్రవేత్తలు పంపిస్తారు.
ఆ మూడు పేర్లు ఏమిటంటే- కుమ్‌కుమ్, హోలో, వీలా. ఎరుపు రంగుతో సంబంధమున్న దేవుళ్ల పేర్లను శాస్త్రవేత్తలు పరిగణనలోకి తీసుకున్నారు.
ఈ పేర్ల వెనకున్న నేపథ్యం ఏమిటి?
కుమ్‌కుమ్: చైనా నీటి దేవుడు. ఎర్రటి జట్టు, సర్పం లాంటి తోక ఉంటాయి. వరదలు, బీభత్సం కుమ్‌కుమ్ సృష్టేనని చెబుతారు. కుమ్‌కుమ్ భూమికి వంపు తీసుకొస్తాడని కూడా అంటారు.
హోలో: ఈమె ఐరోపా శీతాకాల దేవత. సంతానోత్పత్తి, పునర్జన్మ, మహిళలకు సంబంధించిన దేవత.
వీలా: వీలా నోర్డిక్ దేవుడు. మంచు శక్తి వైమిర్‌ను ఓడించి, వైమిర్ శరీరంతో వీలా ఈ విశ్వాన్ని సృష్టించాడని చెబుతారు.

ఫొటో సోర్స్, NASA / JHUAPL / SWRI
మన సౌరవ్యవస్థలో ఇప్పటివరకు ఏ పేరూ పెట్టని అతిపెద్ద పదార్థం ఈ మరుగుజ్జు గ్రహమే.
ఈ మరుగుజ్జు గ్రహం కైపర్ బెల్ట్‌లో ఉంటుంది. దీని వ్యాసం 1247 కిలోమీటర్లు.
మరో మరుగుజ్జు గ్రహమైన ప్లూటో పరిమాణంలో ఇది దాదాపు సగం ఉంటుంది.
దీనికి పేరు పెట్టేందుకు నిర్వహిస్తున్న ఓటింగ్ మే 10తో ముగుస్తుంది.
ఓటు వేయాలనుకునేవారు ఈ లింక్ క్లిక్ చేయాలి.
ఆసక్తిగలవారు ఒకటి కంటే ఎక్కువసార్లు కూడా ఓటింగ్‌లో పాల్గొనవచ్చు.
ఇవి కూడా చదవండి:
- భూమిని సూర్యుడే కబళిస్తాడా?
- ‘లాటిన్ అమెరికా జాన్ ఎఫ్.కెనడీ’ ఆత్మహత్య
- ప్రపంచం అంతమైపోతుందా? ఎవరు చెప్పారు?
- శ్రీహరి కోటలో ‘రాకెట్’ రహస్యం
- 2017: సైన్స్‌లో 8 కీలక పరిణామాలివే!
- గ్రీన్ మేనిఫెస్టో: అడవులను అమ్మేవాళ్లు కాదు, కాపాడేవాళ్లు కావాలి
- BBC FACT CHECK: అడ్వాణీని అమిత్ షా అవమానించారా?
- ఉద్యోగం మానేసి పది నీటి కుంటలను శుభ్రం చేసిన యువకుడు
- లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సీజేఐ గొగోయ్ ముందుకు రానున్న ముఖ్యమైన కేసులివే
- మనిషికి ఇదే చివరి శతాబ్దమా.. డైనోసార్లలా మానవజాతి అంతం కానుందా?
- మాయావతి: అడుగడుగునా సవాళ్ళను ఎదుర్కొని ఎదిగిన ఈ దళిత నేత కల నెరవేరేనా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








