IPL: హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్, రూ. 2.2 కోట్ల సొత్తు స్వాధీనం

ఫొటో సోర్స్, UGC
- రచయిత, సురేఖ అబ్బూరి
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్‌లో ఐపీఎల్ బెట్టింగులకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు.
ఇప్పటివరకూ 23 మందిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్ఓటీ).. వారి నుంచి రూ.93 లక్షల నగదుతోపాటూ, భారీగా బెట్టింగ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
సైబరాబాద్ పరిధిలోని ఏడు ప్రాంతాల్లో ఈ ముఠా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తోందని పోలీసులు చెప్పారు.
వీటిలో మియాపూర్‌లో ఒకటి, బాచుపల్లిలో మూడు, గచ్చిబౌలిలో రెండు, మైలార్‌దేవపల్లిలో ఒక కేంద్రం ఉన్నాయి.

ఫొటో సోర్స్, cyberabad police
బెట్టింగ్ ముఠా దగ్గర నుంచి రూ.93 లక్షలతోపాటూ 14 బెట్టింగ్ బోర్డులు, 28 స్మార్ట్‌ఫోన్లు, 247 ఫోన్లు, ట్యాబ్స్, లాప్‌టాప్స్, టీవీలు, 5 కార్లు స్వాధీనం చేసుకున్నారు.
వీటి మొత్తం విలువ సుమారు రూ.2.2 కోట్లు ఉంటుందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు.
ఈ ముఠా ఒక యాప్ ద్వారా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తోందని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఫొటో సోర్స్, cyberabad police
మొత్తం నాలుగు అంచెల్లో ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ప్రధాన బుకీకి అనుసంధానంగా వ్యవహరించే మిగతావారు మొబైల్ యాప్స్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు అని పోలీసులు తెలిపారు.
ఫాన్సీ లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్, లైవ్ లైన్ గురు, క్రికెట్ మజా, లోటస్ బెట్-365, బెట్ ఫెయిర్ లాంటి యాప్స్ ద్వారా ఈ బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నారని పోలీసులు చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
ఈ కేసులో విజయవాడ, గుంటూరు, కేపీహెబీ, ముంబయి, రాయచూరుకు చెందిన మరికొందరు బుకీల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బెట్టింగ్ యాప్‌లకు ప్రజలు దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఆన్‌లైన్ బెట్టింగ్‌కు సహకరిస్తున్న యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించాలని ఆ సంస్థ యాజమాన్యానికి లేఖ రాస్తామని సీపీ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు .
ఇవి కూడా చదవండి:
- సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగానే ఎందుకు జరుపుకోవాలి? - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాసం
- డన్‌కర్క్: ‘చరిత్ర చెప్పని, పుస్తకాల్లో చోటు దక్కని’ 300 మంది భారత సైనికుల కథ
- మోదీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేవారే లేరా
- యలవర్తి నాయుడమ్మ: వరి పొట్టు నుంచి సిమెంటు తయారు చేయవచ్చన్న ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త
- పీవీ నరసింహారావు, మన్మోహన్లు సంక్షోభంలో అవకాశాలను ఎలా అందిపుచ్చున్నారు ?
- పీవీ నరసింహారావు: 65 ఏళ్ల వయసులో సొంతంగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్న నాయకుడు
- బియ్యం, పంచదార కోసం భారీ క్యూలైన్లు, ప్రభుత్వ చర్యల వల్లే ధరలు పెరిగాయా?
- ‘నువ్వు కూడా దళితుడివే అయ్యుంటావ్, అందుకే ఈ ప్రశ్న అడుగుతున్నావ్’
- ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు పెంచడం వల్ల ప్రజలు తాగడం మానేశారా
- 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఇక సాధారణమైపోతాయా
- అడాల్ఫ్ హిట్లర్: ఆర్యుల మూలాలు కనుక్కోవాలని పరిశోధకులను హిమాలయాలకు పంపినప్పుడు ఏమైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










