అహ్మదాబాద్ వరుస పేలుళ్లు: తీర్పు గురించి బీజేపీ చేసిన ట్వీట్‌ను ట్విట్టర్ ఎందుకు తొలగించింది? ఆ ట్వీట్‌లో ఏముంది?

ఫొటో సోర్స్, KALPIT BHACHECH
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు తీర్పు గురించి గుజరాత్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారిక ఖాతా నుంచి ఒక ట్వీట్ చేసింది. దీనిపై వివాదం చెలరేగడంతో ట్విట్టర్ ఆ ట్వీట్‌ను తొలగించింది.
ఈ కేసులో ఫిబ్రవరి 18న ప్రత్యేక న్యాయస్థానం తీర్పును వెలువరించింది. 49 మంది నిందితుల్లో 38 మందికి ఉరిశిక్ష, 11 మందికి జీవితఖైదు విధించింది.
తీర్పు వచ్చాక గుజరాత్ బీజేపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక వ్యంగ్య చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఒకేసారి చాలామంది ఉరికంబం వద్ద ఉన్నట్లు వ్యంగ్యచిత్రాన్ని వేశారు.
''సత్యమేవ జయతే... తీవ్రవాదులకు క్షమాపణ ఉండదు'' అని దానికి వ్యాఖ్యను జోడించారు.
అయితే, ఆ వ్యంగ్య చిత్రంలో ఉరికంబం వద్ద ఉన్న వ్యక్తులు ఒక నిర్దిష్ట మతానికి చెందినవారిగా చూపించడంతో... జనాలు తీవ్రంగా స్పందించడం మొదలుపెట్టారు.
వివాదం ముదరడంతో ఈ ట్వీట్‌ను ట్విట్టర్ తొలగించింది.
బీజేపీ ఏం చెబుతోంది?
ఈ అంశం గురించి గుజరాత్ బీజేపీ అధికార ప్రతినిధి యామల్ వ్యాస్, బీబీసీతో మాట్లాడారు. ''నేరం చేసిన వారికి శిక్ష విధిస్తున్నట్లుగా చెప్పడమే ఆ ట్వీట్‌లోని అంతరార్థం. పేలుళ్లకు పాల్పడిన నేరస్థుల ఫొటోల ఆధారంగా ఆ స్కెచ్‌ను రూపొందించారు. అంతేగానీ ఒక వర్గానికి వ్యతిరేకంగా దాన్ని రూపొందించినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవు'' అని అన్నారు.
గుజరాత్ బీజేపీ మీడియా సెల్ కన్వీనర్ యజ్ఞేష్ కూడా దీని గురించి బీబీసీతో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ''ఈ తీర్పును అత్యంత అరుదైనదిగా పిలవొచ్చు. తీర్పు తర్వాత అందరి నిందితుల ఫొటోలు అన్ని వార్తా పత్రికల్లో, టీవీల్లో కనిపించాయి'' అని చెప్పారు.
''వాటి ఆధారంగానే క్యారికేచర్ రూపొందించారు. అందులో ఉరికంబాన్ని గీశారు. ఆ చిత్రాన్నే ట్వీట్ చేశారు. కానీ తీవ్రవాదానికి మద్దతుగా నిలిచే కొన్ని సంఘ విద్రోహ శక్తులు ఈ ట్వీట్ గురించి ఫిర్యాదు చేశాయి. అందుకే ట్విట్టర్ తొలిగించింది'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, NANDAN DAVE
గుజరాత్ కాంగ్రెస్ ఏం అంటోంది?
''తీవ్రవాదానికి, మతానికి ఎలాంటి సంబంధం ఉండదు. ఈ విషయం కాంగ్రెస్‌కు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. తీవ్రవాదం కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ప్రధానమంత్రులను కోల్పోయింది'' అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో గుజరాత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ డోషి అన్నారు.
''కోర్టు తీర్పును అదునుగా తీసుకున్న బీజేపీ, వివాదాస్పద ట్వీట్లతో సంబరాలు చేసుకుంటోంది. ఇలాంటి తీర్పులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోకూడదు'' అని వ్యాఖ్యానించారు.
ప్రజలు ఏం అంటున్నారు?
బీజేపీ ట్వీట్‌ను అమెరికా ముస్లిం స్కాలర్ ఒమర్ సులేమాన్ ఖండించారు. ''ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి చెందిన అధికార పార్టీ ఇలాంటి ఫొటోను ట్వీట్ చేసిందంటే... మనం ఎటువైపు నడుస్తున్నామో స్పష్టం అవుతుంది'' అంటూ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
జర్నలిస్ట్ రాహుల్ పండిత కూడా ఈ అంశంపై తన అభిప్రాయాన్ని రాసుకొచ్చారు. ''ఇది చాలా అవమానకర చర్య. ఇందులో ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నట్లు కూడా మనం అర్థం చేసుకోవాలి'' అని ట్వీట్‌లో రాసుకొచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ట్వీట్‌లో జాతీయ చిహ్నాన్ని వినియోగించడం పట్ల షహీన్ అనే యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ''మైనారిటీ వర్గాలపై ద్వేషాన్ని చిమ్మడానికి జాతీయ చిహ్నాన్ని ఇలా కూడా దుర్వినియోగం చేసుకునేందుకు అనుమతి ఉంటుందా? ముస్లింలను లక్ష్యంగా చేస్తోన్న, జాతీయ చిహ్నాన్ని అవమానిస్తోన్న ఈ ట్వీట్‌ను తక్షణమే తొలిగిస్తారని ఆశిస్తున్నా'' అని ఆయన రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే... 'అధికార పార్టీ చేసిన జాతి విధ్వంసానికి సంబంధించిన ఈ కార్టూన్ వారి ఉద్దేశాలను ప్రతిబింబిస్తోంది. అంతేకాకుండా వారు జాతీయ చిహ్నాన్ని కూడా వాడుకున్నారు. అధికార పార్టీ విధానాల్లో ఇది కూడా ఒక భాగమేనా అనేదానిపై ఐటీ మంత్రి స్పష్టత ఇవ్వాలి. లేని పక్షంలో నేరస్థులను అరెస్ట్ చేయాలి'' అని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
‘‘ట్విట్టర్ ఇండియా.. దీన్ని మీరు ఎలా అనుమతించారు? అని’’ నటి శ్రుతి షేత్ ప్రశ్నించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
ఖల్సా ఎయిడ్ వ్యవస్థాపకులు, మానవతావాది రవీందర్ సింగ్ కూడా దీనిపై స్పందించారు. ''ఇది నేరం. భారత్‌లో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన అధికారిక ఖాతా నుంచి ఇలాంటి ట్వీట్ వచ్చింది. వారు జాతిహత్యకు పూనుకున్నట్లుగా అనిపిస్తోంది'' అని ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, KALPIT BHACHECH
నిందితులకు ఎలాంటి శిక్ష పడింది?
2008లో జరిగిన అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రత్యేక కోర్టు మొత్తం 49 మందిని దోషులుగా తేల్చింది. వీరిలో 38 మందికి ఉరిశిక్ష, 11 మందికి జీవితఖైదు విధించింది. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ), భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 302 కింద కోర్టు ఈ శిక్షలను విధించింది.
అంతకుముందు 77 మంది నిందితుల్లో 28 మందిని నిర్దోషులుగా ప్రకటించింది.
పేలుళ్లలో మరణించిన వారి కుటుంబాలకు లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించాలని తీర్పు సందర్భంగా న్యాయమూర్తి ఏఆర్ పటేల్ ఆదేశించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేలు, స్వల్ప గాయాలైనవారికి రూ. 25 వేలు ఇవ్వాలని పేర్కొంది.
2008 జూలై 26న అహ్మదాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో కేవలం 70 నిమిషాల వ్యవధిలో 21 బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 56 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు.
ఇండియన్ ముజాహిదీన్, హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లామీ తీవ్రవాద సంస్థలు ఈ పేలుళ్లకు బాధ్యత వహించాయి.

ఇవి కూడా చదవండి:
- లాలూ ప్రసాద్ యాదవ్‌కు దాణా కేసులో అయిదేళ్ల జైలు శిక్ష, రూ.60 లక్షల జరిమానా
- మిల్లెట్లతో బిస్కెట్లు తయారు చేయాలనుకుంటున్నారా, చిరుధాన్యాల ఉత్పత్తిలో ఆసక్తి ఉందా...
- మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం
- మాయావతి, ములాయం సింగ్‌ల మధ్య వైరం పెంచిన గెస్ట్‌హౌస్ ఘటన, ఆ రోజు ఏం జరిగిందంటే..
- కరోనా నుంచి కోలుకున్నాక గుండె పోటు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి
- ‘చారిత్రక కట్టడాల దగ్గర సెల్ఫీలు తీసుకోవడం కాదు.. అవి చెప్పే కథలు వినాలి’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)