ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గులాబీ వజ్రం ఇది

ఫొటో సోర్స్, AFP/getty
అరుదైన పింక్ డైమండ్ ఒకటి కొత్త రికార్డు సృష్టించింది. 19 క్యారెట్ల బరువున్న ఈ వజ్రం ఏకంగా 50.3 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌ల(సుమారు రూ.361 కోట్లు)లకు అమ్ముడుపోయింది.
దీంతో సగటున క్యారట్ విలువ భారతీయ కరెన్సీలో చూసుకుంటే రూ.18.7 కోట్లు పలికినట్లు లెక్క. ఇంతకుముందెన్నడూ ప్రపంచంలో ఎక్కడా గులాబీ వజ్రం క్యారట్ ధర ఇంత పలకలేదని వేలం సంస్థ క్రిస్టీస్ వెల్లడించింది.
స్విట్జర్లాండ్‌లో నిర్వహించిన ఈ వేలంలో అమెరికాకు చెందిన హ్యారీ విన్‌స్టన్ సంస్థ దీన్ని దక్కించుకుంది. వేలం ప్రారంభమైన 5 నిమిషాల్లోనే హ్యారీ విన్‌స్టన్ సంస్థ భారీ ధరకు దీన్ని తమ సొంతం చేసుకుంది.
కొత్త యజమానులు దీన్ని సొంతం చేసుకున్న అనంతరం 'విన్‌స్టన్ పింక్ లెగసీ' అని దానికి నామకరణం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణాఫ్రికాలో పుట్టింది
చిక్కని గులాబీ వర్ణంలో ఉన్న వజ్రాలే అరుదైతే అందులో ఇంతపెద్ద వజ్రం మరీ అరుదని.. అందుకే దీనికంతటి విలువని నిపుణులు చెబుతున్నారు.
వందేళ్ల కిందట దక్షిణాఫ్రికాలోని గనుల్లో ఈ వజ్రం లభించిందని.. 1920లో దీనికి సానపట్టి ఈ రూపమిచ్చారని క్రిస్టీస్ సంస్థ తెలిపింది.
ఒకప్పుడు 'డిబీర్స్' సంస్థను నడిపించిన ఓపెన్‌హైమర్ కుటుంబం వద్ద ఇది ఉండేదని... ప్రపంచంలోని అద్భుత వజ్రాల్లో ఇదొకటని వేలంసంస్థ క్రిస్టీస్ జ్యూయలరీ విభాగా ఇంటర్నేషనల్ హెడ్ రాహుల్ కడాకియా తెలిపారు.
10 క్యారెట్ల కంటే ఎక్కువ బరువున్న స్వచ్ఛమైన పింక్ డైమండ్లు అరుదని చెప్పారు. ముదురు గులాబీ వర్ణంలో ఉన్న ఇలాంటి వజ్రాలైతే ఒక క్యారెట్ కంటే ఎక్కువ బరువున్నవి ఉండవన్నారు.
కాగా గత ఏడాది నవంబరులో 8.41 క్యారెట్ల బరువున్న పింక్ డైమండ్ ఒకటి హాంకాంగ్‌లో వేలంలో రూ.125 కోట్లకు విక్రయమైంది. అంటే క్యారెట్ విలువ సుమారు రూ.15.15 కోట్లు పలికింది. ఇప్పుడీ పింక్ డైమండ్ దాన్ని మించిపోయింది.
ఇవి కూడా చదవండి:
- మధుమేహం అంటే ఏమిటి? రాకుండా జాగ్రత్తపడడం ఎలా?
- మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయ సైనికుల త్యాగాలు ఎందుకు వృథా అయ్యాయి?
- తెలంగాణ ఎన్నికలు: 65 మందితో కాంగ్రెస్ తొలి జాబితా
- ఆంగ్ సాన్ సూచీకి ఇచ్చిన అవార్డును వెనక్కి తీసుకున్న ఆమ్నెస్టీ
- ఇజ్రాయెల్-గాజా: మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు
- జాతీయవాదం పేరిట వ్యాప్తి చెందుతున్న ఫేక్ న్యూస్ - బీబీసీ తాజా పరిశోధనలో వెల్లడి
- ‘ఫేక్‌న్యూస్ మూలాలు మహాభారతంలోనూ ఉన్నాయి’ - మాడభూషి శ్రీధరాచార్యులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)








