చూపు కోల్పోయిన టీచర్ హిమానీ కేబీసీలో కోటి గెలిచారు.. ఆమె కథ ఇదీ
దేశవ్యాప్తంగా తనకు గుర్తింపు వస్తుందని ఆగ్రాకు చెందిన హిమానీ బుందేలా కలలో కూడా అనుకోలేదు. ఆమె మేధస్సుపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ప్రశంసలు కురిపించారు.
25ఏళ్ల వయసులోనే ''కౌన్ బనేగా కరోడ్‌పతి'' సీజన్ 13లో ఆమె తొలి కరోడ్‌పతిగా నిలిచారు. ఆమె విజయం ఎంతో ప్రత్యేకమైంది. ఎందుకంటే కంటి చూపు సరిగా లేకపోయినా షోలో ఆమె కోటి రూపాయలు గెలుచుకోగలిగారు.
హిమానీకి 15ఏళ్ల వయసున్నప్పుడు ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో ఆమె కంటిచూపు మసకబారింది. మళ్లీ ఆమెకు మునుపటిలా కంటి చూపు రావడానికి వైద్యులు నాలుగు శస్త్రచికిత్సలు చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది.
అయితే, హిమానీ ధైర్యం కోల్పోలేదు. జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు. తమ కుటుంబంలో ప్రభుత్వం ఉద్యోగం పొందిన తొలి వ్యక్తిగా నిలిచారు.
ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయాలో హిమానీ టీచర్‌గా పనిచేస్తున్నారు. బాల్యం నుంచి కరోడ్‌పతిగా మారడం వరకు తన జీవిత విశేషాలు ఆమె మాటల్లోనే చూద్దాం.
ఇవి కూడా చదవండి:
- ''ప్రజలను గౌరవించండి, మనం వారి సేవకులం'' -ఫైటర్లతో తాలిబాన్
- ‘తాలిబాన్ల రాకతో శాంతి వెల్లివిరుస్తుంది’ - పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది
- ‘బుర్ఖా వేసుకుని, మారువేషంలో 11 చెక్పాయింట్లను దాటి వెళ్లా. కానీ..’
- ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా.. తాలిబాన్‌ను ఎందుకు ఓడించలేకపోయింది?
- తాలిబాన్లు అధికారంలోకి రావడం వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం
- ‘పాకిస్తాన్ మాట వినకపోతే.. ప్రపంచానికి పెద్ద సమస్య తప్పదు’ - పాక్ మంత్రి ఫవాద్
- అఫ్గానిస్తాన్: ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పాక్ సరిహద్దుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు
- తాజా నర మాంసాన్ని మేలైన ఔషధంగా ప్రాచీన వైద్య నిపుణులు ఎందుకు భావించేవారు?
- 'భారత అధికారుల్ని తీసుకొస్తుంటే తాలిబాన్లు చుట్టుముట్టిన వేళ..' : తెలుగు కమాండో రాజశేఖర్ స్వానుభవం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)