దక్షిణాఫ్రికా: 'నాజీ మండేలా' చిత్రంపై వివాదం

నాజీ మండేలా

ఫొటో సోర్స్, AYANDA MABULU

జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాడిన నెల్సన్ మండేలా నాజీ సెల్యూట్ చేస్తున్నట్టు వేసిన చిత్రం వివాదాస్పదం అవుతోంది. కానీ దాన్ని వేసిన దక్షిణాఫ్రికా చిత్రకారుడు మాత్రం తను చేసిన పనిని సమర్థించుకున్నారు.

జొహన్నెస్‌బర్గ్ ఆర్ట్ ఫెయిర్‌లో ప్రదర్శించిన ఈ కళాఖండాన్ని 'అయండ మబులు' వేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి.

మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాను దక్షిణాఫ్రికాలో చాలా మంది అభిమానిస్తారు. తెల్లవారి పాలనకు ముగింపు పలికిన నేతగా ఆయన్ను కీర్తిస్తారు.

"దక్షిణాఫ్రికాలో పేదరికంలో మగ్గిపోతున్న నల్లవారి తరపున నేను మాట్లాడుతున్నాను" అని మబులు చెప్పారు.

"వారి కలలు నిజం చేయడంలో మండేలా విఫలం అయ్యారు. ఆయన హిట్లర్‌తో సమానం అయిపోయారు" అని మబులు బీబీసీతో అన్నారు.

మబులు జర్మన్ నాజీ జెండాపై మండేలాను చిత్రీకరించినట్లు ఈ కళాఖండంలో కనిపిస్తోంది. ఇతరుల మనోభావాలను కించపరిచినట్టు కనిపించడంతో ఎఫ్ఎన్‌బీ ఆర్ట్ ఫెయిర్ నుంచి దీన్ని తీసేసినట్టు చెబుతున్నారు.

ఫెయిర్‌లో ఆ కళాఖండం ప్రదర్శించాలని తాను అనుకోలేదని, ఈవెంట్ ఆర్గనైజర్ల పొరపాటు వల్లే అలా జరిగిందని మబులు చెప్పారని స్థానిక మీడియా పేర్కొంది.

నాజీ మండేలా

ఫొటో సోర్స్, Getty Images

నెల్సన్ మండేలా బలిపశువు అయ్యారా?

- పుమ్జా ఫిహ్లానీ, బీబీసీ ప్రతినిధి, జొహన్నెస్‌బర్గ్

అయండ మబులు వివాదాస్పద చిత్రంపై దక్షిణాఫ్రికా ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయారు. నెల్సన్ మండేలా ఫౌండేషన్‌ను ఉద్దేశించి ఆయన వేసిన ఈ చిత్రం భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

మండేలా పేదలను ఓడించారని మబులు చెప్పారు. మైనారిటీ పాలకులపై పోరాడుతూ మేండేలా 27 ఏళ్లు జైల్లో గడిపారు. జాతివివక్ష వ్యతిరేకంగా పోరాడిన మండేలాను నాజీలతో పోలుస్తూ చిత్రాన్ని గీసి మబులు అతి చేశారా?

రాజకీయ నాయకులను మబులు లక్ష్యంగా చేసుకోవడం ఇది మొదటిసారి కాదు. గతంలో మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాను ఒక లైంగిక చర్యలో పాల్గొన్నట్టు వేసిన వివాదాస్పద చిత్రాన్ని కూడా ఆయన మద్దతుదారులు సమర్థించుకున్నారు, చిత్రం ఎంత షాకింగ్‌గా ఉన్నప్పటికీ కళాకారులకు తమ అభిప్రాయాలు చెప్పే హక్కు ఉంటుందని అన్నారు.

కానీ చనిపోయిన తర్వాత కూడా మండేలాకు ప్రపంచమంతా అత్యున్నత గౌరవం లభించింది. గత కొన్నేళ్లుగా దక్షిణాఫ్రికా పేద యువకులు తమ సామర్థ్యం నిరూపించుకోడానికి పోరాటం చేస్తున్నారు, వారిలో చాలా మంది మండేలాను విమర్శిస్తున్నారు.

నాజీ

ఫొటో సోర్స్, AYANDA MABULU

మండేలా విమర్శలకు దూరంగా పారిపోయేవారని చెబుతారు. ఆ వాస్తవం తెలిసినవారికి ఈ కళాఖండం దాడిలా కాదు, ద్రోహపూరితంగా అనిపిస్తోంది.

నాజీ నేత అడాల్ఫ్ హిట్లర్ ఒక హంతకుడు, జాత్యహంకారి. అయితే లోపాలు ఉన్నప్పటికీ మండేలా శాంతికాముకులు. జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. చరిత్రను ఎప్పుడూ తప్పుగా చెప్పకూడదు.

మబులు తనపై కేసులు వేసే అవకాశం ఉన్నా పట్టించుకోనని అంటున్నారు. "నేను పేదల్లో ఒకడిని. కేసుల వల్ల నేను పోగొట్టుకునేదేం లేదు. వాళ్లు నాపై కేసు గెలుస్తారని నాకు తెలుసు. కానీ నా నోరు మాత్రం ఎప్పటికీ మూయించలేరు" అన్నారు.

సోషల్ మీడియాలో చాలా మంది ఈ విషయంలో మండేలా ఫౌండేషన్‌కు మద్దతు ఇస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)