అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గనుందన్న అంచనాలతో దిగివస్తున్న చమురు ధరలు

ఫొటో సోర్స్, Getty Images
డిమాండ్ తగ్గవచ్చనే అనుమానంతో చమురు ధరలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఎనిమిది నెలల కనిష్ఠానికి పడిపోయాయి.
అంతర్జాతీయ బెంచ్ మార్క్‌గా భావించే బ్రెంట్ క్రూడ్ 7 శాతం తగ్గి బ్యారల్ రూ.4,700కి చేరింది. మార్చి నుంచి ఇదే అత్యంత కనిష్ఠ ధర.
అదే సమయంలో వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్‌గా పిలిచే యూఎస్ ఆయిల్ 7 శాతం తగ్గి రూ.4,020కి చేరింది. గత నవంబర్ నుంచి ఇది అత్యంత కనిష్ఠ ధర.
ముడిచమురును అత్యధికంగా ఉత్పత్తి చేసే ఒపెక్ (ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్) వచ్చే ఏడాది అంతర్జాతీయంగా చమురు డిమాండ్ తగ్గవచ్చన్న అంచనా వేసిన నేపథ్యంలో ధరలు దిగివచ్చాయి.
వచ్చే ఏడాది అంతర్జాతీయ డిమాండ్ రోజుకు 12.9 లక్షల బ్యారళ్ల మేర పెరగొచ్చని అంచనా వేసింది. అయితే, గతనెల అంచనాల కన్నా ఇది రోజుకు 70వేల బ్యారెళ్లు తక్కువ.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
సోమవారం సౌదీ ఇంధన శాఖ మంత్రి ఖాలిద్ అల్ ఫలీజ్ అధిక సరఫరాను నివారించేందుకు చమురు ఉత్పత్తిని తగ్గించాలని ఒపెక్ నిర్ణయించిందని తెలిపారు.
మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలో చమురును ఉత్పత్తి చేస్తున్న దేశాలలో సౌదీ అరేబియా మొదటి స్థానంలో ఉంది.
స్వతంత్ర పరిశోధనా సంస్థ కేపిటల్ ఎకనమిక్స్.. చమురు మార్కెట్‌లో సరఫరా పెరిగిపోతోందనే ఆందోళన ఎక్కువవుతోందని, ఇదే ధరలు పడిపోవడానికి కారణమని పేర్కొంది.
అంతర్జాతీయంగా ఆర్థికాభివృద్ధి మందగిస్తున్న నేపథ్యంలో.. ఒపెక్ ప్రస్తుతం అంచనా వేస్తున్న దానికన్నా డిమాండ్ ఇంకా తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడింది.
చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో వచ్చే ఏడాది తమ చమురు ఉత్పత్తిని తగ్గించే విషయం గురించి ఆలోచిస్తున్నామని సౌదీ అరేబియా ప్రకటించిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చమురు ఉత్పత్తిని తగ్గించకూడదని ట్వీట్ చేశారు. సరఫరాకు అనుగుణంగా చమురు ధరలు ఉండాలని ట్రంప్ అన్నారు.
ఇవి కూడా చదవండి
- తెలంగాణ ఎన్నికలు: 'ఎన్టీఆర్‌పై ఎలా గెలిచానంటే'
- కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌కు సిగరెట్లు, మద్యం అలవాటు లేదు.. మరి ఆయనకు లంగ్ క్యాన్సర్ ఎలా వచ్చింది?
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గులాబీ వజ్రం ఇది
- మధుమేహం అంటే ఏమిటి? రాకుండా జాగ్రత్తపడడం ఎలా?
- మాటల్లేవ్.. మాట్లాడుకోవటాల్లేవ్: ట్రంప్ - కిమ్ ‘ప్రేమ కథ’ ముందుకు సాగదేం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








