శిఖర్ ధావన్: ఆస్ట్రేలియాలో ఆడటం ఎప్పుడూ సవాలే

భారత్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఈ సందర్భంగా భారత్ వన్డే క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ బీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు.
ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లు, రోహిత్ శర్మతో బ్యాటింగ్, టెస్టుల్లో తన స్థానం.. ఇలా అనేక విషయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. శిఖర్ చెప్పిన సంగతుల కోసం ఈ కింది వీడియో చూడండి.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
శిఖర్ ధావన్ చెప్పిన విశేషాలు అతడి మాటల్లోనే...
స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు టెస్టుల్లో ఆడకపోవడం వల్ల భారత జట్టు విజయావకాశాలు మెరుగవుతాయా?
- స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్... ఇద్దరూ గ్రేట్ బ్యాట్స్‌మెన్. ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు వారి అనుభవం లాభిస్తుంది. ఆ అవకాశాన్ని భారత జట్టు ఉపయోగించుకొని సిరీస్‌లో పట్టు సాధించాలి.
టెస్టుల్లో మీ పునరాగమనం ఎప్పుడు?
- నేను నా బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తున్నా. బాగా ఆడుతున్నా. టెస్టు జట్టులో మళ్లీ చోటు దక్కించుకొని ఆటను మరింత ఆస్వాదిస్తా.
మరో ఆరు నెలల్లో క్రికెట్ వరల్డ్ కప్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఏ అంశాలపై దృష్టిపెట్టారు?
- నేను, రోహిత్ శర్మ చాలా కాలంగా ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నాం. ఆశించిన మేరకు రాణించగలుగుతున్నాం. నా ఫోకస్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ప్రపంచకప్ ఆడుతున్నా, ఎక్కడ ఆడుతున్నా.. అత్యుత్తమంగా ఆడటానికే ప్రయత్నిస్తా. మా జట్టు బలంగా ఉంది. రాబోయే వన్డే సిరీస్‌లో గెలవాలనుకుంటున్నాం. ఆస్ట్రేలియాలో ఆడటం మాకెప్పుడూ సవాలే.
ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా ఎదురయ్యే ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారు?
- నాకు ఆ ఒత్తిడి అలవాటైపోయింది. బ్యాటింగ్‌కు దిగిన ప్రతిసారీ ఆ ఒత్తిడి ఉంటుంది. కాసేపు క్రీజ్‌లో కుదురుకుంటే ఆ ఒత్తిడి దూరమవుతుందని తెలుసు. అనుభవం ద్వారా కొంత అలవాటవుతుంది. అందుకే ఎక్కువ కంగారుపడం.
ఆస్ట్రేలియాలో మీకు నచ్చిన అంశం ఏంటి?
- నాకు భారత్‌తో పాటు ఆస్ట్రేలియాలోనూ ఇల్లుంది (శిఖర్ భార్య ఆస్ట్రేలియాలో పెరిగారు). నాకు ఇక్కడ గాలి, ఆహారంలో స్వచ్ఛత, పరిసరాల్లోని ప్రశాంతత నచ్చుతాయి.
ఇవి కూడా చదవండి
- ఐన్‌స్టీన్‌కు వచ్చిన పేరు ఆయన భార్యకు ఎందుకు రాలేదు?
- మహిళలకు ప్రమాదకరమైన ప్రాంతం ఆమె ఇల్లే
- మధ్యప్రదేశ్‌లో వరుసగా మూడు దఫాలుగా బీజేపీ ఎలా గెలిచిందంటే..
- తెలంగాణ ఎన్నికలు: 'ఎన్టీఆర్‌పై ఎలా గెలిచానంటే'
- ఇందిరను ఫిరోజ్ మోసం చేశారా? ఇందులో నిజమెంత?
- ప్రతి నెలా జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే, ఈ ఆరు సూత్రాలు పాటించండి
- నమ్మకాలు-నిజాలు: పత్యం అంటే ఏమిటి? పాటించకపోతే ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








