పెగాసస్ స్పైవేర్: ‘హోం మంత్రి అమిత్ షాను తొలగించండి’ - కాంగ్రెస్ డిమాండ్

రాహుల్ గాంధీ, అమిత్ షా

ఫొటో సోర్స్, Getty Images

పెగాసస్ స్పైవేర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫోన్ కూడా ట్యాప్ అయిందన్న ఆరోపణలు రావడంతో ఆ పార్టీ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు.

కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా తాజాగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి హోం మంత్రి అమిత్ షాను తొలగించాలని డిమాండ్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

''జర్నలిస్టులు, న్యాయమూర్తులు, విపక్ష నాయకులపై నిఘా పెట్టడం, వారి ఫోన్లు ట్యాప్ చేయడమనేది ప్రజాస్వామ్యానికి పెను ముప్పు'' అన్నారాయన.

ప్రధానికి 6 ప్రశ్నలు

అమిత్ షా, నరేంద్ర మోదీలను విచారించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, అధిర్ చౌదరి, రణదీప్ సింగ్ సూర్జేవాలాలు ఒక ప్రకటన విడుదల చేశారు.

అందులో వారు ప్రధానికి 6 ప్రశ్నలు సంధిస్తూ, దేశ ప్రజలకు ప్రధాని సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు.

1) భారతదేశ భద్రతా దళాలు, న్యాయవ్యవస్థ, కేబినెట్ మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులపై విదేశీ సంస్థతో గూఢచర్యం చేయించడం రాజద్రోహం కాదా? జాతీయ భద్రత విఘాతం కాదా?

2) 2019 ఎన్నికలకు ముందు, ఆ తరువాత కూడా మోదీ ప్రభుత్వం ప్రజలు, రాజకీయ నాయకులపై ఎందుకు నిఘా పెడుతోంది?

3) ఇజ్రాయెల్ కంపెనీ నుంచి ఈ అక్రమ స్పైవేర్ కొనడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? ప్రధాన మంత్రా? హోం మంత్రా? దీనికోసం ఎంత ఖర్చు చేశారు?

4) 2019లో ఈ స్పైవేర్ అక్రమ కొనుగోలు వ్యవహారం బయటకొచ్చినా ఇంతవరకు ఎందుకు మౌనంగా ఉంది?

5) హోం మంత్రి అమిత్ షాపై ఎందుకు వేటు వేయకూడదు?

6) ఈ వ్యవహారంలో ప్రధాని, హోం మంత్రి పాత్రపై దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదా?

బీజేపీ ప్రతివిమర్శలు

మరోవైపు కాంగ్రెస్ విమర్శలను బీజేపీ నేత, ఐటీ, న్యాయ శాఖ మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తిప్పికొట్టారు.

''50 ఏళ్లు ఈ దేశాన్ని పాలించిన పార్టీ చేయాల్సిన విమర్శలు కావు ఇవి, కాంగ్రెస్ పార్టీ విమర్శలు స్థాయికి తగ్గట్టుగా లేవ''ని ఆయన అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న సమయంలో పెగాసస్ వ్యవహారం ఒక్కసారిగా ఎందుకు తెర మీదకు వచ్చిందని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు.

''ట్రంప్ భారత్‌లో పర్యటించిన సమయంలో అల్లర్లు జరిగాయి.. 2019 ఎన్నికలకు ముందు పెగాసస్ కథలు ప్రచారంలోకి తెచ్చారు, ఇప్పుడు పార్లమెంటు సమావేశాల సమయంలో మరోసారి పెగాసస్ వార్తల్లోకి తెచ్చారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడంతా ఏదో ఒకటి చేస్తున్నారు'' అని ఆయన అన్నారు.

పెగాసస్ వ్యవహారానికి తమ ప్రభుత్వానికి, బీజేపీకి సంబంధం ఉన్నట్లు ఒక్క ఆధారం కూడా లేదు అని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

పార్లమెంటులో ప్రభుత్వం ఏం చెప్పింది?

కేంద్ర టెలికం, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో దీనిపై మాట్లాడారు. పార్లమెంటు సమావేశాలకు ఒక రోజు ముందు కొన్ని వెబ్‌సైట్లలో దీనిపై వార్తలు రావడం యాదృచ్ఛికమేమీ కాదని ఆయన అన్నారు.

అంతా ఉద్దేశపూర్వకంగా జరుగుతోందని మంత్రి ఆరోపించారు.

ఈ సాఫ్ట్‌వేర్ తయారు చేసిన సంస్థ కూడా ఈ ఆరోపణలను ఖండించిందని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)